యాదగిరిగుట్ట, ప్రభన్యూస్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇదే నెల 28న ప్రధానాలయం పున : ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి బాలాలయంలో అంతరంగికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 12వ తేదీన దివ్య విమాన రథోత్సవం సందర్భంగా బాలాలయంలో రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీనరసిం హస్వామి వారు తొలి సారిగా స్వర్ణరథంపై ఊరేగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ లోగిల్లు, ల్యాండ్‌మార్క్ రియల్ సంస్థలు సంయుక్తంగా ఈ స్వర్ణరథాన్ని ఆలయానికి బహుకరిం చనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. ఈ రథానికి సంబంధించిన విడి భాగాలకు బుధవారం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఆరవ రోజు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించారు. వేద మంత్రాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి మేళాలు మారుమ్రోగుతుండగా.. పారాయాణికులు పారాయాణాలను పఠిస్తుండగా బాలాలయంలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. శ్రీ స్వామి వారి అలంకార సేవను భక్తుల దర్శించి తరించారు. రాత్రి 9 గంటలకు సింహ వాహన సేవ పై శ్రీ స్వామి వారు ఊరేగారు.
గోవర్ధన గిరిధారిగా నృసింహుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement