Friday, November 22, 2024

సహనంతోనే సుఖం

”ఎవరైనా వంద మాటలన్నా సరే స్వయంగా కఠినంగా బదులివ్వకు. నిరంతరం సహనాన్ని వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది” అంటూ సాయిబాబా మానవులుకు సమయం వచ్చినప్పుడల్లా హితబోధ చేస్తుండేవారు. బాబాగారి ఈ వాక్కును పాటిస్తే క్షమాగుణం అలవడుతుంది. దయామృతంతో మెలిగే సుగుణం చేకూరుతుంది. ఇదేక్రమాన బాబా ఎల్లప్పుడూ ఇతరులను ద్వేషించకూ డదని చెప్పారు. ఇతరులను మనస్సులో కూడ ద్వేషించకూడదు. కోపం, పగ, ద్వేషం, శత్రుత్వము, ఇతరుల కు ఋణము- ఇవి కనుక మనుషులకు వుండకూడదు అనేవారు. మానవులకు శత్రుశేషము, ఋణబాధలు వుండకూడదని, అత్యవసరాలకు తప్ప తీర్థయాత్రలు చేయడానికి అయినా అప్పు చేయకూడదని చెప్పేవారు బాబా. ఒకవేళ ఎవరికైనా శత్రుత్వము, ఋణము, పాపాలు వుంటే ఫలితమనుభవించక తప్ప దన్నారు సాయిబాబా. అకారణంగానే తమ పక్కవాళ్ళని చూసి అసూయపడతారు కొందరు. ఆ తర్వాత ద్వేషించడం మొదలుపెడతారు. వారి గురించి చాటుమాటుగా దూషణలకు దిగుతారు. ఇవన్నీ తగని పనులని హెచ్చరించారు సాయిబాబా. అసూయ అతి ప్రమాదకారి. ద్వేషం మనిషిని దహించివేస్తుంటుం ది. అందువలన వీటిని అధిగమించాలని బాబా సందర్భానుసారంగా అనేకానేకసార్లు చెప్పారు. ప్రత్యేకించి ఏ కారణం లేకుండానే అసూయపడుతూ విద్వేషపూరితమైన వాచలత్వాన్ని కొందరు ప్రదర్శిస్తారు. తద్వారా ఎదుటివారిని గాయపరచాలన్నదే వారి ఉద్దేశం. కానీ ద్వేషించబడేవారికి, ద్వేషానికి లోనయిన వారికీ చిత్తశాంతి వుండదు.
మానవ జీవితంలో అసూయ పాత్ర ఎంత భీకరమైనదో ‘శ్రీసాయి లీలామృతము’లో ఎక్కిరాల భరద్వాజగారు ”అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దానివలన మనకే లాభమూ లేదు. అవతలవారికి ఏ నష్టమూ లేదు. అసూయంటే యితరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చు కోలేక అపవాదులు కల్పిస్తారు. వారు నష్టపోఓతే సంతోషిస్తారు. దానివలన మనకేమీ ప్రయోజనము? అవతలి వాడికి మంచి జరిగితే మనకేమి నష్టము? కాని యిది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం.” అంటూ వివరంగా రాసారు.
మన సహాయం ఎవరైనా అర్థస్తే, తప్పక చేయడంగాని, లేక చేయించడంగాని మన ధర్మమన్నారు సాయిబాబా. ఎవరైనా పనికాని, సహాయం కానీ అడిగితే ఆ పనులు ఎవరి ద్వారా జరుగుతాయో తెలిసిన పుడు వారి సహాయ సహకరాల కోసం సదరు మిత్రుల సహాయం తీసుకోవాలి. ఆపత్కాలంలో ఎవరితోనయిన ఈవిధంగా ప్రవర్తించడం మానవ ధర్మమన తన మాటలద్వారా, జీవితాచరణ ద్వారా నిరూపించిన అనుపమాన వితరణశీలి సాయిబాబా. సానుకూల దృక్పథంతో, మనుషుల పట్ల దయతో మెలగడం మానవునికి హితం చేకూరుస్తుందని బాబా చెప్పారు. మనకున్న పరిధి మేర బాబా వలెనే అవసరమైన వేళల సహాయం కోరి వచ్చిన ఇరుగుపొరుగు, బంధుమిత్రులకు సహాయపడాలి. అప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement