Saturday, November 23, 2024

సుఖనిద్రకు రాత్రీసూక్త పారాయణం

అనంత విశ్వంలో మానవుడు ఒక పరమా ణు సమానుడైనా అతని మనసు మాత్రం బ్రహ్మాండము. కంటికి కనపడని ఒక నిగూ ఢ పదార్థము. దీనికి నిత్యమూ ఆహారమవసరము. ఆహార స్వభావాన్ని బట్టి దాని స్వభావం మారుతూ పనిచేస్తుంది. అంత:కరణ చతుష్టయమునందుగల మనస్సు అహంకారాలలో చంచలమైనది, సంకల్ప వికల్పాలతో అస్థిరంగా నుండునది.
మనో నిగ్రహంతో బుద్ధిని చేరి అహంకారాన్ని దాటి చిత్తమును చేరువాడు ధన్యుడు. నిరంతర చంచలమైన మనసుకు భగవంతు డిచ్చిన వరం మరుపు. ఇది తాత్కాలికమైనా జీవన ప్రయాణంలో సేద తీరుస్తుంది. మరచిపోవటమనేది లేకపోతే జీవి తం నరక ప్రాయమవుతుంది. జాగ్ర దవస్థయందు మనసు నిత్యమూ ప్రయాణిస్తూ అనేక విషయా లను ప్రోగు చేస్తుంది.
అందుకే మనసుకు ఉపశమనమిచ్చేది నిద్ర. నిద్రలో కూడా మనసు పని చేస్తుంది. అయితే అది స్వప్నావస్థలో ఉపశమనమిస్తుంది. అనేక లోకాలలో విహరిస్తుంది. అటువంటి నిద్రను పొం దాలంటే సహజంగా రాత్రి అవసరం. మనిషికి, మనసుకు సహజంగా ఇష్టమైనది వెలుగు. జీవన కార్యకలాపాలకు పగలు సహజ సిద్ధమైనది. మనిషి వెలుగును అన్వేషిస్తాడు. కానీ అదే వెలుగు శాశ్వతంగా ఉంటే తట్టుకోలేక విలవిలలాడతాడు. రాత్రి కోసం తపిస్తాడు. చీకటి భయ మైనా దానిలో సుఖాన్ని వెతుకుతాడు. విశ్రాంతికై రాత్రిని ఆశ్రయించక తప్పదు. మనసుకు కాస్త ఊరట కలిగించడానికి రాత్రిని కాంక్షించక తప్పదు. సహ జంగా రాత్రికి నెచ్చెలి నిద్ర. సమస్త జీవరాశులు నిద్రించేది ఈ రాత్రిలోనే! నిద్రించే మనిషి స్వప్నంలో విహరిస్తాడు. అటువంటి రాత్రీదేవిని తన రక్షణకై ప్రార్థించసాగాడు మానవుడు. రాత్రీ సూక్తం ద్వారా రాత్రి దేవతను స్తుతించాడు. ఋగ్వేదాంతర్గమైన ఈ సూక్తం పారాయణ చేసిన స్వప్నాల నుండి విముక్తి పొంది సుఖనిద్ర పొందుతారని ప్రతీతి. రాత్రీదేవిని స్తుతిస్తూ ఈ సూక్తం ఇలా సాగుతుంది. ”ఓ రాత్రీదేవీ! ప్రసన్నురాలవు కమ్ము. నక్షత్రములే నీ నేత్ర ములుగా సకలమూ వీక్షించుచున్నావు. ఎన్నో మహిమలకు, శ్రేష్టతలకు నీవు విరాజిమానురాలవు. అవినాశి యైన ఓ దేవీ! నీవు అధోముఖివు, ఊర్ద్వ ముఖవు, బహు ముఖముగా వ్యాపించి ఉన్నావు. సకల జీవులకు విశ్రాంతి నిచ్చి తిరిగి శక్తిని అందిస్తున్నావు. జీవన కార్య రంగంలో దూకడానికి తిరిగి ఉషా దేవిని యథాస్థానంలో నుంచు తావు. నీ సోదరి ఉషాదేవి నీకు విశ్రాంతినిచ్చి జగతిని వెలు గు నింపుతుంది. పగలు వెలుగుతో నిండిన ఉషాదేవి తిరిగి రాత్రీదేవిని ఆహ్వానిస్తుంది. రాత్రీదేవి ప్రసన్నమయితే పక్షు లు తమ గూళ్లకు చేరతాయి. మనుషులు తమ గృహాలకు చేరతారు. సకల జీవులు తమ ఆశ్రయాలను చేరతాయి. అవి రాత్రీదేవి అనుగ్రహంతో నిద్రాదేవిని చేరతాయి. మనుషు లు సుఖానుభూతులకై రాత్రీదేవిని కాంక్షిస్తారు. ఆమెను భక్తితో కొలుస్తారు. తిరిగి ఉషాదేవిని ప్రార్థించి గాడాంధకారం నుండి వెలుగులోకి చేర్చమని కోరతారు. వెలు గులు నింపి అజ్ఞానాన్ని రూపుమపమని స్తుతిస్తారు. రాత్రీ సూక్తమనే ఈ గోక్షీరమును సమర్పి స్తున్నాము. దయతో స్వీకరించి రాత్రిని మాకు వరముగానిచ్చి విశ్రాంతిని పొందుటకు రక్షణ కల్పించమని రాత్రీ సూక్తం కొనసాగు తుంది. అనేక సూక్తాలతో నిండియున్న వేదమాత సదాస్మరణీయురాలు.

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement