Friday, September 20, 2024

మా హింస్యాత్‌ సర్వభూతాని

కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఇరుపక్షాల సేనలు మోహరించి న వేళ అర్జునుడు బంధువులను సంహరించలేనని కృష్ణుడితో పలికాడు. ”నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను” అని అన్నాడు. పోట్లాడటం, చం పటం చాలా సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అప రాధ భావనని కలుగచేస్తాయి. అహంస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి. తీవ్ర పరిస్థితులలో తప్ప హంస ఒక పాపం. ”మా హంస్యాత్‌ సర్వ భూతాని”. ”ఏ ప్రాణిని కూ డా చంపకు” అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్ట పడటం లేదు. ఎం దుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కానీ, ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు వుంది అని వశిష్ఠ స్మృతి (3.19వ శ్లోకం) చెపుతోంది. సంపదకి నిప్పు పెట్టేవారు, అన్నం లో విషం కలిపే వారు. చంపటానికి ప్రయత్నించేవారు. సొత్తుని కొల్లగొట్టేవారు. భార్యని అప#హరించ వచ్చి న వారు, రాజ్యాన్ని అన్యాయంగా లాక్కొనే వారు. ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి (8.351) చెపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement