Friday, November 22, 2024

పవనకుమారుని ప్రత్యేక రూపం

అరుదైన ఈ మందిరం ఛత్తీస్‌ఘడ్‌లోని రతన్‌పూర్‌లో ఉంది. ఈ ఆలయంలో కొలువైన వున్న దైవం ఆంజనేయస్వామి. ఈ ఆలయంలో పవన కుమారుని దేవత రూపంలో పూజిస్తున్నారు.
ఇక్కడ పూజలు నిర్వహంచే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చి తంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు. ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయుని విగ్ర హా న్ని కూడా చూడవచ్చు.ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక పురాణ కథనం ఉంది.
ఇక్కడ ఒకానొక కాలంలో పృథ్వీ దేవ రాజ్‌ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఇది లా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడతాడు. దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకుంటాడు. అదేరోజు రాత్రి హనుమంతుడు రాజు కలలో కనబడి తనకు మందిరం నిర్మించా లని చెబుతాడు. దీంతో రాజు తన ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవా లయం నిర్మించాలని, అందుకు స్వామి వారి శిల్పం చెక్కమని ఒక శిల్పికి చెబుతాడు.
కానీ విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి రాజుకు మరల హనుమంతుడు స్వప్న దర్శనం ఇచ్చి నా విగ్రహం ఇక్కడికి దగ్గర్లో ఉన్న మహా మాయ అనే కొలనులో ఉందని దానిని తీసి ప్రతిష్టించాలని రాజును ఆదేశిస్తాడు.
దీంతో రాజు ఆ సరస్సు వద్దకు వెళ్లి సేవకులతో విగ్రహాన్ని వెలికి తీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపుడక ఉండ టమే కాకుండా చూడటా నికి స్త్రీ మూర్తి వలే ఉంటుంది. అయినా హనుమంతుడి ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టింపజేస్తారు.

దక్షిణ ముఖంగా హనుమంతుడు

ఈ ఆలయంలో హనుమంతుడు దక్షిణ ముఖంగా ఉంటాడు. ఆయన కుడి వైపు శ్రీరాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్ష సులు ఉంటారు. ఇక ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత రాజు కుష్టు రోగం పూపోయింది. అంతేకాకుండా తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్లు ఇక్కడి వారు చెబుతారు.
అంతేకాకుండా ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుం దని భక్తుల నమ్మకం. స్త్రీ రూపంలో ఉండే ఈ హను మంతుడు వివాహ సమస్యలను పరిష్కరించి, సంతానం కోరే వారికి సంతానం ప్రసాదిస్తాడు. ఇలా ఎందరో భక్తులకు అనుభవ పూర్వకంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో కాలభైరవ విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. పురాతన లక్ష్మీదేవి మందిరం కూడా ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement