Saturday, November 23, 2024

అష్ట దిక్కుల ప్రాధాన్యత!

మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని ‘అష్ట దిక్కులు’ అంటాము. వాటిని పాలించే వారిని ‘దిక్పాలకులు’ అంటారు. ఆ దిక్కుల ప్రాధాన్యత, ఆయా దిక్కులను పాలించే దేవతలు, మానవ జీవితంపై వాటి ప్రభావం ఎలా వుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.

దిక్కులు నాలుగు. అవి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములు. ఈ నాలుగింటితో పాటు ఈశాన్య ము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అనే నాలు గు విదిక్కులు కూడా వున్నాయి. అన్నింటిని కలిపి అష్టదిక్కు లు అంటాము.
తూర్పు

తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము ‘అమరా వతి.’ ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతా న కారకుడు. అధికారం కలుగజేయు వాడు. సూర్యగ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి.
ఆగ్నేయ మూల
ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టే లు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబంధించిన దిక్కు. వంట స్త్రీలకు సంబంధించి నది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.
దక్షిణము
దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమ ధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయము న్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధంగా కలవాడు కాబట్టి ‘దండపాణి’ అని కూడా అం టారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించే వాడు. కుజు డు ఆధిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగు తాయి.
నైరుతి మూల

నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయు ధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహు గ్రహ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం.
పడమర
పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరు ణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వా#హనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం అవుతాయి.
వాయువ్య మూల

వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనా దేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువా డు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడు కులు ఉంటాయి.
ఉత్తరము

- Advertisement -

ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరు డు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గ ము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంధ విషయాలలో ఇబ్బందులు వస్తాయి.
ఈశాన్య మూల
ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివు డు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము (ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయు ధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అ్టషశ్వర్యాలు, భక్తి జ్ఞాన ములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆధిపత్యం ఉంటుంది. ఈశాన్యదిక్కు లోపంవల్ల సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి. ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పా లురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. దిక్కు లేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడు తూ ఉంటారు. దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాల ను, నియమాలను, ధర్మాలను ఆజ్ఞాపించువాడు, నడిపించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహావిష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

– డా. సిహెచ్‌.హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement