నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే|
శంఖచక్రగదాహస్తే – మహాలక్ష్మీ ర్నమోస్తుతే||
లక్ష్మీ అనే పదం ‘లక్ష్’ అనే ధాతువు నుంచి ఏర్పడుతుంది. లక్ష ణ యుక్తులను గుర్తించి, లక్షణంగా చేసే దేవత గనుక లక్ష్మి అయ్యిం ది. సాధారణంగా లక్ష్మీదేవి అంటే అందరూ ధనం అనే అనుకుంటా రు. కానీ మనిషికి శుభాన్ని, సౌఖ్యాన్ని అందించే ప్రతి అంశమూ లక్ష్మీ స్వరూపమే. జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయం, ధైర్యం ఇలా అన్నీ లక్ష్మీ స్వరూపాలే. పాలించే పరమాత్ముని కి అన్నింటిలోనూ సహాయ సహకారాలు అందించి జనులకు సౌభా గ్యాన్ని అందించే రూపమే, లక్ష్మీ స్వరూపం.
హరిప్రియ అయిన శ్రీలక్ష్మి విష్ణువు వలే సర్వాంతర్వామి. విష్ణు వు అర్థం అయితే లక్ష్మి శబ్దం. విష్ణువు జ్ఞానం అయితే లక్ష్మి బుద్ధి. విష్ణు వు ధర్మం అయితే లక్ష్మి సత్ క్రియ, విష్ణువు న్యాయం అయితే లక్ష్మి నీతి. విష్ణువు స్రష్ట అయితే లక్ష్మి సృష్టి. మానవుల్లో పురుష నామం ఎక్కడ ఉంటుందో. అక్కడే స్త్రీ రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుం దని, వీరికంటే పరమ పదమైనది ఏదీ లేదని పరాశర మహర్షి తెలి యజేశారు. ఫల్గుణి నక్షత్రం పున్నమినాడు ఉండుట వలన ”ఫాల్గుణ మాసము” అని పేరు వచ్చింది. ఫాల్గుణ పౌర్ణమినే వసంతోత్సవమ ని, మదనోత్సవమని, హోలికాదహనమని కూడా అంటారు.
క్షీరసాగర మథనంలో శ్రీలక్ష్మీదేవి ఆవిర్భావం ఒకటి అద్భుత ఘట్టం. సాగర మథనంలో మాఘ బ#హుళ చతుర్దశి నాడు పుట్టిన తర్వాత హాలాహలాన్ని శివుడు స్వీకరించి నీలకంఠుడిగా వినతికె క్కాడు. సరిగా పక్షం రోజులకు ఫాల్గుణ పౌర్ణమి ఉత్తర ఫల్గునీ నక్ష త్రంలో అమృతంతోపాటు జగన్మాత అవతరించారు. విష్ణువును వరించి, ఆయన మెడలో పుష్పహారం సమర్పించి స్వామి వక్షస్థలం లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇది కేవలం అమ్మవారి జయం తే కాకుండా అయ్యవారిని చేపట్టిన రోజు కావడం విశేషం. అలా శ్రీహ రి ఉన్నచోటనే శ్రీ మహాలక్ష్మి ఉంటుందనే నానుడిని సార్థకం చేశారు.
లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమ యినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
1. స్వాయంభువ మన్వంతరంలో- భృగువు, ఖ్యాతిల పుత్రికగా.
2. సార్వోచిష మన్వంతరంలో- అగ్ని నుండి అవతరణ.
3. జౌత్తమ మన్వంతరంలో- జలరాశి నుండి
4. తామస మన్వంతరంలో – భూమి నుండి
5. రైవత మన్వంతరంలో- బిల్వవృక్షం నుండి
6. చాక్షుష మన్వంతరంలో- స#హస్రదళ పద్మం నుండి
7. వైవస్వత మన్వంతరంలో- క్షీరసాగరంలో నుండి ఆవిర్బ
éవించినట్లు తెలుస్తుంది.
యత్ర నాస్తి హరే: పూజా తదీయ గుణ కీర్తనమ్|
నోత్సుకశ్చ ప్రశంసాయాం నయామి తస్య మందిరమ్||
(శ్రీహరి పూజ, శ్రీహరి గుణకీర్తనం, శ్రీహరిని ప్రశంసించడం పట్ల ఉత్సుకత లేని వారి మందిరంలోకి నేను ప్రవేశించను) అని ఆమె ప్రకటించారట.
”సిరిసంపదల కన్నా, హరి దంపతులు మిన్న” అనే నానుడి అలా పుట్టిందంటారు. అమ్మవారు అలా పతిపట్ల అనురాగం, భక్తిని చూపితే, స్వామి వారు ఇలా సతీప్రేమను చాటారు. విష్ణుస#హస్ర నా మ పారాయణం ప్రారంభానికి ముందు అమ్మవారి అష్టోత్తర పఠ నం ఆనవాయితీ అలా వచ్చి ఉండవచ్చు. విష్ణువు సమస్త ‘పురుష ప్రకృతి’కి ప్రతీకలా, లక్ష్మి సమస్త ‘స్త్రీ ప్రకృతి’కి ప్రతీకగా చెబుతారు. వారిద్దరిది అవినాభావ సంబంధం. ఫాల్గుణ మాసానికి ‘తపస్య మాసం’ (తపస్సు నందు యోగ్యమైనది) అని పేరు.
లక్ష్మీనారాయణులు అన్యోన్య తప:ఫలంగా దివ్య దంపతులై, ఆదిదంపతులుగా వినుతికెక్కారు. విష్ణువు అవతరించిన ప్రతిసారీ అమ్మవారు అందుకు అనుగుణంగా వివిధ పేర్లతో అవతరిస్తుంటా రు కష్టసుఖాలలో పాలుపంచుకుంటూనే ఉంటారు. పురుష దేవతల కు ‘జయంతి’ పేరిట ఉత్సవాలు నిర్వ#హంచడం సర్వసాధారణం కా గా, స్త్రీ దేవతలలో ఆ ప్రత్యేకత లక్ష్మీదేవికే దక్కిందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇతర స్త్రీ దేవతలకు ‘వ్రతం’ పేరిట జరుపుకోవ డం తెలిసిందే. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. అమ్మవారి విష్ణుమూర్తిని విడి చిఉండలేదట. అందుకే అమ్మకు ”నిత్యాన్నపాయిని” అని పేరు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, తప్ప కుండా విష్ణుమూర్తిని ఆరాధించాలి . అప్పుడే ఫలితం లభిస్తుంది.
కుచేలినం దంత మలాప హారిణం, బహ్వాశినం నిష్టుర వాక్య భాషిణమ్|
సూర్యోదయే చాస్తమయేచ శాయినం, విముంచతి శ్రీ రపి చక్రపాణినమ్||
మలిన వస్త్రమును ధరించిన వానిని, పళ్ళు తోమనివానిని, తిం డిపోతును, నిష్టురోక్తులాడు వానిని (లేనిపోని నిందలువేసి మాట్లా డువానిని) ఉదయం సాయంకాలములందు నిద్రించు వానిని, ఇతర గుణముల చేత విష్ణు సమానులైనను వీరిని లక్ష్మి పరిత్యజించు ను. జగన్మాత మహావాత్సల్యాది సద్గుణవతి. భక్తులకు, భగవంతునికి మధ్యవర్తిని. వారి కష్టనష్టాలను స్వామి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరి స్తుందని విశ్వాసం. ఆ కోణంలోనే ‘దేవదేవ దివ్యమ#హషీం అఖిల జగన్మాతరం, అసన్మాతరం అశరణ్య శరణ్యం అనన్య శరణ్యం’ అని భగవద్రామానుజులు శరణాగతి చేశారు.
‘హరికిన్ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చందు రుడు తోబుట్టువు…’ (శ్రీమద్భాగవతం) పద్యంలో ”శ్రీ#హరికి పట్టపు దేవియైన శ్రీదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల గని, చంద్రుని సోదరి, వాణీశర్వాణీలతో క్రీడించే పూబోణి, తామరపువ్వులో నివసించే సౌం దర్య రాశి, ముల్లోకాలకు పూజనీయురాలు, దారిద్య్రాన్ని రూపుమా పే తల్లి శ్రీమహాలక్ష్మి శాశ్వత శుభాలు ప్రసాదించుగాక” అని పోతనా మాత్యుడు వర్ణించారు. ”నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి” అం టూ కంచర్ల గోపన్న (రామదాసు) కూడా అయ్యవారి కరుణా కటా క్షాల కోసం అమ్మవారికి మొరపెట్టుకున్నారు. శ్రీనివాసుడి పట్టమ #హషి పద్మావతిదేవికి శ్రీమహాలక్ష్మికి అభేదం చెబుతూ-
”శ్రీమహాలక్ష్మియట సింగారాల కేమరుదు
కాముని తల్లియట చక్కదనాల కేమరుదు
సోమును తోబుట్టువట సొంపుకళల కేమరుదు’ అని అన్నమా చార్య కీర్తించారు. ‘విష్ణుడొక్కడే విశ్వాంత రాత్ముడు’ అనీ కీర్తించారు అన్నమాచార్య. విష్ణువే విశ్వాత్ముడు, విశ్వాధిపుడు అయినప్పుడు ఆయన #హృదయవాసిని అన్నిటికన్నా మిన్నని, శ్రీదేవిని ఆశ్రయించ డం ఉత్తమ ఫలదాయక మని అంటారు ఆధ్యాత్మికులు. సిరి రాక పోకలు దైవాధీనాలు. ‘సిరితా వచ్చిన వచ్చును సలిలము భంగిన్’ అన్న శతక కర్త మాటలు గమనార్హం. అత్యాశకు పోకుండా, లౌకిక జీవయాత్రను ధర్మబద్ధంగా సాగించే వారిని అమ్మవారు అష్టలక్ష్మీ రూపంలో కరుణిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.