పం చేశ్వరాలయాలలో ప్రముఖమైనది శ్రీలంకలోని కేతీశ్వర ఆలయం. ఈ స్థలంలోనే నవగ్రహ నాయకులలో ఒకడైన కేతువు ఈశ్వరుని ఆరాధించిన ఆలయం వుంది. అందువలననే ఈ ఆలయంలోని ఈశ్వరునికి ”కేతీశ్వరుడు” అనే పేరు వచ్చింది.
అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయానికి మహావిష్ణువు, ఇంద్రుడు, రా ముడు, రావణుడు, రావణుడి భార్య మండోదరి మొదలైన దేవతలు, రాజాధి రాజులు, భృగుమహర్షి వచ్చి పూజించారని చరిత్ర కథనం. మండోదరి తండ్రి మంథై రాజు శివుడిని ఆరాధించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక హిం దూ పురాణం పేర్కొంటున్నది.
ఒకసారి ఆది శేషునికి- వాయు భగవానునికి మధ్య తమలో ఎవరు బలవం తులనే వాగ్వాదం వచ్చింది. ఆదిశేషువు తన వేయి పడగలతో మహామేరువుని కనుమరుగు చేశాడు. వాయుదేవుడు తన బలంతో ఆదిశేషువుని త్రోసివేసి మహా మేరువుని మూడు ముక్కలుగా చేసేసాడు. ఆ మూడు ముక్కలే త్రికూటాద్రి, తిరుకేతీశ్వరం, గంధమాదన పర్వతం అనే మూడు పర్వతాలుగా ఉద్భవిం చాయని పురాణాలు తెలియచేస్తున్నాయి.
కేతీశ్వరాలయాన్ని మహాదు వట్టా అనే దేవశిల్పి నిర్మించినం దున ఈ స్ధలానికి ”మహాదువట్టా పురం” అనే పేరు వచ్చింది.
మహాదువట్టా త్రేతాయుగాని చెందిన గొప్ప శిల్పకళా కోవిదుడు. 6 వ శతాబ్దంలో యీ ఆలయం 1,120 ఎకరాల భూమిలో రెండు పెద్ద కందకాలు కలిగి వుండేది. ఈ ఆలయానికి సమీపమున వున్న ”మళిగైతిడల్” అనే ఊళ్ళో చోళుల కాలం నాటి శిలాశాసనాలు వున్నవి.
పోర్చుగీస్ వారి కాలంలో యీ ఆలయం ధ్వంసం చేయబడి ఆలయ ఆస్తులు, ఆభరణాలు అపహరించబడ్డాయి. 1872వ సంవత్సరంలో ఆర్ముగ నావలర్ అనే శివభక్తుడు యీ ఆలయ మ#హమలను ప్రచారం చేసిన పిదప తిరి గి ఆలయ పునరుద్ధరణ 1903లో జరిగింది.
ఇక్కడ వున్న పాలావి తీర్ధం ఎంతో మ#హమలు కలిగినదని ‘దక్షిణ కైలాస మాన్మీయం” అనే సంస్కృత గ్రంథంలో విపులంగా వర్ణించారు. ప్రాచీన కాలం లో ఈ పాలావి తీర్థం పాలావి నదిగా వుండేది.
ఆ నదీ తీరాన్నే కేతీశ్వర ఆలయం నిర్మించబడినది. ఇప్పుడు యీ నది పుష్కరిణిగా వున్నది. యీ తీర్ధంలో స్నానం చేసి కేతీశ్వరుడు దర్శనం చేసుకుంటే ఎంతటి ఘోరమైన పాపాలైనా కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం .
కేతీశ్వరుని ఆలయం తూర్పు ముఖంగా ఐదు అంతస్తులు కలిగి వున్నది. ఆల య నిర్వహణ తిరుకేతీశ్వర ధర్మ సంస్ధానం ద్వారా నిర్వహంచబడుతున్నది.
ఉత్తర శ్రీలంకలోని మణ్ణార్ జిల్లాలోని మణ్ణారు నగరం నుండి తూర్పు యాళ్పాణం వెళ్ళే మార్గంలో 10 కి.మీ దూరాన తిరుకేతీశ్వర ఆలయం నిర్మించబడి వున్నది. అక్కడికి యాళ్పాణం 110 కి.మీ దూరంలో వున్నది.
పాపహరణం కేతీశ్వరుడి దర్శనం
Advertisement
తాజా వార్తలు
Advertisement