మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్ర స్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రామనారాయణరెడ్డి సోమవారం తమ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , మునిసిపల్ శాఖామంత్రి పి. నారాయణతో కలిసి చారిత్రాత్మకమైన తల్పగిరి రంగనాథస్వామిని దర్శించుకున్నారు.
- Advertisement -
ఈ సందర్భంగా .. ఆలయప్రాంగణంలో రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచనలైన ‘ జయ జయ శత్రు భయంకర’, ‘ నమోనమస్తే ‘ గ్రంథాలను ఆవిష్కరించి తొలి ప్రతులను ఎంపీ వేమిరెడ్డికి అందజేశారు.