నహుషుని కుమారుడైన యయా తి, బోధ్యుడు అనే మహర్షిని ఆశ్ర యించి మానవుడు శాంతితో సంతో షంతో జీవించాలంటే ఎలా జీవించా లో తెలియచేయమని ప్రశ్నించాడు. దా నికి మహర్షి ఇలా అంటాడు. ”మహారా జా! నేను ఎవరికీ ఏమీ ఉపదేశించను. ఉప దేశించడం చాలా సులువు కాని దానిని ఆచ రించడం అత్యంత కష్టతరమైనది. ఇతరుల లోని ఉత్తమ గుణాలను ప్రేరణగా స్వీకరించి ఆ మార్గంలో నా జీవితాన్ని మలుచుకుంటా ను. నేను ప్రేరణ పొందిన కొన్నింటిని చెపుతా ను.. నచ్చితే నీవూ ఆమార్గంలో నడవవచ్చు.”
”రాజా! నాకు ప్రేరణ నిచ్చినవి.. పింగళ అనే వేశ్య, క్రౌంచ పక్షి, పాము, చాతకపక్షి, బాణాలను తయా రు చేసే వ్యక్తి, కుమారి. ఈ ఆరింటిని నేను గురువులు గా స్వీకరించాను.” అంటూ వివరించి చెబుతాడు.
పింగళ.. తాను వేశ్యా జీవితాన్ని వృత్తిగా స్వీకరిం చింది. నిర్మలమైన మనస్సుతో తన శరీరాన్ని అర్పించే ది. ఆశాపాశానికి కాకుండా వృత్తి ధర్మానికి మాత్రమే పరి మి తమై జీవనం సాగించేది. తన ప్రవర్తన ద్వారా ఆమె బోధ్యునిలాంటి మహర్షికి గురుస్థానీయురాలైంది. ”మన యేవ మనుష్యాణాం కారణం బంధిమోక్షయో:” అంటారు. బంధాలకు కాని, విముక్తికాని మనస్సే ప్రధానమైనది. చెప్పు లపై లగ్నమైన చిత్తాన్ని శివునిపై మళ్ళించలేని వారికి శివుని పూజలో లభించేది శూన్యమని ప్రవచించే విజ్ఞులైన వారు కూ డా ఆచరణలో విఫలులౌతారు. ”చిత్తశుద్ధిలేని శివపూజలు యేల” అన్నట్లుగా మనసును శరీరంపై లగ్నం చేసే మహర్షుల కన్నా.. మనసును శరీరాన్నుండి దూరం చేసే వేశ్యయైనా ఉత్తమురాలే అంటారు, బోధ్యుడు.
క్రౌంచపక్షి.. అడవిలో ఒక క్రౌంచప క్షి మాంసపు ఖండాన్ని ముక్కుతో కరుచు కొని పోతున్నది. ఆ మాంసపు ముక్కపై ఆశతో పక్షులన్నీ దాని వెంట బడ్డాయి. అ ది ఎంత వేగంగా ఎక్కడికి వెళ్ళినా ఆ పక్షు లు వెన్నాడడం మానలేదు. అప్పుడది త న నోటిలోని మాంసాన్ని వదిలివేసింది. పక్షులు దాని వెంటబడడం మాని వేసి ఆ మాంసపు ముక్కవైపు వెళ్ళిపోయాయి. అది చూచి మ#హ ర్షి బంధనాలలో కాదు సుఖము, సంతోషము, శాంతి విడి చివేయడంలో ఉన్నదనే సత్యాన్ని తెలుసుకున్నాడు.
పాము.. మానవునికి సంపదను కూడబెట్టడంలో దు: ఖమున్నది. ఇల్లు గట్టుకోవాలంటే ఎంతో ధనాన్ని సంపా దించాలి, ఎంతగానో శ్రమించి కట్టుకున్న ఇంటిలో తానుం టాడో ఉండడో, చివరకది ఎవరి హస్తగతం అవుతుందో తెలి యదు. చీమలు ఎంతో శ్రమించి పుట్టలు పెడతాయి. కాని ఆ పుట్టలలో పాములు సుఖంగా జీవిస్తాయి. ఇల్లు అనే బంధ నాలలో చిక్కువడకుండా తనదంటూ ఏమీలేకుండా జీవి తాన్ని గడపాలనేదే పాము నుండి బోధ్యుడు గ్రహించాడు.
చాతకపక్షి.. వర్షపు నీరును గ్రహ స్తూ జీవితం గడిపే చాతకపక్షి ఆహార సంపాదనలో ఎవరితో నూ గొడవకు దిగదు. సంఘర్షణ అశాం తికి చోటిస్తుందని భావిస్తూ.. జీవించే చాతకపక్షి ద్వారా ప్రేరణను పొంది.. తాను అడవిలో కంద మూలాలను భుజి స్తూ, జీవిస్తున్నానని అన్నాడు బోధ్యుడు.
బాణాలను తయారుచేసేవాడు.. బోధ్యుడు వెళుతున్న దారిలో బాణాలను తయారుచేసేవాడు తన పనిలో నిమగ్న మై ఉన్నాడు. ఆ దారిలో ఒక మహారాజు వెళుతున్నాడు.. మహారాజు, పరివారం వెళ్ళే సమయంలో కలిగిన కోలా#హలం కూడా ఆ వ్యక్తి ఏకాగ్రతను భగ్నం చేయలేదు. దానిని గమ నించిన బోధ్యుడు ఆ ఏకాగ్రత తను చేసే పనిలో ఎంత అవ సరమో గుర్తించి, అత న్ని గురువుగా స్వీకరించాడు.
కుమారి.. కుమారి అంటే పార్వతి, దుర్గాదేవి. దుష్ట శిక్ష ణ, శిష్ట రక్షణ ఆమె లక్షణాలు. అత్యంత శ్రద్ధగలిగి, అంతర్గ త శక్తిసామర్ధ్యాలను జాగృతం చేసుకోగలిగిన స్థాయిని కూ డా కుమారిగానే గుర్తిస్తారు. కుమారిలో ఆ స్థితిని గ్రహంచిన బోధ్యుడు ”కుమారిని” తన గురువుగా స్వీకరించాడు.
ఇలా ఇతరులలోని ఉత్తమ లక్షణాలను గ్రహంచి వాటి ని ఆచరణలో పెట్టడంలోనే సుఖము, శాంతి, సంతోషం లాంటి లక్షణాలున్నాయని బోధ్యుని జీవనం బోధిస్తుంది.
శాంతి… సంతోషాల జీవనం అంటే…
Advertisement
తాజా వార్తలు
Advertisement