Wednesday, November 20, 2024

నయన మనోహరం… శ్రీ సీతారాముల కల్యాణం!

పరమానంద స్వరూపుడు… సద్గుణ సంపన్నుడు… ఆదర్శ ప్రాయుడు అయిన శ్రీరాముడు సీతమ్మ తల్లిల కల్యాణం లోక కల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడింది. అందుకే హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ల కల్యాణానికి దక్కని వైభవం, విశిష్టత శ్రీసీతారాముల కల్యాణానికి మాత్రమే దక్కాయని శాస్త్రం చెబుతున్నది.

శ్రీరామచంద్రుడు, జానకీదేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. యజ్ఞ ఫలితం ఆధా రంగా ఆవిర్భవించారు. దశరథ మహా రాజు పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. యజ్ఞం నిర్వ హించేందుకు యాగశాలకై భూమిని తవ్వు తున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి.

భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామ చంద్రుడు. భద్రాద్రిలోని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజా లతో అపసవ్య శస్త్ర ధారణతో, ఊర్ధ్వ కరాలలోని కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, అధ: కరాలతో ఎడమ చేతిలో ధనువు, కుడి చేతిలో అభయ ముద్రలతో కూడి బాణం ధరిం చిన భద్రాద్రి రామునికి, భారత దేశం లోని ఇరవై అయిదు రామ క్షేత్రాలలో ఒక విశిష్టమైన ప్రత్యేకత వుంది. శ్రీ మహావిష్ణు స్వరూపుడుగానూ, త్రేతాయుగ దైవంగానూ పురాణాలు ఘోషిస్తు న్నాయి. శ్రీకృష్ణునికి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి ఉన్న ఆలయములకంటె శ్రీరామునికి ఎక్కువ ఆలయములు భారతావనిలో నిర్మించడమైనది.
మన దేశంలో నూతన సంవత్సరాది తర్వాత ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి. భారతీయ సంస్కృతి లో భగవంతుని సేవలను అనేక రూపాల్లో ఆరాధిస్తూ వైభ వంగా పండుగలను జరుపుకోవడం మన సంప్రదాయం. శ్రీరాముణ్ణి సేవించడం, పూజించడం సర్వ సంపత్తులను ఇస్తుంది. ‘రామ’ శబ్దం మహోన్నతమైనది. రమణీయమైన దీనూ, సకల ప్రజానీకానికి నిత్య జీవితంలో ఆహ్లానందాన్ని, మోక్షాన్ని కలిగించే పవిత్ర నామం. ‘రామ’ అనే పలుకు ఆఖండ దివ్యతారక మంత్రం. శ్రీరామ నామం మహాపార వంతమై మధురమైనది. యుగయుగాల నుండి తపోవి రతులైన మహర్షులకు దర్శనం కలుగజేయుట శ్రీరామావ తార రహస్యములలో ఒకటి. శ్రీరాముని చరిత్ర ఎంత ఉదాత్తమైనదో, ”రామనామము’ అంతటి దివ్యమైనది. శ్రీరాముని నమ్ముకున్నవారికి భయం, పరాభ వం ఉండదని రామాయణం ఉద్భోధిస్తుంది.
మానవుడు తమ వ్యక్తిగత జీవితాన్ని సమాజ సమగ్రాభి వృద్ధికి అనుగుణంగా ఏవిధంగా మలచుకొనవలయునో చాటి చెప్పే ప్రవర్తనా నియమావళియే రామచరితము. శ్రీరాముడు ధర్మము ను ఎరిగినవాడు దానిని అనుష్టించిన వాడు శ్రీరాముడు ధర్మస్వరూపుడే, శ్రీరాముని యొక్క జీవితమంతయు ధర్మ ప్రతిస్థాపనకే వినియో గింపబడినది. తన ధర్మమును తన వారి ధర్మమును జీవులం దరి ధర్మములను కాపాడినవాడు శ్రీరాముడు. వ్యసనేషు మనుష్యాణాం భశం భవతి దు:ఖత: ఉత్సవేఘచ సర్వేషు సీతేన ”పరితుష్యతి” ప్రజలలో ఎవరికైనను ఆపదలు కలి గిన తనకు కలిగినట్లు దు:ఖించేవాడు. ఒకరికి ఆనందం కలి గినచో తండ్రివలె సంతోషించేవాడు. సర్వకాల సర్వదేశ సర్వ ప్రజలు ఆచరించదగిన నీతి, ధర్మము, సత్యము జీవిత విధానము రామాయణంలో నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీరామచరిత ఆదికవి వాల్మీకి మహర్షి హృదయాంతరా ళము నుండి పెల్లుబికి వచ్చిన రసరమ్య కావ్యము. రామా యణము ధర్మసూక్ష్మాలు జీవిత సత్యాలతో నిమిడీకృతమై ఉన్నది. సత్యధర్మములు పాటించుట మానవుల కర్తవ్యమని ధర్మ రహతమైన కామ సేవనము, ధర్మ సహితమైన అర్ధకామ సేవనము మానవత్వముగా ఉంటుందని రామాయణం మన కు సందేశమిస్తుంది.
శ్రీరామావతార తత్వం సకల జనామోదమైనది. ఆచర ణ యోగ్యమైనది. ఎచట భక్తిప్రపత్తులు వెల్లివిరుస్తాయో, ఎచట పవిత్రతతో భగవంతుని నామధ్యానము స్మరించబడు తుందో, ఎచట భక్తుల హృదయాలలో దైవభక్తి నెలకొని ఉం టుందో అచట భగవంతుడు కొలువై ఉంటాడు. అట్టి స్థలమే పుణ్య స్థలం శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం గల క్షేత్రం ‘భద్రాచలం’. భద్రుడు (రాములు) ఆచలుడు (కొండ) రాముడు కొండపై నెలవున్నాడు. కనుక ఈ క్షేత్రం ‘భద్రాచలం’గా ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు తన వన వాస జీవితం ఇచట గడపడమే ఈ క్షేత్రము విశిష్టత.
దశావతారాలలో శ్రీరామావతారమునకున్న విశిష్టత ప్రత్యేకమైనది. వేద వేద్యుడైన శ్రీ మహావిష్ణువు దశరథ కుమారుడై అవతరించగా, వేదాలే రామాయణముగా ఉద్భ వించాయని ప్రతీతి. శ్రీరాముని చరితము మ#హమాన్వితము అమృత తుల్యము,
శ్రీరాముడు సత్యపాలకుడు. ధర్మచ రణం తప్పనివాడు. అతని సద్గుణా లన్నీ మానవులందరూ నిత్యజీవి తంలో అలవర్చుకోవాలన్న సత్య ధర్మాన్ని, మానవ జీవిత లక్ష్యా న్ని, ఆదర్శ జీవితం మానవ లక్ష్య మన్న సత్యాన్ని, ధర్మాన్ని ప్రబో ధించేదే శ్రీరామావతారం. శ్రీరామ కథ యుగాలు మారినా, తరాలు మారినా సూర్యచంద్రులీ భూమ్మీద ఉన్నంతకాలం నిలిచి ఉం టుందని ఆదికవి వాల్మీకి ప్రవచించాడు.
శ్రీరాముని జన్మకుండలిలో ఐదు గ్రహాలు ఉచ్చంలో ఉండటం విశేషమైన విషయం. రవి గ్రహానికి మేషం ఉచ్చరాశి. ఆ రాశిలో జన్మించడం అట్లాగే కర్కాటకంలో బృహస్పతి, తులలో శని, మీనంలో శుక్రుడు, మకరంలో కుజుడు ఉచ్చలో ఉండగా శ్రీరామ జననం జరిగింది. పంచమ గ్రహాలు ఉచ్చలో ఉన్నట్లయితే అతడు సర్వలోకాలకు పరి పాలకుడైన అధినాయకుడు లోకనాయకుడైన శ్రీ మహా విష్ణువు అవుతాడని జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది.
సీతారామ కళ్యాణంలోనే జీవన హితుకం, సకల దోష నివారణం, సర్వసంప దలకు నిలయం, సకల జనలోక సంర క్షణమే శ్రీరామనవమి పరమార్థం. అదిగో భద్రాద్రిలోని రామ చంద్రమూర్తి దివ్యసుందర విగ్రహం భక్తజనులకు అలౌకి కనంద పరవశులను చేస్తుంది. శ్రీరామ నామ సుధారసమును గ్రోలి మన జన్మలను సార్థకం చేసి కొందాం పదండి…
‘రామా’ అని తలచినంతనే ముక్తి నిచ్చే దివ్యధామము. అదిగో…. అల్లది గో… గోదావరి తీరాన… అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత గల భద్రాచల దివ్యక్షేత్రం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచ మి నాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామచంద్రుని పుట్టిన రోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకే సారి జరిపించారు. అదే ఈనా టికీ ఆనవాయితీగా వస్తోంది. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావ ణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది ‘శ్రీరామనవమి’నాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.
శ్రీరామనవమినాడు భద్రాచలంలో జరిగే రామ కళ్యా ణము చూచి తరించాలేకాని వర్ణించతరముకాదు. లక్షలాది భక్తులు నయన మనోహరంగా జరిగే రాములవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరిస్తారు. సకల లోకాల దేవతలకు శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా, నేత్ర పర్వం గా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. భద్రాద్రిలో ఏరోజు కళ్యాణం చేస్తారో అదేరోజు దేశ మంతా సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. రాముడు పుట్టి న రోజు చైత్ర శుద్ధ నవమి రోజు సీతాకళ్యాణం చెయ్యటం మొదటినుంచి ఆచారంగా వస్తున్నది. సాక్షాద్విష్ణు స్వరూపు డైన శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన కారుణ్యం. ఆయన కరుణాసాగరంలో పునీతులమవుదాం. సీతారాముడు అంద రికీ సకల సౌఖ్యాల్ని, మనశ్శాంతినీ ఇవ్వాలని ప్రార్ధిద్దాం!

Advertisement

తాజా వార్తలు

Advertisement