Wednesday, November 20, 2024

పరమ పవిత్రం… కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రం, అత్యంత మహిమాన్వితమైనదని పురా ణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు. అందువల్ల అనేక ప్రతాలు పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యం త ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్య ముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజ స్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధి లోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడంవల్ల అ్లపశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగి స్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు, ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానానికి శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నా రు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపంవల్ల వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే ”అల్పాయు ష్కుడు, మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణా యుష్కరాలు, విధవ అయిన కుమార్తె కావాలా?” అని అడిగితే.. కుమారుణ్ణ కోరుకున్నారా దంపతులు. కొడుకు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగు తున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగు తోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చే సరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి, తక్షణమే శివుడ్ని ప్రార్ధించి భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చు కునే వరం పొందిందని పురాణ కథనం.
కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపారాధన, ఉప వాసం ఎంతో ఫలప్రదమైనవి. కార్తీక మాసంలో ప్రతి రోజూ స్నానం, దీపారాధన చేయలేనివారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు. నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతు న్నాయి పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపా రాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహా రంగా స్వీకరించాలి. ఇలా చేయడంవల్ల కడుపు చలు వ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఈ రోజు మరో ప్రత్యేకత శివాలయాల్లో జరిపే జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహంచిందట. అదే పద్ధతిలో ఈ రోజు శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలాతోరణోత్సవాన్ని చూడటంవల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట.
ప్రత్యేకతలు

కార్తీక పౌర్ణమి రోజు దైవదర్శనం, దీపారాధన, దీప దానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్టతో పూజిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి.
– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement