Saturday, January 18, 2025

నవగ్రహ ప్రార్ధనా శ్లోకములు

(నిత్యపారాయణకు అత్యంతోపయోగము)
గ్రహములు గోచార వశమున గాని దశాంతర్దశా రీతినిగాని చెడు స్థానములో ఉన్నట్లయితే ఆయా గ్రహములను పూజించాలి. అలా పూజించడం వలన గ్రహారిష్టములు తొలగిపోవును.
పట్టునవి, పీడించునవి అని గ్రహ శబ్దమునకు అర్థము. పూర్వజన్మలోను వర్తమానమునందును చేయు పాపము వ్యాధి రూపమునను, చిక్కుల మూలముగాను బాధించును. ఇందుకు ఔషధము, దానము, జపము మొదలయినవి జరిపించుటయే అని ఆర్యుల మతము.
శ్లో|| ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:||

1. రవి – జపాకుసుమ సంకాశం | కాశ్యసేయం మహాద్యుతిమ్‌
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతో స్మి దివాకరమ్‌|| 6 వేలు

2. చంద్ర – దధి శంఖ తుషారాభం | క్షీరార్ణవ సముద్భవమ్‌
నమామి శశివం సోమం | శంభో ర్మకుట భూషణమ్‌ || 10 వేలు

3. కుజ – ధరణీగర్భ సంభూతం | విద్యత్కాంతి సమప్రభమ్‌
కుమారం శక్తి హస్తం తం | మంగళం ప్రణమామ్యహమ్‌ || 7 వేలు

4. బుధ – ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధమ్‌
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహమ్‌ || 17 వేలు

- Advertisement -

5. గురు – దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభమ్‌
బుద్దిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిమ్‌ || 16 వేలు

6. శుక్ర – హిమకుందమృణాళాభం | దైత్యానాం పరమం గురుమ్‌
సర్వశాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహమ్‌ || 20 వేలు

7. శని – నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజమ్‌
ఛాయామార్తాండసంభూతం | తం నమామి శనైశ్చరమ్‌ || 19 వేలు

8. రాహు – అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనమ్‌
సింహికాగర్భసంభూతం | తం రాహుం ప్రణమామ్యహమ్‌ || 18 వేలు

9. కేతు – పలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహమస్తకమ్‌
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహమ్‌ || 7 వేలు

Advertisement

తాజా వార్తలు

Advertisement