Saturday, November 23, 2024

నిస్సారం దుఃఖభాగుల జీవనం

”అ హన్యస్తమయాంతాని ఉదయాంతాచ శర్వరీ
సుఖస్యాంతం సదా దు:ఖం దు:ఖస్యాంతం సదా సుఖమ్‌”
పగలు సూర్యాస్తమయంతో, రాత్రి సూర్యోదయంతో అంతమైనట్లుగా, సుఖమెప్పుడూ దు:ఖంతో, దు:ఖమెప్పుడూ సుఖంతో అంతమవుతుందని పై శ్లోకానికి అర్థం. ఈ ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకొని, సుఖాలకు పొంగిపోకుం డా, దు:ఖాలకు కృంగిపోకుండా, ద్వంద్వాలను ఓర్చుకోవడమే స్థితప్రజ్ఞుని లక్షణమంటుంది భగవద్గీత.
”నాస్తి రాగసమం దు:ఖం, నాస్తి త్యాగసమం సుఖమ్‌”. మోహంతో సమా నమైన దు:ఖము, త్యాగంతో సమానమైన సుఖము లేదన్నారు పెద్దలు. అంతే కాదు. ”సర్వే జనా: సుఖినో భవంతు” అందరూ సుఖంగా ఉండాలి. ”మా కశ్చి ద్ధు:ఖ భాగ్భవేత్‌” ఎవరూ దు:ఖితులు కాకుండా ఉండాలి. ఆ అందరిలో మన మూ ఉండాలి అని కోరుకోవడం ఉత్తముల లక్షణం అంటాయి వేదాలు. కానీ, కోరుకొన్నట్లు జీవితం ఆనందమయంగా సాగితే సుఖమని, దానికి వ్యతిరేకం గా జరిగితే దు:ఖమని సహజంగా మనం భావిస్తాము. అయితే కొన్ని స్వయం కృత అపరాధాల వలన మనిషి దు:ఖాన్ని కోరితెచ్చుకొంటాడు అవి—–
”ఈర్ష్యీ, ఘృణీ, న సంతుష్ట: క్రోధనో, నిత్యశంకిత:
పరభాగ్యోప జీవీచ షడైతే నిత్య దు:ఖితా:”
అసూయ, అతిగా అసహ్యంచుకోవడం, అసంతృప్తి, కోపస్వభావము, అనునిత్యం అనుమానించడం, ఇతరుల సంపదపై ఆధారపడి జీవించడం, అనే ఆరు గుణాలున్నవారు ఎప్పుడూ సుఖంగా జీవితం గడపలేరు. ఈర్ష్యా ళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పర భాగ్యోపజీవి, అనేవాళ్ళు ఆరుగురు దు:ఖభాగులు అని చిన్నయసూరి తెలు గులో చెప్పాడు. సుఖము, సంతోషం లేకుండా, ఎప్పుడూ బాధతో, అసంతృప్తి తో జీవించేవారే దు:ఖ భాగులు. వీళ్ళకు తమ దగ్గర ఉన్నది ఏదీ రుచించదు. తృప్తిని, సంతోషాన్ని కలిగించదు. ఏడుపుగొట్టు జీవితాలను గడుపుతుంటా రు. వారి జీవితాలు నిస్సారంగా ఉండటానికి గల కారణాలు చూద్దాము. మొద టిది ‘ఈర్ష్య’. అంటే అసూయ. ఇతరుల ఎదుగుదలను చూచి ఓర్వలేక పోవ డం ఈర్ష్య అనిపించుకొంటుంది. ప్రతి వ్యక్తిలో ఈ గుణం ఎంతోకొంత ఉం టుంది. అయితే ఈర్ష్యాగుణం హద్దుమీరితే ఈర్ష్యాళువూ సుఖంగా ఉండలేడు. ప్రక్కవారికీ ప్రశాంతతను పంచలేడు. తన కొడుకుకు కాక, తన సవతి కుమా రునికి రాజ్యం లభించబోతున్నదన్న ఈర్ష్యతో రగిలి పోయిన ఫలితంగా కైకే యి తన భర్తను కోల్పోయి, కొడుకుతో ద్వేషింపబడి, జీవిత మంతా దు:ఖిస్తూ ఉండాల్సి వచ్చింది. ఆమె తోటివారూ కష్టాలు పడాల్సి వచ్చింది. అలాగే, రాజ సూయయాగం సందర్భంగా పాండవుల కీర్తి, వైభవాలను చూచిన దుర్యోధ నుడు ఈర్ష్యతో కుమిలిపోయిన ఫలితంగా వంశక్షయం, జనక్షయాలకు కార కుడై అపకీర్తిని మూటకట్టుకోవాల్సి వచ్చింది. కనుకనే ఈర్ష్య దు:ఖ హతువు.
రెండవది ‘జుగుప్స.’ అంటే అసహ్యం. జుగుప్సావంతుడు అంటే తన వేషం, మాటతీరు, ప్రవర్తనలతో ప్రక్కవారికి అసహ్యం కలిగించేవాడు. ఇలాం టి మనుషుల తీరును ఎవరూ హర్షించరు, సరికదా అలాంటివారిలో ఏదైనా ఒక గొప్పదనం ఉన్నా, తమ జుగుప్సాకరమైన వేషభాషల ద్వారా, తమ రూపం, ప్రవర్తనల వలన గుర్తింపు పొందలేరు.
”తలమాసిన, నొలుమాసిన వలువలు మాసినను, ప్రాణ వల్లభునైనన్‌
కులకాంతలైనను రోతురు తిలకింపగ భూమిలోన తిరముగ సుమతీ”
తల కానీ, శరీరంగానీ, ధరించిన వస్త్రాలు కానీ సంస్కారహనంగా, అంటే, జుగుప్సాకరంగా ఉన్నవాడిని, అతడు ఎంతటి దగ్గరవాడైనా, గొప్పవాడైనా, అతని భార్య కూడా అతనిని అసహ్యంచుకొంటుంది అంటుంది సుమతీ శత కం. ఇలా అందరితో అసహ్యంచుకోబడేవానికి ఆనందం ఎక్కడ లభిస్తుంది? కనుక అతడు దు:ఖభాగుడే కదా! ఈ జుగుప్సావంతులలో మరొక రకం వారు న్నారు. వారికి తమ తోటివారిలో, తమ చుట్టూ ఉన్న పరిసరాలలో, ఇతరుల ప్రవర్తనలో, అంతా అసహ్యమే కన్పిస్తుంది. అతి శుభ్రతను పాటిస్తూ అన్నిం టినీ అసహ్యంచుకొంటూ, నిత్యం దు:ఖపడుతూ, దు:ఖభాగుడై ఉంటాడు.
మూడవ రకం వాడు ‘నిస్సంతోషి.’ లభించినదానితో తృప్తి పడక, ఎప్పు డూ అసంతృప్తితో బాధపడుతూ, కుమిలిపోతూ ఉండేవాడే ” నిస్సంతోషి.”
”వ్యాప్తిన్‌ పొందక, వగవక/ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్‌
తృప్తిన్‌ పొందని మనుజుడు/ సప్తద్వీపములనైన చక్కన్‌ బడునే”
లభించిన దానితో తృప్తి చెందని వానికి జీవిత మాధుర్యం దక్కదని పై భాగ వత పద్యం చెబుతుంది. అంతేకాదు. ”సంతుష్టుడీ మూడు జగముల పూ జ్యుండు, సంతోషికెన్నడు జరుగు సుఖము, సంతోషిగాకుంట సంసార హతు వు, సంతసమున ముక్తిసతియు దొరకు, పరితోషహనత ప్రభ చెడిపోవును” అంటూ భాగవతమే ”అతృప్తిరేవ దారిద్య్రం, తృప్తిరేవ మహద్ధనమ్‌” అనే ఆర్ష వాక్యాన్ని పునరుద్ఘాటించింది. ”సాధించిన దానితో సంతృప్తిని చెంది అదే విజ యమనుకొంటే పొరబాటోయీ” అన్న మహాకవి మాట కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి దిశగా చేస్తున్న ప్రయాణంలో ఎక్కడో ఒకచోట తృప్తి పడి ఆగిపోకుండా ముందడుగు వేస్తూ ఇంకా పురోగతిని సాధించాలి.
నాలుగవవాడు ‘క్రోధనుడు’. నిగ్రహంచుకోలేని కోపం కలవాడు క్రోధ నుడు. ‘తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష’ అని గ్రహంచలేక, అందరినీ, అన్నిటినీ, తన కోపంతో దూరం చేసుకొని, ఒంటరిగా కుమిలి పోతా డు ఇతడు. అరిషడ్వర్గాలని పెద్దలు చెప్పిన కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు అంతశ్శత్రువులలో క్రోధం రెండవది. దీని ఫలితంగా ఎ దుటివారిపై దాడి చేయడం, తీవ్రమైన పరుష పదజాలంతో దూషించడం మొదలైన వికృత చేష్టలకులోనవుతాడు. ఫలితంగా దు:ఖమే మిగులుతుంది.
ఐదవవాడు ‘పరభాగ్యోపజీవి’. అంటే, అన్నిటికీ, ఎప్పటికీ,ఇతరులపై ఆధా రపడి జీవించేవాడన్నమాట. ఇతడు పరాన్నజీవి. ఏ పనీ స్వంతంగా చేసుకో లేడు. చేసుకోడు కూడా. కష్టపడి తన పని తాను చేసుకోవడం ఇష్టముండది తనికి. ఇతరులు ముష్టి వేస్తే తప్ప జీవించలేడు. ఇతను ఒక పెద్ద సోమరిపోతు. చిన్నచిన్న వాటికి కూడా ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు, చీదరింపులు ఎదురై, ఏడుస్తూ బాధపడవలసి వస్తుందితనికి.
ఆరవ దు:ఖభాగుడు ‘నిత్యశంకితుడు’. ఇతనికి అన్నీ అనుమానాలే. తినా లన్నా, ఎవరితోనైనా కలవాలన్నా, మాట్లాడాలన్నా ఇతనికి అనుమానమే చివరకు తనను తానే అనుమానించుకొంటూ భయంతో, బాధతో, కుమిలిపో తుంటాడు. జీవితంలో ఎదుగుదలను కోరుకొనేవారు,ఈ ఆరు అవగుణాల నూ అదుపులో పెట్టుకొని, వీలైతే వదులుకొని, ముందుకు సాగితేనే జీవితం అర్థవంతంగా, ఆనందదాయకంగా, సాగుతుంది. అలాంటి మానసిక సమ తుల్య స్థితి పొందటానికి సద్‌ గ్రంథ పఠనం, సత్సంగం, సత్కాలక్షేపం వంటివి తోడ్పడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement