Friday, November 8, 2024

ప్రకృతి ఒడిలో పంచభూతాలు

ప్రకృతి” పదంలో ప్ర అంటే శ్రేష్ఠమైన అని. కృతి అంటే సృష్టి అని అర్థం. ప్రకృతి అంటే సృష్టిలో అందరికన్నా శ్రేష్ఠమైనదని భావం. మరో విధంగా చెప్పాలంటే ప్ర అంటే సత్త్వగుణం, కృ అంటే రజోగుణం, తి అంటే తమో గుణం. అనగా సత్త్వ, రజ, స్తమోగుణాలు కలిగిన ”త్రిగుణ స్వరూపిణి” అని బ్ర#హ్మ వైవర్తన పురాణం తెలి యచేస్తోంది.
”పృథివ్యాపస్తేజో వాయు రాకాశాత్‌” అంటే భూమి, నీరు అగ్ని, వాయు వు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటన్నింటికి ప్రకృతే ఆధారం. ప్రకృతిలో ఈ పంచభూతాలు మిళితమై జీవకోటికి ఉపయోగపడుతున్నాయి. ప్రకృతి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రకోపించడం వల్లనే, తుఫాన్లు, ఉప్పెనలు, భూ కంపాలు వంటివి ఏర్పడి, పంచ భూతాలు వాటి ప్రభావానికి జీవులు గురవుతున్నారు. మనకు ప్రత్యక్షంగా అనుభవమే కదా! సృష్టి కార్యంలో జీవుల మనుగడకు ఈ పంచభూతాలను పరమాత్మ సృష్టించినదే. ప్రతీ యుగాంతంలో జీవరాశి నశిం చిపోయి, ప్రకృతి, అల్లకల్లోలమై, భూమండలం అంతా జలమయమైపోతుం ది. క్రొత్తగా సృష్టికి నాంది పలుకుతుంది. సృష్టికి మూలం పర బ్రహ్మ స్వరూపం. దానినుండే ఆకాశం ఉద్భవించింది. అందుకే పెద్దలు ఆకాశం బ్రహ్మతత్త్వమే అని అం టారు. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి (భూమి) ఇలా పంచభూ తాలు కల్పించబడ్డాయి. అందుకేనే మో లయకారుడు ఈ పంచభూతాల కు ప్రతీకగా ఈ భూమండలంలో ఐదుచోట్ల స్వయంభూగా కొలువై ఉన్నాడు. అంటే ఒకవిధంగా పరమే శ్వరుడు తత్త్వం పంచ భూతాత్మకమై నదేనని తెలుస్తోంది.
చిదంబరంలోని చిదంబకేశ్వరు డు (నటరాజస్వామి) ఆకాశ తత్త్వానికి, శ్రీ కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు వాయు తత్త్వానికి, అరుణాచలంలోని అరుణాచలేశ్వరు డు అగ్నితత్త్వానికి, తిరుచ్చి దగ్గరగా ఉన్న జంబుకే శ్వరంలో జంబుకేశ్వర లింగం జలతత్త్వానికి, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీ తత్త్వానికి కొలువై ఉండి ఆరాధింపబడుతు న్నారు. ఆకాశానికి శబ్దం, వాయువుకు స్పర్శ, అగ్నికి రూపం, జలానికి రసం, భూమికి గంధం అనే గుణాలు కలిగి ఉన్నాయి. మానవ శరీరం కూడా పంచ భూతాత్మకమైనదే. అది ఎలాగో తెలుసుకుందాం.
పూర్వ జన్మల కర్మల ఫలితంగా శరీరం ఏర్పడింది. మనిషి శరీరంలోని స్థూ ల, సూక్ష్మ శరీరాలలో ఈ పంచభూతాల శక్తి అంతర్లీనంగా ఇమిడి ఉంది. స్థూల శరీరం అంటే పైకి కనిపించే శరీర భాగాలు. కాళ్ళు, చేతులు, హృదయం, తల వం టివి జీవి కర్తృత్వ భావనలో రమిస్తూంటాయి. జననం- యవ్వనం- వృద్ధాప్యం- మరణం ధర్మాలను అనుసరిస్తుంది. ఈ స్థూల శరీరంలోని వాక్కు (కంఠం), పాణిపాదం- వాయువు (మలద్వారం)- ఉపస్థ ( జననాంగం) ఈ కర్మేంద్రియా లు పృథ్వీ తత్త్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
చర్మం, ముక్కు, కండ్లు, చెవులు, నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలు అగ్ని తత్త్వానికి ప్రతిరూపం. ప్రాణ- అపాన- వ్యాస ఉదాన- సమాన అనే పంచప్రాణా లు వాయుతత్త్వానికి ప్రతీక. మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం, ఈ ఐదు అంత రేంద్రియాలు ఆకాశతత్త్వానికి, మన శరీరంలో జలతత్త్వం రక్తం రూపంలో ఉం టుంది. శబ్దం, రూపం, రసం, గంధం, స్పర్శ ఈ ఐదు పంచతన్మాత్రుకలు జలత త్త్వానికి, మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం ఆకాశ తత్త్వానికి ప్రతీకలు.

పంచభూతాల తత్త్వాలు

ఆకాశ తత్త్వం: మేఘాలతోకూడి, వర్షం కురిపిస్తుంది. ఆకాశం అంటే అనంతం. మనకు దృగోచరమవుతున్న సూర్య, చంద్రుల తేజస్సు ఆకాశం నుండే ప్రసరించబడుతోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఋతువులను బట్టి స్పంది స్తూ ఉంటుంది. గ్రహాల ఉనికి తెలుసుకోవడానికి అంతరిక్ష పరిశోధనల్లో ఎక్క డా ఆకాశం స్వరూపం కాని, ఎంతమేర విస్తరించిందోననే విషయాలు వెలుగు లోకి రాలేదు. ఆకాశం విశ్వం అంతా వ్యాపించే ఉంది.
వాయు తత్త్వం: వాయుదేవుడకు సంబంధించినది. వాయుదేవుడు క్రియా స్వరూపుడు. సర్వకాలాల్లోను ప్రతీక్షణం కర్తవ్యాన్ని నిర్వహస్తూనే ఉంటాడు. వాయువ్య దిక్కుకు అధిపతి వాయువు. వాయుదేవుడు ఈ జగత్తులో జరుగు తున్న ప్రతీ కార్యానికి సాక్షీభూతుడుగా ఉన్నాడు. పైన చెప్పుకున్న విధంగా ఆకా శం నుండే వాయువు పుట్టింది. వాయువు లేకపోతే జీవుల మనుగడే ఉండదు కదా! జీవుల శరీ రంలో వాయువు ఉండబట్టే , ఎవరి పనులు వారు నిర్వర్తించ గలుగుతున్నారు. శరీ రంలోని ప్రాణం ఐదు వాయువుల రూపంలో ఉంటుంది. అవే పాన, అపాన, వ్యాస, ఉదాన, సమానములు. శరీరం నుండి ఈ వాయువు లు నిష్కృమిస్తే జీవి మరణించినట్లే! వాయువును నిరోధించి చేసే ప్రక్రియను ”ప్రాణాయామం” అంటారు.
పృథ్వీ తత్త్వం: దీనినే భూతత్త్వం అంటారు. అగ్నితత్త్వంకంటే స్థూలమైనది. అందుకే సమ స్త జీవులు భూతత్త్వంలోనే ఇమిడి ఉన్నా యి. మనకు గోచరిస్తున్న మైదాన ప్రాం తం, అడవులు, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, వంటి ఎన్నిటి కో పృథ్వీ తత్త్వమే ఆధారం. జీవుల పోషణకు అవసరమైన ఆహారం, జలం వంటివన్నీ భూమి నుండే పొందగలుగుతున్నారు. జల సంప దను, ఖనిజ సంపదను అనేక లవణా లను, తనలోనే నిక్షిప్తం చేసుకున్నది. జలతత్త్వం: ఈ జలతత్త్వానికి, పృథ్వీ తత్త్వానికి, ఆకాశ తత్త్వానికి, అంతర్లీనంగా సంబంధం ఉంది. జలచక్రం ఆధారంగా చూస్తే, భూమి పైనున్న నీరు వేడికి, ఆవిరై, మేఘాలతో కలిసి వర్షం రూపంలో తిరిగి భూమికి చేరుకొంటుం ది. పంటలు పండాలన్నా, ఓషధులు పెరగాలన్నా, జీవుల దాహార్తి తీరాలన్నా ఈ జలం ముఖ్యం. గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, వంటి జీవనదుల ప్రాధాన్యత మన కు తెలిసిందే. జలం ప్రాధాన్యం దృష్ట్యా ఈ మధ్య గంగ, గోదావరి వంటి నదులకు హారతి కార్యక్రమం చేపట్టి పూజిస్తున్నారు.
అగ్ని తత్త్వం: సాధారణంగా అగ్ని ఐదు రకాలుగా ఉంటుంది. అవే బడ బాగ్ని, జఠరాగ్ని, కాష్ఠాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని. బడబాగ్ని సముద్రంలో సంభవిస్తుంటుంది. జఠరాగ్ని ప్రతీ జీవుల ఉదరంలో ఉంటుంది. ఆకలిని పుట్టించడం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో నిమగ్నమై ఉంటుంది. కాష్ఠాగ్ని వేసవి కాలంలో అడవుల్లో కర్రలు, రాళ్ళు రాపిడి వల్ల ఉద్భవిస్తుంది. అంతేకాకుండా రెండు కర్రల ఆరణి వల్ల పుట్టించిన అగ్ని ద్వారానే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వంటివి నిర్వర్తిస్తుంటారు. ఇంకా వజ్రాగ్ని ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది. సూర్యాగ్ని సూర్య కిరణాలు నుంచి వచ్చేదే. అగ్ని సాక్షిగా బ్రహ్మోపదేశం, వివాహం వంటి కార్యక్రమాలు నిర్వహస్తున్నారు. జీవు డు శరీరం వదిలిన పిమ్మట, కాష్ఠంలో అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. దీనినే క్రవ్యాగ్ని అని కూడా అంటారు. దీనివల్ల జీవుడుకి పవిత్రత లభిస్తుంది.
ఇంతటి మహోన్నతమైన పంచభూతాలను కలుషితం చేసేస్తున్నాము. ఇప్పుడైనా వాటి శుచిని, శుద్ధి తత్త్వాన్ని గుర్తించి, పరమాత్మ సృష్టిలో కల్పించిన ఈ వనరులన్నీ కాపాడుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement