Sunday, November 24, 2024

నవరాత్రితత్త్వము : నవరాత్రులు – కాలపురుషుడు – యజ్ఞ పురుషుడు (ఆడియోతో..)

దేవీ వైభవం
నవరాత్రి రహస్యాలు – తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

నవరాత్రులు – కాలపురుషుడు – యజ్ఞ పురుషుడు

పరమాత్మ ప్రకృతి పురుషుల సమన్వయంతో ప్ర పంచ సృష్టిని జ రుపుతున్నాడన్నది మాత్రమే సామాన్యులకు తెలిసినది. వాస్తవానికి పురుషుడు అంటే పరమాత్మే. ఈ పురుషుడు అనగా పరమాత్మ కాలము, యజ్ఞము అని రెండు విధములుగా ఉండును. ‘సర్వాధార: కాల: ‘ అని వ్యాసోక్తి. కాలపురుషుడు అనాది సర్వవ్యాపకుడు మరియు అన్నింటి పుట్టుక, ఉనికి, నాశములకి కారణమయినవాడు. యజ్ఞపురుషుడు ఆదికలవాడు మరియు పరిచ్ఛిన్నుడుగా కనపడును. పరిమితమైన కొలతలు, బేధాలతో గుర్తింపబడే వ్యాపకుడైన కాలపురుషుని అంశగా కొంత భాగమే పరిచ్ఛిన్నమై అనగా విడివడి యజ్ఞపురుషుని నామంతో వ్యవహరించుబడును. పరమాత్మ కాలపురుషుని నామంతో యజ్ఞపురుషుని సహాయంతో సృష్టికి ప్రవర్తకుడిగా ఉంటూ ప్రపంచమును నిర్వహించుచూ ని ర్మించుచుండును.

ఈ మహాకాలగ ర్భంలో, మహాకాల చక్రంలో అనంత విశ్వం భ్రమించుచున్నది. వేద మంత్రసంహితలలో కాలనామంతో ప్రసిద్ధి చెందిన తత్త్వము ఉపనిషత్‌లలో పరాత్పర నామంతో ప్రసిద్ధి గాంచినది. పరాత్పరుడు అంటే వస్తువు ఏర్పడక ముందు ఉన్న స్థితి, ఆ ఉనికి వస్తువుగా మారుట, మారినది నిలుచుట, నిలిచినది పెరుగుట, పెరుగునది మార్పు చెంది తరిగి నశించునది. ప్రకృతిలో ఏర్పడిన ఈ ఆరు తత్త్వాలు ప్రతీ వస్తువుకు తప్పకుండా ఉండేవి. అమృతతత్త్వాన్ని ‘సత్‌’ అని, మృత్యుతత్త్వాన్ని ‘అసత్‌’ అని అంటారు.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement