Tuesday, November 26, 2024

పవిత్ర బంధాలు

వేదముల నుండి ఉద్భ వించిన సనాతన వాఙ్మ యమునందు సర్వమూ విశద పరచబడినది. అందు మానవ జాతి సంబంధాలు కూడా వివ రించబడినవి.
పితృ, తండ్రి, జనక, జన్మద మొదలగునవి జన్మను ప్రసా దించిన ‘నాన్న’ అను అర్థానికి నిర్దేశించబడినవి. అంబ, మాతృ, జననీ, ప్రసూ, ప్రభృతి మొదలైనవి గర్భమును ధరించి నవ మాసములు మోసి జన్మనిచ్చిన ‘అమ్మ’ అను అర్థమునకు నిర్దేశించబడినవి.
తండ్రి తండ్రిని పితామహుడని, అతని తండ్రిని ప్రపితామహుడని అంటారు. వీరి పూర్వీకు లను సగోత్రులందురు. తల్లి తండ్రిని మాతామహుడని, అతని తండ్రిని ప్రమాతామహుడని అంటారు. ప్రమాతామహుని తండ్రిని వృద్ధ ప్రమాతామహుడని అందురు.
తండ్రి తల్లిని పితామహి అనియు, ఆమె అత్తగారిని ప్రపితామహి అని, ఆమె అత్తగారిని వృద్ధ పితామహి అని అందురు. వీరందరూ మాతృ సమానులు, పూజనీయులు.
తల్లి, తల్లిని మాతామహి అని అంటారు. ప్రమాతామహుని భార్యను ప్రమాతామహి అని అందురు. ప్రమాతామహుని తండ్రి భార్యను వృద్ధ ప్రమాతామహి అని అందురు. తండ్రి సోదరిని పితృష్వస అని, తల్లి సోదరిని మాతృష్వస అని అందురు. ఇక కుమారుని సూను, తన య, పుత్రి, దాయాది, ఆత్మజ అని కూడా అందురు. ఆత్మజా, దుహితృ, కన్య అనునవి కూతురుకి సమానమయిన పదములు. కుమారుని భార్యను వధు అని, కూతురి భర్తను జామాత అని, భర్తను పతి, ప్రియ, స్వామి, ప్రియతముడు అని అంటారు. భర్త తండ్రిని శ్వశురుడని, భర్త తల్లిని శ్వశ్రు అని, భర్త సోదరుని దేవరుడు అని, భర్త సోదరిని నవద్ద అని అందురు.
భార్యను జాయ, ప్రియ, కాంత, స్త్రీ, పత్ని అని కూడా అందురు. భార్య తల్లిని కూడా శ్వశ్రు అని, భార్య తండ్రిని కూడా శ్వశురుడు అని అందురు. భార్య సోదరుని శ్యాలకుడు, భార్య సోదరిని శ్యాలిక అని అంటారు. స్వంత అన్నదమ్ములను సహోదరులని, అక్కచెల్లెండ్రలను సహోదరిలు అని అంటారు. చెల్లెలి కుమారుని భాగినేయుడు అని, అన్నదమ్ముల కుమారుని భాతృజుడు అని అంటారు. సోదరి భర్తను భగినీకాంతుడు, భగినీపతి అని అంటారు. మరదలి భర్తను కూడా సోదర సమానునిగా గుర్తించవలెను. కన్యాదాత పితృసమానుడు. అన్నదాత, అభయదాత, భార్య తండ్రి, గురువు అనగా విద్యాదాత వీరు నలుగురు కూడా పితృసమానులు.
అన్నదాత భార్య, చెల్లెలు, గురుపత్ని, తల్లి, సవతితల్లి, కుమార్తె, కోడలు, నాయనమ్మ, అమ్మమ్మ, అత్త, తండ్రి చెల్లెలు, చిన్నమ్మ అనగా పిన్ని వీరందరూ మాతృసమానులు.
పుత్రుని పుత్రుడు పౌత్రుడు. అతని పుత్రుడు ప్రవౌత్రుడు అని, ప్రపౌత్రుని పుత్రులను వారి సంతతిని వంశజులు లేక కులజులు అని అంటారు. పుత్రిక పుత్రుని దౌహిత్రుడని, వారి వంశజు లను బాంధవులని అంటారు. సోదరుని పుత్రులను జ్ఞాతులని, గురుపుత్రులను వారి అన్నదమ్ము లను పోష్యులని, గురుపుత్రికలను వారి అక్కచెల్లెళ్లను పోష్యలని అంటారు.
పుత్రుని గురువును సోదరునిగా భావించాలి. పుత్రుని మామగారు కూడా సోదర సమానుడు. వీరిని వైవాహిక బంధువు అని అంటారు. కుమార్తె మామగారు కూడా వైవాహిక బంధువు, సోదర సమానుడు. సోదర సమాన వ్యవహారములు గలవారందరిని మిత్రులుగా భావించాలి. మన యోగక్షేమాలను ఆకాంక్షించేవారు మిత్రులు. దు:ఖాన్ని కలిగించేవారు శత్రువులు.
ఈవిధంగా ఈ భూమి మీద మానవులు విద్యాజనిత, యోని జనిత, ప్రీతిజనిత అనే మూడు విధములైన సంబంధములతో ఉంటారు. పరమ మిత్రులతో సంబంధము క్షేమకరము. అటు వంటి మిత్రులు లభించుట దుర్లభము.
పై సంబంధ బాంధవ్యాలను మనము వ్యవహారికంలో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, అత్త, మామ, మేనమామ, మేనత్త, మేనకోడలు, మేనల్లుడు, మేనత్త, బావ, బావ మరిది, వదిన, మరదలు, పిన్ని, బాబాయి, మనవడు, మనవరాలు, ముని మనవడు, ముని మనవరాలు, తాత, మామ్మ, అమ్మమ్మ, అల్లుడు, తోడల్లుడు మొదలైనవాటితో పిలుచుకుంటా ము. ఇటువంటి బంధం, అనుబంధం మన భారతీయ సంస్కృతిలో పెనవేసుకుపోయిన ఒక అద్వితీయ భావన. ఇవియే వావి వరుసలు. ఈ బంధుత్వాలను పవిత్రంగా అమలుపరచు కుంటూ ఉన్నంతకాలం మానవీయత, ప్రేమానురాగాలు సమాజంలో పరిఢ విల్లుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement