Friday, November 22, 2024

నిరుపమానం… నిర్విశేషం… నిష్కళంకం…రామనామం!

వశిష్ఠ మహర్షిని దశరథ మహారాజు పేరు పెట్టమన్నప్పుడు, వారికి నామకరణం గావించాడు. జో ఆనన్ద సింధు సుఖరాసే సేకరతే త్రైలోక సుపాసీసో సుఖ ధామ రామ షసనామా అఖిలలోక దాయక విశ్రామ. ఆనందానికి సముద్రంలాంటివాడు, సుఖానికి రాసిలాంటివాడు. ఆ సముద్రంలోని ఒక్క బిందువు చేత మూడు లోకాలకూ సుఖా న్ని ఇచ్చేవాడు అయిన ఈ సుఖధాము డికి రాముడని పేరుంది. ఈ శిశువు మూడు లోకాలకు విశ్రాంతి నివ్వగలడు. జ్ఞానులకు ఈయ న ఆనంద సింధు. కర్మల్లో ప్రవృత్తమై వున్నవారికి సుఖరాసి, భక్తులకు వైకుంఠ సుఖరూపధా ముడు ఈ రాముడు.
బంద ఉ నామరామ రఘువరకో హేతు కృపాను భాను హిమకరకో- బిధిహి హరమయ బేదషానసో అగున అనూపమగున నిధ్యాసో అన్నారు తులసీదాసు. కశాను (అగ్ని), భాను (సూర్య), హిమకర (చంద్ర), హేతువై (అవి నిలవడానికి కారణమై), త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి) రూపమై, వేదాలకు ప్రాణమై, నిర్గుణమై, ఉపమానరహితమై (పోల్చడానికి మరొకటి లేనిదై), గుణభాండారమై వున్న రామనామానికి వందనాలు అంటాడు.
ర కారం అగ్నిబీజాక్షరం. దానిలో త్రేతాగ్నులు వున్నాయి. దీనిన మననం చేస్తే శుభాశుభ రూపమైన మనోమలాన్ని పోగొడుతుంది. అకారం సూర్య బీజాక్షరం. ఇది సమస్త జ్ఞానాన్ని ప్రకాశింపజేసి అవింద్యాధకారాన్ని నాశనం చేస్తుంది. మకారం చంద్ర బీజాక్షరం. ఇందులో అమృతం నిండి వుంది. ఇది ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా తొల గించి, శీతలత్వం శాంతిని ఇస్తుంది. ర్శఆ్శమ్స రామ. అందుకే సమ సూర్యాగ్నులను మిం చిన స్వప్రకాశము రామనామమం అన్నారు. ఇంకోవిధంగా చూసినా, రామనామము సూర్యచంద్రాగ్నులకు కారణమనవచ్చు.దశావతారాల్లో మూడు రామావతారాలున్నా యి. ఒకటి పరశురామావతారం. జమదగ్ని వంశంలోనిది. శ్రీరామావతారం సూర్యవంశం లోనిది. బలరామావతారం చంద్రవంశంలోనూ ఆవిర్భవించాయి. కావున ఈవిధంగా చూసినా కూడా రామనామం సూర్యచంద్రాగ్నులకు కారణం అయింది.
రామనామం త్రిమూర్తి స్వరూపం. మూడు మూర్తుల జన్మభూమికి మూల దైవము రామనామము. ర్సరుద్ర, ఆ్సబ్రహ్మ, వ్సివిష్ణు. వేదాలకు ప్రాణం ప్రణవం (ఓంకారం). వేదాలలో నేను ప్రణవాన్ని అని స్వయంగా పరమాత్మే చెబుతాడు. అటువంటి ప్రణవానికి ప్రాణం రామనామం. మూడు గుణముల ప్రకృతి- వికృతికి మూల కందము రామ నామము.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నారంటారు. ఒక్క రామనామం విష్ణు సహస్ర నామాలతో సరిసమానమైనది. నేను సదా రామ, రామ, రామ అంటూ మనోహరమైన రామ నామంలోనే రమిస్తుంటాను. రామ, రామ అని ఇలా ఘోషించడం సంసార ఖిజాలను వేయిం చేస్తుంది. సమస్త సుఖసంపదలనూ ఇస్తుంది. యమదూతలను భయభ్రాంతులను చేస్తుంది. ఆపదామపహర్తారం. ఆపదలను హరించివేస్తుంది.
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్‌
నరోన లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం వింద్యతి.
రామ, రామభద్ర, రామచంద్ర అనే నామాలను స్మరించడం వలన మానవుడూ పాప విముక్తుడవటమేగాకుండా, భోగ మోక్షాలను కూడా పొందుతాడు. జగజ్జిత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్‌ అన్నారు. ఈ జగత్తు మొత్తాన్నీ జయించడానికి ఏకైక మంత్రమైన రామనామంచే సురక్షితమైన జీవితాన్ని మనం గడుపుదాం. హరేరామ, హరేరామ, రామ రామ హరేహరే. అందుకే రామనామం నిరుపమానం, నిర్విశేషం, నిష్కళంకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement