Friday, November 22, 2024

నవ నారసింహ క్షేత్రం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 22 కి.మీ, నంద్యాల నుండి 60 కి.మీ దూరంలో వుంది అహోబిలం లక్ష్మీనారసింహ క్షేత్రం. భూమిపై వున్న నాలుగు నరసింహ క్షేత్రా లలో అహోబిలంఒకటి. స్వామి తొమ్మిదిమంది నరసింహులుగా అవతరించిన దివ్యక్షేత్రం.

  1. జ్వాలానరసింహుడు. ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్య కశిపుని పొట్ట చీలుస్తున్నట్టు ఉంటాడు.
  2. అహోబిల నరసింహ స్వరూపము. హిరణ్య కశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.
  3. మాలోల నరసింహుడు. లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకున్న స్వరూపము.
  4. కరంజ నరసింహుడు. చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.
  5. పావన నరసింహుడు.ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే పాపాల్ని తొలగించి, మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అని పిలుస్తారు.
  6. యోగ నరసింహుడు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టము కట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.
  7. చత్రవట నరసింహస్వరుపము. పెద్ద రావి చెట్టుకింద వీరాసన ము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి ఇద్దరు గంధర్వులు శాపవిమోచనం కొరకు నరసింహ స్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆకూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహ స్వరూపము అంటారు.
  8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనం కోరుకుంటే అనుగ్రహించి దర్శనం ఇచ్చిన రూపము.
  9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహ స్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము రెండు ఉంటాయి.
  • దైతా నాగ పద్మలత
Advertisement

తాజా వార్తలు

Advertisement