స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి . వెలి గిం చ డం చాలా సులభం. కానీ అది ఆరిపోకుం డా కాపాడుకోవడం చాలా కస్టం . స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకూ ఆ స్నేహం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది . అందరినీ విమర్శించే వారు ఎప్పటికీ మనశ్శాంతి గా ఉండలేరు .
కానీ అందరినీ పలకరిస్తూ సరదాగా నలుగురితో కలిసి మెలిసి ఉండేవారు ఎప్పుడూ నిత్య నూతన ఆనందంగా ఉంటారు . ఒకసారి ఎవరి గురించి అయినా మనసులో దురభిప్రాయం కలిగితే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఎందుకంటే తెగిపోయిన దారానికి ముడి వేసినా అది ముడిలాగే కనిపిస్తుంది కానీ మునుపటి లాగా ఉండదు. అందుకే తెంపుకొనే ముందే ఆలోచించాలి. అది దారమైనా, బంధమైనా గానీ. మనిషికి మితం గా, హతంగా మాట్లాడే తీరు ఆ మనిషి మంచిత నానికి ముత్యాల హారం లాంటిది . మనం సంపా దించుకున్న విజ్ఞానం ఒకరి నుండి మరొకరికి చేరిన ప్పుడే దానికి విలువ. మనం ఎంత విజ్ఞానం సంపా దించినా… అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయో జనమే. మనకు మంచి చెప్పేవారు దొరకడం అదృష్టం. ఆ మంచి వినకపోవడం దురదృష్టం . మనలో గెలవాలి , ఎదగాలి అన్న లక్ష్యం బలంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా జయిం చవచ్చు. ఎందుకంటే బల#హనమైన మొక్క కూడా బలమైన బండరాయిని సైతం చీల్చుకొని వచ్చి మహా వృక్షంగా మారిన దాఖలాలు ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా ఎదుటి వారి లోపాలను మాత్రం పట్టుకొని చులకన చేసి మాట్లాడకుండా మన మనసుని కాస్తా విశాలం చేసుకొని చూస్తే వారి లోపా లు చిన్నవిగా కనిపిస్తాయి, బంధాలు నిలబడ తాయి . వారిలో ఉన్న లోపాలను సరిదిద్దగలిగితే వారితో బంధం ఇంకా బలపడి ఆన్ని విషయాలలో మనకు చేదోడు వాదో డుగా ఉంటారు . మనం సక్రమ మార్గంలో పయనించి నప్పుడు ఎవరెన్ని ఎత్తులు పన్నినా చివరకు న్యాయం మాత్రమే గెలుస్తుంది ., సత్యం మాత్రమే నిలు స్తుంది. ఈ జీవితం చాలా చిన్నది. కాబట్టి ఎన్ని బాధలు న్నా, ఎప్పు డూ నవ్వుతూ… నవ్విస్తూ నిత్య నూతనంగా జీవించాలి.
– డా|| చదలవాడ హరిబాబు 9849500354