Monday, November 18, 2024

ఉన్నత స్థానాన్ని కల్పించేది శాంతి మార్గమే!

సత్యము, ధర్మము అయిన శాంతియుత పోటీ వ్యక్తికి ఉన్నత స్థానాన్ని కల్పిస్తుం దనే సందేశం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది.
”స్పర్ధయా వర్ధతే విద్యా” ———————

ఈ సంస్కృత వాక్యానికి అర్థం ”పోటీ ఉన్నప్పుడు విద్య వృద్ధి చెందుతుంది” అని. స్పర్ధ అంటే పోటీ, పోలిక, విరోధము, అభిప్రాయ భేదము అనే అర్థాలున్నాయి. ఈర్ష్య, అసూయ లేని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడు సాధారణ విద్యలోనే కాక, సంగీత, సాహ త్య, ఆర్థిక, వ్యాపార, క్రీడల వంటి రంగాలలో ఎవరైనా ఉన్నతిని సాధిం చవచ్చును. అలాకాక విద్వేష, ఈర్ష్యా పూరితమైన పోటీ వ్యక్తి లేక సంస్థ పతనానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన పోటీ వలన లాభపడి, అందలం ఎక్కినవారు, మద మాత్సర్యాలతో కూడిన పోటీ వలన అథో గతి పాలైనవారు ఎందరో ఉన్నారు. బాగుపడిన మహనీయులను గురించి తెలుసుకొందాం.
పురాణాలలో నారద-తుంబురుల మధ్య సంగీతపరమైన పోటీ ఉండేదని చెప్ప బడిం ది. ఇద్దరూ పరమ దైవభక్తులే! ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు తన ను సేవిస్తూండగా, వైకుంఠంలో కొలువు తీరి ఉన్నాడు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, కణ్వు డు, విశ్వామిత్రుడు మొదలైన మునిగణం అంతా వచ్చారు. అందరితోబాటు నారద, తుంబు

రులు కూడా విష్ణుమూర్తి సేవకై వచ్చి ఉన్నారు. స్తోత్ర పాఠాలు చిద్విలాసం గా వింటున్నాడు శ్రీమహావిష్ణువు. ఇంతలో మహా తేజస్సుతో, కాలిమువ్వల కింకిణీ నాదాలతో, ధగద్ధగాయ మానమైన అద్భుత కాంతిని ప్రసరింపజేస్తూ, అందమైన #హంసయానంతో, దాసదాసీ జనంతో కూడి, జగన్మాత లక్ష్మీదేవి సభలో ప్రవేశించింది. వెంటనే విష్ణు సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుని ఆజ్ఞతో వేత్రహస్తులైన (కర్రలు పట్టుకొని ఉన్న) భటులు కొలువులో ఉన్నవారం దరినీ బెత్తాలతో మోది, అదిలిస్తూ, అందరూ భయభ్రాంతులతో అక్కడ నుండి పరిగెత్తేలా చేశారు. బ్రహ్మ అంతటివాడే భయపడి పారిపోగా నారదాదుల మాట చెప్పాల్సిన పనేలేదు. అప్పుడు విష్ణు భటులు వెనుకనుండి గట్టిగా ”ఓహూ! తుంబురుడా! స్వామి రమ్మంటున్నా రు!” అని పిలిచి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు. తుంబురుని మాత్రమే ఎందుకు తీసు కువెళ్ళారు. కారణం ఏమై ఉంటుంది అని వైకుంఠం ద్వారాల బయట నిలబడి అందరూ అనుకోసాగారు. బహుశ: సంగీతం విష యం చర్చించడానికేమో అని కొందరంటే, ఈయ న తప్ప సంగీత, వీణానాద కళలో విశారదులు ఇంక ఎవరూ ఇక్కడలేరు కాబోలు అని మరి కొందరు మూతి తిప్పుకొన్నారు. నారదుడు కూడా ”పరమ విష్ణుభక్తుడనైన నన్ను కాదని, తుంబురుని స్వామి ఎందుకు పిలిపించుకొన్నారో” అనుకొంటూ మథన పడసాగాడు. ఇంత లో రమాసహతుడై శ్రీవిష్ణుమూర్తి తుంబురుని గానం ఆలకిస్తున్నాడనే వార్త బయట కొచ్చింది. నారదుని హృదయం అసూయతో కుతకుత ఉడికిపోయింది. అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకొన్నాడు. కానీ, చివరకు ఏంజరుగుతుందో చూద్దామని అక్క డే నిలబడ్డాడు.
కొంతసేపటికి విష్ణువు బహుమతిగా ఇచ్చిన బంగారు పతకాన్ని, దుశ్శాలువను, సువాసనాభరిత చందన లేపనాన్ని ధరించి, వినూత్న కాంతితో బయటకు వచ్చాడు తుంబురుడు. అందరూ తుంబురు ని చుట్టూ చేరి, అభినందిస్తూ, విశేషాలు అడిగి తెలుసుకోసాగారు. అతని దేహం పై ధగధగ మెరిసే పతకాన్ని, శాలు వ, ఆభరణాలు చూసి, నారదుని మనసు భగభగామండింది. అసూయ దావానలమై బాధిం పసాగింది. విష్ణుమూర్తి పిలి పించగనే, కనీసం నాతో చర్చించకుండా, మాట మాత్రంగా నన్ను పిలువ కుండా, తాను వెళ్ళి సంగీ త విద్య ప్రదర్శించడ మా? అంతేకాక విష్ణు మూర్తి బహూక రించిన సొమ్ములు ధరించి బయ టకు రావడమా? అసలు తుంబురుని గొప్పదనమే మిటి? అని నారదుడు పరి పరివిధాల అనుకొంటూ బాధ పడ్డాడు. తాను ఎలాగైనా తుం బురునితో వాదం పెట్టుకొని, అత ని వీణావాదనంలో, గానంలో లోపాలు కనిపెట్టి, ఎత్తిచూపి అవమా నించి, తన సంగీత కళాచాతుర్యం విష్ణు మూర్తికి తెలియజేయాలనుకొన్నాడు నార దుడు. తన అసూయను బయటకు కనపడనీ యక, లోలోపలే అణచుకొని, తుంబురుని సంగీతం లోని గుణదోషాలు తెలుసుకోవాలని, మునుపటికంటే ఎక్కువ మైత్రిని ప్రదర్శిస్తూ, అతని ఇంటికి రాకపోకలు కొనసా గించాడు నారదుడు. ఒకనాడు తుంబురుడు లేని సమ యంలో అతని

ఇంటికి వెళ్ళి, ఇంటిముందు మొగసాలలో మేళవించి ఉన్న వీణను తీసుకొని మీటాడు. నిర్దు ష్టము, అపూర్వమయిన ఆ వీణ శ్రుతుల పెంపుచూసి, ఆశ్చర్యపడి, సిగ్గుతో వెళ్ళిపోయాడు.
”ఆహా! ఏమి ఈ తుంబురుని సంగీత కళాధురీణత్వము. అతనిలో ఇంత పాండిత్యం ఉన్నట్లు తనకు తెలియదే! బ్రహ్మాదుల సన్నిధిలో మేమిద్దరమూ అనేకమార్లు వీణావాదనతో గానం చేశాము. కానీ అతనెప్పుడూ ఇంతటి సంగీత కళ ప్రదర్శింలేదు. ఉత్తముల మహమ లు నీటి కొలది తామరసుమ్మీ” అని మనసులో అనుకొన్నాడు నారదుడు.
ఎలాగైనా విద్యాస్పర్ధలో తుంబురుని గెలవాలనే పట్టుదలతో నిష్ణాతులైన ఎందరో గంధర్వులు, పండితుల దగ్గరకు వెళ్ళి విద్యను అభ్యసించాడు నారదుడు. కానీ ఎక్కడా తుం బురునితో సమానమైన సంగీత విద్యా విశారదుడు కనిపించలేదు. చివరకు విష్ణువు తప్ప తన కోరిక ఎవరూ తీర్చలేరని గ్రహంచి, ఆ దేవదేవుని అనుగ్రహం కోరి దీర్ఘకాలం తపస్సు చేశా డు. స్వామి ప్రత్యక్షమై, ఏమి వరము కావాలో కోరుకోమని అనగానే, సంగీత విద్యలో తుంబు రునిపై తాను గెలిచేలాగా అనుగ్రహంచమని నారదుడు కోరాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ”ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణునిగా నేను భూమిపై అవతరిస్తాను. అప్పుడు నా అష్ట భార్యలలో ఒకరైన జాంబవతి దగ్గర సంగీతం అభ్యసించి, సాధన చేయు ము. ఆమె మహత్తర వీణా విద్వాంసురాలిగా నెలకొని ఉంటుంది. నీ అభీష్టం నెరవేరుతుంది” అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ద్వాపర యుగం లో శ్రీకృష్ణ జాంబవతులను ఆశ్రయించి నారదుడు అనుపమ సంగీత విద్యాకుశలుడై తన పంతం నెగ్గించుకొన్నాడు. ‘స్పర్ధయా వర్ధ తే విద్యా’ అనే సూక్తికి ఈ కథ తార్కాణమయ్యింది.
భాగవతంలోని ధృవ చరిత్రను పరిశీలిస్తే ధర్మయుతమైన, ఆదర్శశీలమైన పోటీ వ్యక్తు లను సముచిత, సమున్నత స్థానంలో నిలబెడుతుందని తెలుస్తుంది. స్వాయంభువ మనువు కొడుకు అయిన ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సురుచికి ఉత్తముడు, సునీతికి ధృవుడు అనేవారు కొడుకులు. ఒకసారి ఉత్తముడు తండ్రి అయిన ఉత్తానపాదుని తొడపై కుర్చొని లాలింపబడుతున్నాడు. ఉత్తమునిలాగే చిన్న పిల్లవాడైన ధృవుడు కూడా తండ్రి మరొక తొడపై కుర్చోవాలని ముచ్చటపడ్డాడు. కానీ పినతల్లి సురుచి ధృవుని చేయి పట్టి ప్రక్కకు లాగి ”నీకు ఆ అర్హత లేదు. ఎందుకంటే నీవు నా కడుపున పుట్ట లేదు” అని కసరి కొట్టింది. ధృవుడు ఏడుస్తూ తన తల్లి సునీతి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఆమె కొడుకును ఓదార్చి, ఉన్నత స్థితి పొందాలంటే దేవాది దేవుడైన శ్రీమన్నారా యణుని ఆశ్రయించాలని చెప్పింది. కన్నతల్లి ప్రేరణతో బాలుడైన ధృవుడు తపస్సు చేయా లని బయలుదేరాడు. అతనికి దారిలో నారదుడు కనిపించి, ఆ పిల్లవాని సంకల్పం తెలుసు కొని, ధృవునికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించి, తపో విధానాన్ని బోధించి, గురువై మార్గం చూపి వెళ్ళాడు. ధృవుడు శ్రీమన్నారాయణుని గురించి తీవ్రమైన తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది అత్యున్నతము, శాశ్వతము అయిన ధృవ పదాన్ని పొంది, ధృవ నక్ష త్రంగా ఈనాటికీ ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. సత్యము, ధర్మము అయిన శాంతియు త పోటీ వ్యక్తికి ఉన్నతస్థానాన్ని కల్పిస్తుందనే సందేశం ఈకథ ద్వారా మనకు అర్థమవుతుంది.
ఇతరుల ఔన్నత్యాన్ని చూచి ఈర్ష్యాద్వేషాలతో పోటీపడి సాధించిన విద్యలు దుర్యోధ నుని, కర్ణుని ఉదంతాలను పరిశీలించుట ద్వారా సరియైన సమయంలో ఉపయోగపడవని ఎరుక కలిగి ఉండాలి. విశ్వామిత్రుడు వసిష్ఠునిపై ద్వేషం కలిగి తానూ బ్రహ్మర్షి అనిపించుకో వాలని ఎంత తపించినా వృథా అయ్యింది అదే విశ్వామిత్రుడు సత్యాన్ని గ్రహంచి తామస ప్రవృత్తి వీడి, ప్రేమభావంతో తపమాచరించి, బ్రహ్మర్షి పదవి పొందగలిగాడు. కనుక. మహా జ్ఞా నులైన తులసీదాసు, రామకృష్ణ పరమహంస, భగవాన్‌ శ్రీరమణ మహర్షుల జీవితాలను ఆదర్శం చేసుకొని, అందరూ ప్రేమ దయాగుణాలను పెంపొందించుకొని, ఉన్నత వ్యక్తిత్వా న్ని, అద్వైత సిద్ధిని పొందే లా సాధన చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement