Thursday, November 21, 2024

సాయి స్వాధీనంలో పంచభూతాలు

శ్రీ సాయినాధునిది పరిపూర్ణ, పరిశుద్ధ పరమేశ్వర అవతారం. ఈ కలియుగ ములో యజ్ఞ యాగాదులను చేయడం, యమాది నియమాలతో ఆష్టాంగ యోగాలను చెయ్యడం సామాన్యులకు సాధ్యంకాదు. అందుకే భగవంతుని అఫుర్వ మైన కరుణా కటాక్షములను పొందేందుకు నామస్మరణను సాధనంగా తెలియజే సారు సాయి. ఎటువంటి ప్రదేశంలోనైనా, పరిస్థితులలోనైనా సాయి నామస్మరణ చేస్తే చాలు తాను అతి సులభంగా ప్రసన్నుడనై భక్తుల కష్టాలను, కన్నీళ్ళను తీరుస్తానని సాయి ఉద్భోదించారు. ”నా పూజనే చేస్తూ, నా నామమునే జపించుచూ, నా లీలలను, చరిత్రమునూ మననం చేస్తూ, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకొనుచూ ప్రపంచ విషయములందు తగుల్కొనరు. వారిని ఎల్లవేళలా కాపాడి మొక్షార్హులను చేస్తాను. ‘సాయి…సాయి’ అను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రాన చెడు పలు కుట వలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును అని సాయి తన నామ స్మ రణ యొక్క ప్రభావాన్ని అద్భుతంగా వివరించారు. సాయినాధులకు పంచభూతము లను ఎట్లు తన స్వాధీనములో వుంచుకున్నారో తెలిపే రెండు లీలలను ఇప్పుడు స్మరించుకుందాము.
ఒకనాటి సాయం కాలము శిరిడీలో పెద్ద తుఫాను వచ్చింది. గాలి తీవ్రముగా వీయడం వ లన చెట్లు, ఇళ్ళ కప్పులు ఎగిరిపోయాయి. ఉరు ములు, మెరుపులతో పె ద్దగా కుంభవృష్టి కురిసింది. కొద్దిసేపటిలోనే శిరి డీలోని నేలంతా జలమ యమయ్యింది. ఈ తు ఫాను మరికొంతసేపు న డిస్తే ఊరు మొత్తం ముని గి పోవడం ఖాయం. గా మంలో కొలువై వున్న దేవత లెవ్వరూ ఆదుకొ నడానికి ముందుకు రాలే దు. గ్రామ వాసులందరూ సాయినామ జపం చేస్తూ మశీదుకు వచ్చి రక్షింపమని బా బా కాళ్ళపై పడ్డారు. భక్తుల పాలిటి కల్పవృక్షం, ఆర్తత్రాణ పరాయణుడు అయిన సాయి హృదయం కరిగి, వెంటనే మశీ దు బయటకు వచ్చి ”ఆగు, నీ తీవ్రతను తగ్గిం చు, వచ్చిన దారినే వెంటనే వెళ్ళిపో” అంటూ తీవ్రంగా గర్జించారు. బాబా పలు కులలోని మహత్యాన్ని గమనించండి. పంచభూతములన్ని బాబా స్వాధీనములో వున్నాయి. వెంటనే తుఫాను ఆగిపోయింది. ఆకాశం నిర్మలమైపోయింది. ప్రజలం దరూ బాబా మహత్యానికి అచ్చెరు వొంది, తుఫానును ఆపి తమను రక్షించినందుకు బాబాకు వేన్నోళ్ల కృతజ్ఞతలను అర్పించుకున్నారు.
మరొక సమయంలో ఒక మధ్యాహ్నం ధునిలో మంటలు అపరిమితంగా లేచా యి. మంటలు మశీదుకున్న దూలాలను తాకసాగాయి. మశీదులో కూర్చున్నవారికి ఏమీ చేయడానికి పాలుపోలేదు. ధునిలో నీళ్ళు పోసి మంటలను చల్లార్చమని బాబా ను ప్రార్ధించడానికి అక్కడున్న వారికెవరికీ ధైర్యం చాలక మనసులోనే సాయి సాయి అంటూ నామస్మరణ చెసుకోసాగారు. వారి భయాందోళనలను గ్రహించిన సాయి ధుని వద్దకు వచ్చి తన సటకాతో పక్కనున్న స్థంభమును కొడుతూ ”దిగు, దిగు, శాం తించు” అని అన్నారు. చిత్రాతి చిత్రంగా అగ్ని దేవుడు బాబా మాటలను శిరసా వహించినట్లుగా ధునిలోని మంటలు కొంచెం కొంచెంగా తగ్గిపోయి కొద్దిసేపటిలోనే యధాస్థితిలో మండసాగాయి. భక్తుల మనస్సులలోని భయాందోళనలు తగ్గిపోయి ప్రశాంతతను సంతరించుకున్నాయి. ఈవిధంగా సాయినాధుని పలుకులు బ్ర#హ్మ వాక్కుతో సమానమని భక్తులందరికీ అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.

  • సిహెచ్‌.ప్రతాప్‌, 95508 51075
Advertisement

తాజా వార్తలు

Advertisement