Saturday, November 23, 2024

నవరాత్రి రహస్యాలు (ఆడియోతో..)

తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

అనేజదేకం మనసోజవీయ:
నైన ద్దేవా ఆప్నువన్‌ పూర్వమర్ఛత్‌
తద్ధావతో అన్యాన్‌ అత్యేతితిష్టత్‌
తస్మిన్‌ అపోమాతారిస్వా దాధాతి ||

అనగా అది క దలకుండా ఉంటూ మనస్సు కంటే వేగము కలదని దీనిని దేవతలు పొం దలేదని నిలబడి ఉంటూనే పరిగెత్తుతూ ఉన్న ఇతరములను దాటి వెళ్ళును. దాని యందు వాయువు, జలమును ఉంచును.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యత:

- Advertisement -

ఈశావాస్య ఉపనిషత్‌లోని మంత్రార్థము ఏమనగా ఈవిధంగా ఆ పరమపురుషుని పరమాత్మ స్వరూపాన్ని వేదము అందించినది. ఈ మాయా బలము అవ ధి లేనది మరియు అవధి ఉన్నది. అనగా అవధిలేని దానికి అవధిని కలిగించి, అవధిని కలిగిఉన్న దానికి అవధులు తొలగించును. ఈ మాయా బల ప్రభావంతోనే విశ్వాతీతము, విశ్వాంతరము సకల విశ్వచరము విశ్వమే అవుతున్నది. ఈ పరమాత్మ శక్తియే కాలమును, యజ్ఞ రూపమును పరణమింపచేయుచున్నది. ఈ శక్తి మహామాయా, దీని పేరే ప్రకృతి. ‘మాయాంతు ప్రకృతి విద్ధి’ అని శృతి వాక్యం. ఈ ప్రకృతి సమన్వయం తోనే కాల పురుషుడు తనలోని అల్పాల్ప భాగము నుండి తనను తానే నియమిం చుకొనుచూ జీవుని కామనా చక్రంలో బంధించును. ఒక్కొక్క మాయా అంశముతో ఒక్కొక్క విశ్వచక్రము ఏర్పడును. పరమాత్మ యొక్క ఈ మాయాబలము అనంతము. కాబట్టే ఈ మాయాబలముతో అనంత విశ్వ చక్రములు ఏర్పడుచున్నవి. అనంత విశ్వాధిష్టాత అయిన ఆ కాలపురుషుడు నియతి అనే ఖడ్గాన్ని ధరించి అందరినీ అన్నింటినీ శాసించుచుండును. పద్నాలుగు లోకాలు, అనంతకోటి బ్రహ్మాండాలు 84 కోట్ల భూతసృష్టులు అన్నీ ఈ మాయ నుండే ఆవిర్భవిస్తున్నాయి.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement