సనాతన సంస్కతిలో తీర్థానికి విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో, ప్రత్యేకించి భక్తి ప్రపంచంలోను, ముఖ్యంగా భక్తుల హృదయాలలోను తీర్థానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే అన్ని ప్రసాదాలు అన్నిటిలోను అతి విశిష్టమైనది తీర్థ ప్రసాదం అని చెబుతా రు. ఇంట్లో పూజ, అభిషేకం, ఆరాధన, వ్రతంలాంటి దైవ సంబంధిత కార్యాలు చేసుకున్న తర్వాత తీర్థాన్ని తీసుకుంటాం. అదేవిధంగా దేవాలయాలలో దైవాన్ని దర్శించుకున్న తర్వాత అర్చక స్వాములు యిచ్చే తీర్థాన్ని తీసుకుంటాం. దేవాలయాలలోను, అదే రకంగా ఇళ్ళలోను అర్చన తర్వాత తీసుకునే పవిత్ర జలాన్ని లేక పాలను తీర్థ ప్రసాదం అని అంటా రు. తలపైన శఠగోపం పెట్టించుకున్న తర్వాత, దేవుణ్ణి అభిషేకించిన పాలో, ఉదకమో, పెరు గో, పంచామృతాలో, కళ్ళకు అద్దుకుని తీర్థ ప్రసాదంగా భక్తి ప్రపత్తులతో తీసుకుంటారు.
”అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ పరమేశ్వ ర పాదోదకం పావనం శుభం.” అనే మంత్రాన్ని అర్చక స్వామి జపిస్తూ, తీర్థాన్ని భక్తులకు ఇస్తాడు. అయితే ”శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం” అనే మంత్రంలో, పరమేశ్వర దగ్గర, ఏ దేవునికి మనం పూజ/ అర్చన/ అభిషేకం చేసామో, ఆ దేవుని పేరును చదవాలనే విషయం ఇక్కడ గమనించాలి.
”అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం…” అనే మం త్రోచ్ఛారణ వలన అనంతమైన, అమోఘమైన, పవిత్రమైన మంత్రశక్తి తీర్థానికి ఆపాదింప బడి, ఆ మంత్ర బలం తీర్థానికి సంపూర్ణంగా వస్తుంది.
తీర్థం అంటే తరింప చేసేది అని శాస్త్రం చెబుతున్న అర్ధం. తీర్థాన్ని మూడుసార్లు తీసుకో వడం ప్రశస్తం అని పెద్దలు చెబుతారు. మొదటిసారి తీర్థం తీసుకోవడం వలన శారీరక, మా నసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీసుకోవడం వలన న్యాయ, ధర్మ పరివర్తన జరుగు తుంది. మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వర పధం అనుకుంటూ తీర్థాన్ని తీసుకోవా లని పెద్దలు చెబుతారు.
అదేవిధంగా ”కేశవాయ స్వాహా” అనుకుంటూ మొదటిసారి, ”నారాయణ స్వాహా” అంటూ రెండోసారి, ”మాధవాయ స్వాహా” అనుకుంటూ మూడోసారి తీర్థాన్ని తీసుకోవా లి. ఈవిధంగా తీర్థప్రసాదాన్ని మూడుసార్లు తీసుకోవడం వలన జ్ఞానేంద్రియాలను, కర్మేం ద్రియాలను (అంటే శరీరాన్ని), ముఖ్యమైన మనసునూ సిద్ధం చేయడం, శుద్ధం చేయడము అవుతుందనేది అంతర్లీనంగా దాగున్న అంతరార్ధ ఆధ్యాత్మిక రహస్యం అని చెబుతారు. తీర్థం తీసుకున్నాక కుడిచేతిని కొందరు తలకు తుడుచుకుంటారు. అలా చేయకూడదని శా స్త్రం చెబుతోంది. ఎందుకంటే తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు కాబట్టి మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణ చేసినట్లు అవుతుందని.
వివిధ రకాల తీర్థాలు: జలతీర్థ ప్రసాదం, కషాయతీర్థ ప్రసాదం, పంచామృత తీర్థ ప్రసా దం, పానకతీర్థ ప్రసాదం అని తీర్థ ప్రసాదాలు నాలుగు రకాలు. ఇవే కాకుండా తులసి తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వ తీర్థం యిలా రకరకాల తీర్థాలు కూడా ఉన్నాయి.
తీర్థం ఇలా తీసుకోవాలి
ఎడమ అరచేతిలో కుడి అరచేతిని పెట్టి, కుడిచేతి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలుని మడిచి ( అంటే….గోముఖ ముద్రలో ) తీర్థాన్ని భక్తుడు తీసుకోవాలి.
మరికొంత విపులంగా చెప్పాలంటే, తీర్థాన్ని మగవారైతే తన భుజంపై ఉండే ఉత్తరీ యం లేదా కండువాను, ఆడవారైతే తమ చీర లేదా చున్నీ పైకొంగును ఎడమ చేతిలో నాలు గు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక ఎడమ చేతిలో ఉన్న మడతపై కుడిచే తిని ఉంచి, చూపుడు వేలు ఏమాత్రం తగలకుండా, బొటన వేలుని నడిమి వేలు క్రింది కణుపు నకు గట్టిగా నొక్కిపెట్టి, తీర్థం క్రిందన పడకుండా, నోటి నుంచి జుర్రుకుంటున్నట్టు శబ్దం రాకుండా చూసుకుంటూ, సంబంధిత దైవ నామాలను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో తీర్థాన్ని తీసుకోవాలి.
తీర్థాన్ని తీసుకోకూడని సందర్భాలు
నొసట విభూతిగానీ కుంకుమగానీ లేనప్పుడు తీర్థ ప్రసాదాన్ని తీసుకోకూడదు. అంటు, పురుడు, మైల ఉన్నప్పుడు తీర్థం తీసుకోకూడదు. స్త్రీలు నెలసరి సమయంలో తీసుకోకూడదు. అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే స్నానాదికాలు ముగించుకోకుండాను, మల మూత్రాదులు అయినాక కాళ్ళు చేతులు కడుక్కోకుండాను తీర్థ సేవనం చేయకూడదు. తీర్థప్రసాదం ఏదైనా, అది ఏ రూపంలో ఉన్నా అతి పవిత్రమైనది. లాభకరమైనది మంగళకరమైనది.