బౌద్ధమతాన్ని ఆచరించే వారికి ప్రత్యేకమైన పం డుగ ఇది. కొలంబోలో గంగారామయలో ప్రతి సం వత్సరం ఆగస్టు నెలలో ఈ ఉత్సవాన్ని జరుపుకునే వారు. గంగారామయలో ఎసల (ఆగస్టు) నెలలో బుద్ధుని మొదటి ఉపన్యాసానికి గుర్తుగా కొలంబో ఎసల మహా పెరహెరా అనే పేరుతో అసలు పెరహెరా జరిగేది. తర్వాత అనేక సమస్యలు తలెత్తడంతో పెర హెరా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కొంత కాలం తరువాత ఇటువంటి సామూహిక ఉత్సవాలు నిర్వహిస్తే అందరు శాంతిస్తారని భావించారు. ఉద్రిక్త పరిస్థితుల నుంచి కొలంబోను కాపాడవచ్చునని భావించి గంగారామయలో 1970లో నవం పెరహెరా పేరుతో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎనిమిది సంవత్సరాలకు 1979లో అప్పటి ఎంపి ఆర్.ప్రే మదాసు సహాయ సహకారాలతో మొదటి పెరహెరా ఫిబ్రవరి నెలలో ప్రారంభమైంది. ఆ ఉత్సవం కొద్దిమంది సాం ప్రదాయ కళాకారులతో జరిగింది. ఆ తర్వాత సంవత్సరాలలో క్రమంగా ప్రజాదరణ పొందింది. నేడు లక్షలాదిమంది స్థానికులు, విదేశీ సందర్శ కులతో కొలంబోలో ముఖ్యమైన సాంస్కృతి ప్రదర్శనగా మారింది. అశాం తి, సంఘర్షణలతో కూడిన నగరానికి చాలా మేలు చేసిందని భావిస్తారు.
మాఘ మాసం పౌర్ణమి రోజు నిండు చందమామ బైరా సరస్సులో ప్రతిబింబిస్తూ వెండిపూల కురిపించే వేళ ఈ ఉత్సవం మొదలవుతుంది. రెండురోజులపాటు జరిగే ఈ ఉత్సవాని కిగాను కొలంబో నడిబొడ్డున వున్న గంగారామయ బౌద్ధ ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, వివిధ రం గుల పూలతో అత్యంత సుందరకంగా అలంకరిస్తారు. ఈ పెరహెరా విభిన్నమైనవి. ఇది ప్రధానంగా ట్రిపుల్ జెమ్ పూజలో ఉంది. పౌర్ణమిరోజు బుద్ధుని ఇద్దరు ముఖ్య శిష్యుల నియామకం, మొదటి బౌద్ధ మండలి నియామ కాన్ని స్మరించుకుంటారు. వెలికిరాని ప్రతిభావంతులై న కళాకారులను ప్రోత్సహించడానికి, కళలను సజీవం గా ఉంచడానికి ఈ ఉత్సవం ప్రసిద్ధి చెందింది.
గంగారామయ దేవాలయంలో జరిగే ప్రధాన సాంస్కృతిక వేడుకలలో పాల్గొనడానికి శ్రీలంలోని ఇతర ప్రదేశాల నుండి వందలాది ఏనుగులను ఇక్క డకు తీసుకువస్తారు. వాటిని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. అవి ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకా కుండా శేష పేటికను మోసుకెళ్ళే గ్రాండ్ ఏనుగు రాక పెరెహరాలో ఒక ప్రతీకాత్మక దృశ్యంగా భావిస్తారు. నవమ్ పెరహెరా సంస్కృతీ సంప్రదా యాలను కాపాడడమేకాకుండా కొలంబోలో నివసించే అనేక విభిన్న సమూహాలను ఒకచోట చేర్చింది. అంతేకాదు సాంప్రదాయ కళాకారుల కు, వారి కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తుంది.
బౌద్ధుల ప్రత్యేక పండుగ నవం మహా పెరహెరా
Advertisement
తాజా వార్తలు
Advertisement