Saturday, November 23, 2024

పంచుకుంటే నష్టపోయేది లేదు!

అది హమాలయాలకు దగ్గరలోని ఒక పల్లె టూరు. ఆ ఊరిచివర ఒక ఆశ్రమం ఉండేది. ఒకరోజు ఊరిలోని ఒక రైతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. నేరుగా అక్కడ ఓ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న సాధువు దగ్గరకి వెళ్లాడు. కళ్లు తెరిచి చూసిన సాధువుకి రైతు, రైతు చేతిలో యాపిల్‌ పళ్లు కనిపించాయి.
”స్వామీ నేను ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి అడుగు పెట్టినా మీరు నన్ను ఆదరంగా చూసేవారు. నా సమస్యలని విని సానుకూలమైన పరిష్కరాలు చెప్పే వారు. పంటలు సరిగా పండక నాకు నష్టం వచ్చిన ప్పుడు నా ఆకలిని తీర్చేవారు. నేను నాటిన యాపిల్‌ చెట్లు ఈసారి విరగకాశాయి. మీరు నా పట్ల చూపిం చిన అభిమానానికి కృతజ్ఞతగా వాటి పళ్లను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాదనకండి!” అంటూ సాధువు చేతిలో పళ్లని ఉంచి వెళ్లిపోయాడు.
రైతు తన పట్ల చూపిన కృతజ్ఞతకి సాధువు మురిసి పోయాడు. ”తన గురువుగారు చూపిన సన్మార్గంలో నడవడం వల్లనే కదా, ఇలాంటి జనానికి తన పట్ల గౌరవం ఏర్పడింది!” అనుకున్నాడు.
వెంటనే తన దగ్గర ఉన్న పళ్లను గురువుగారికి ఇవ్వాలని అనిపించింది. గురువుగారి గదిలోకి ప్రవె శించి ఆయన పాదాల దగ్గర యాపిల్‌ పళ్లను ఉంచి జరిగిందంతా చెప్పాడు. తన శిష్యుడు ప్రయోజకుడు కావడం చూసి గురువుగారికి ముచ్చట వేసింది. అంతకుమించి శిడ్యుడు తనికి లభించిన బహుమతిని తీసుకువచ్చి తన పాదాల దగ్గర ఉంచడం ఇంకా సంతోషం కలిగించింది.
అంతలో గురువుగారికి ఆశ్రమంలో వున్న ఇతర శిష్యులు కూడా గుర్తుకువచ్చారు. వారిలో ఒక శిష్యు డు పాపం వారం రోజుల నుంచి విపరీతమైన జ్వరం తో బాధపడుతున్నాడు. వెంటనే ఆ శిష్యుని గదిలోకి ప్రవేశించారు గురువుగారు.
గురువుగారు స్వయంగా తన దగ్గరకు రావడంతో ఆ శిష్యుడు పరమానందభరితుడయ్యాడు. లేని ఓపిక తెచ్చుకుని లేచి నిలబడి గురువుగారికి నమస్క రించాడు. ఆయన పరామర్శనీ, దాంతోపాటుగా అందించిన యాపిల్‌ పళ్లనీ చూసేసరికి అతని రోగం సగం తగ్గిపోయినంత ఓపిక వచ్చే సింది. ఆ యాపిల్‌ పళ్లని చూస్తూ కూర్చున్న శిష్యుడికి రోజూ తన బాగో గులు చూసుకునే వంటవాడు గుర్తు కువచ్చాడు. పాపం ఆ వంటవాడు తనకి ఏ ఆహారం సరిపడుతుంది..? ఎలాంటి పథ్యం చేయాలి..? అన్న విషయాలను చాలా శ్రద్ధగా గమ నించేవాడు. శ్రమ అనుకోకుండా తనకి రోజూ ప్రత్యేకంగా వంట చేసే వాడు. వెంటనే తన కృతజ్ఞతకి గుర్తు గా శిష్యుడు వంటగదిలోకి వెళ్లి వంటవాడి చేతిలో యాపిల్‌ పళ్లని ఉంచాడు. యాపిల్‌ పళ్లని చూసిన వంటవాడికి నోట మాట రాలేదు. ఏదో ఆశ్రమంలో ఉంటూ నలుగురితో పాటుగా పొట్ట నింపుకుందామని అనుకున్నాడు కానీ, వారు తనని ఇంత గౌరవంగా చూసుకుంటారని అతడు అనుకోలేదు. యాపిల్‌ పళ్లదేముంది! తాను ఎప్పుడూ తినేవే! కానీ ఈసారి చేతికి వచ్చిన పళ్లు చాలా అపురూపమైనవి. అవి తన పట్ల ఓ సాధువు చూపిన అభిమానానికి గుర్తు. అందుకనే వాటిని తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. రోగంతో బాధపడిన శిష్యుడికి తను చేసిన సేవ గురించి చెబుతూ… ”నువ్వు కూడా నాలాగా ఇత రులకు సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలి” అంటూ భుజం తట్టాడు.
‘తండ్రి చెప్పింది నిజమే కదా!’ అనిపించింది కొడుకుకి.
ఒకసారి తమ గతాన్నంతా కొడుకు నెమరువేసు కున్నాడు. ఏడాది క్రితం తమ కుటుంబం కటిక దరిద్రంలో ఉండేది. వంటవాడి ఇంట్లో వండుకునేం దుకు గింజలే లేవు. కుటుంబం అంతా రోజుల తరబడి పస్తులు వుండేవారు.
అలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చిన ఓ సాధువు తన తండ్రిని తీసుకువెళ్లి వాళ్ల ఆశ్రమంలో వంటవాడిగా చేర్పించాడు. ఈ రోజున తామందరూ వేళకి ఇంత తినగలుగుతున్నాడంటే ఆ ఆశ్రమం చలవే!’ అనుకున్నాడు కొడుకు. వెంటనే ఆశ్రమం వైపు బయల్దేరాడు. అక్కడ పదుల కొద్దీ సాధువులు తిరుగు తున్నారు. వారిలో ఆ రోజు తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని స్పష్టంగా గుర్తుపట్టాడు కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయనకు నమస్కరించి, తన చేతిలో వున్న యాపిల్‌ పళ్లని అతని చేతిలో పెట్టాడు. ఆ సాధువు ఎవరో కాదు.
పళ్లని గురువుగారి పాదాల చెంత ఉంచినవాడే! సంతోషాన్ని ఒకరితో పంచుకోవాలనుకుంటే, అది తిరిగి ఎలా తన దగ్గరకే వస్తుందో సాధువుకి అర్థమై పోయింది. పంచుకునే గుణంలో ప్రతి ఒక్కరి మనసూ తృప్తి చెందుతుందని తెలిసిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement