అనాది నుంచి తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఎన్నో కష్టాలనీ, అసౌకర్యాలనీ ఓర్చుకొని భక్తులు తీర్థయాత్రలకి వెళతారు. అసలు ఈ తీర్థయాత్రల ప్రాముఖ్యత, ఉద్దేశం ఏమిటి? అనే విషయాల గురించి సద్గురు ఇలా విశదీకరిస్తునారు.
యాత్ర, ప్రయాణం, తీర్థయాత్ర-వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? అనేక రకాల కారణాలతో మనుషులు ఒకచోట నుండి మరోచోటకి వెళుతుంటారు. కొందరు అన్వేషకులుంటారు, వారు ఇంతవరకూ ఎవరూ కాలుమోపని ప్రాంతంపై తాము మొదటగా అడుగు వేయాలనుకుంటారు. వారు ఏదో నిరూ పించాలనుకుంటారు. ఇక పర్యాటకులు ఉంటా రు. వారు ప్రతీదాన్ని చూడాలన్న కుతూహలంతో ఉంటారు, అందుకోసమే వాళ్ళు ప్రయాణిస్తుం టారు. కొంతమంది యాత్రికులు కేవలం సేదతీర డం కోసం వెళతారు. ఇంకొంతమంది యాత్రికులు తమ పని నుండి లేదా కుటుంబం నుండి తప్పించుకోడానికి వెళతారు. కానీ తీర్థయాత్రకు వెళ్ళే మనిషి వీటి లోని ఏ ఉద్దేశంతో వెళ్ళడు. తీర్థయాత్ర ఒక జైత్ర యాత్ర కాదు. అదొక సమర్పణ. మీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న మిమ్మల్ని మీరే తొల గించుకునే మార్గమది. మీకై మీరు పక్కకు తొలగ లేకపోతే, మిమ్మల్ని మీరు కరిగించుకునే మార్గమ ది. అన్ని పరిమితులనూ, నిర్భంధతలనూ తొల గించేసి, హద్దులు లేని చేతనా స్థితికి చేర్చగలిగే ప్రక్రియ అది. ‘నేను’ అనే భావనని తగ్గించడమే తీర్థ యాత్ర మౌలిక ఉద్దేశం. నడుస్తూ, అధిరోహస్తూ, ప్రకృతి యొక్క కఠినమైన ప్రక్రియలకు మిమ్మల్ని మీరు గురిచేసుకుంటూ శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర. పూర్వం అలాంటి ప్రదేశాలకు వెళ్ళా లంటే ఒక వ్యక్తి ఎన్నో భౌతిక, మానసిక, ఇంకా అనేక ఇతర కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చేది. ‘నేను’ అనే భావన తగ్గాలనేదే వీటి వెనక ఉన్న ఉద్దేశం. ఈ రోజుల్లో ఈ యాత్రలు చాలా సౌకర్యవంతంగా మారాయి. మనం విమానాల్లో, కార్లలో వెళుతు న్నాం. చాలా తక్కువగా నడుస్తున్నాం. భౌతికంగా, వేయి సంవత్సరాల క్రితం ఉన్న వారి కంటే మనం ఇప్పుడు చాలా బల#హనంగా ఉన్నాం, ఎందుకంటే ఉన్న సౌకర్యాలను మన సంక్షేమం కోసం ఎలా ఉపయోగించుకోవాలన్న ది మనకు తెలవడం లేదు. మనల్ని బల#హన పరుచుకోవడానికి, అలాగే మనం మనతోనూ, మనం నివసిస్తున్న పరిసరాలతోనూ ఉండడాన్ని కష్టతరం చేసుకోవడానికి వాటిని ఉపయోగించు కుంటున్నాం. కాబట్టి తీర్థయాత్ర అనే ఈ మౌలిక భావన పూరాతన సమాజాలకంటే ఆధునిక సమా జాలకి చాలా అవసరం. కరిగిపోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది మామూలు పరిస్థితు లలో దానికి సుముఖంగా ఉండడంలేదు కాబట్టి, మనం వారిని శ్రమింప చేయాలి. సౌకర్యంగా ఉన్నప్పుడు చాలామంది ఎదగలేరు. ఇది చాలా దురదృష్టకర విషయం. సౌకర్యంగా ఉన్నప్పుడే ఎదగగలగడం చాలా అద్భుతమైన విషయం, కానీ దురదృష్టవశాత్తూ, చాలామంది మనుషులు సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతారు. కష్టం ఉన్నప్పుడే వాళ్ళు జీవితాన్ని కొం తైనా లోతుగా చూస్తారు. కానీ పరిస్థితి ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ఇంకేదో అలిసిపోయి, వంగిపోయేలా చేయాల్సిన అవస రంలేదు. మనకంటే ఉన్నతమైన దాన్ని అను భూతి చెంది, మన ఇంద్రియాలకు అందని ప్రమా ణాలను చేరుకోవాలంటే, మనం అర్థం చేసుకోవా ల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘నేను’ అనే భావన తగ్గిపోవాలి. మీకు కనుక ఓ పనిచేసే బుర్ర ఉంటే, మీరు మీ జీవితాన్ని ఓ తీర్థయాత్రలా మలచుకుంటారు. మీ జీవితం మీరిప్పుడు ఉన్నదానికంటే ఉన్నత మైన దాన్ని అందుకునే ఒక నిరంతర ప్రక్రియ కాకపొతే, అసలది జీవితమేనా? నిరంతరం ఉన్న తమైన దాని కోసం ఆశించకపొతే, జీవితం అసలు జీవితమే కాదు. మీరు ఉన్నతనమైన దాన్ని ఆశి స్తూ, దానికై కృషిచేస్తూ ఉంటే, అప్పుడు మీ జీవి తమే ఒక తీర్థయాత్ర అవుతుంది.
ప్రేమాశీస్సులతో….
– సద్గురు