హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాదాద్రిలో కొలువైన శ్రీలక్ష్మీనృసింహుని దివ్యమంగళ స్వరూపాన్ని ఆరేళ్ల తర్వాత మళ్లిd కనులారా చూసే శుభతరుణం ఆసన్నమైంది. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు సత్సంకల్పంతో, దృడదీక్షతో యాదగిరిగుట్ట ఆలయం పునరుద్ధరణ పనులు పూర్తికాగా కొత్తరూపుతో తొణికిసలాడుతోంది. అంతెత్తు గోపురాలు.. నల్లనిశిలతో నయనానందకరంగా ఉన్న ఆలయంలో స్వామి వారి అసలు రూపును వీక్షించే శుభఘడియ వచ్చేసింది. స్వయంభువుగా వెలసిన లక్ష్మీనృసింహుడి మూలవిరాట్టును పునరుద్ధరణ పనుల కారణంగా ఇన్నాళ్లూ దర్శించే వీలులే కపోయింది. పనులన్నీ పూర్తవడంతో ఆలయాన్ని పున:ప్రారం భించడంతోపాటు సోమవారం సాయంత్రం నుంచి స్వామిని భక్తులందరూ దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవం, పూర్ణాహుతి, మూలవిరాట్టుకు తొలి పూజలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న మహాకుంభ ప్రోక్షణ క్రతువులో అసలు ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. సోమవారం ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నాన పుష్కరాంశ దివ్య శుభముహూర్తంలో ఆలయ మహాకుంభ సంప్రోక్షణ పూర్తికానుంది. గర్భాలయంలోని మూల విరాట్టుకు ఈ ముహూర్తంలోనే సీఎం కేసీఆర్ మొదటి పూజను నిర్వ హిస్తారు. సోమవారం ఉదయం 11.55 గంటలకు యాదాద్రి ఉద్ఘాటనతో సీఎం కేసీఆర్ ఆలయాన్ని ప్రారంభి స్తారు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్ర మంలోను, పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు మంత్రులు పాల్గొంటారు.
బాలాలయం నుంచి శోభాయాత్ర
కొండ దిగువన ఉన్న బాలా లయంలో ఇన్నాళ్లూ స్వామివారి ఉత్సవ మూర్తు లకు పూజాదికాలు నిర్వహించా రు. ఇప్పుడు ప్రధానాలయానికి ఆ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తోడ్కొని గర్భాలయంలో ప్రతిష్టించను న్నారు. ఈ శోభాయాత్ర ప్రధాన ఆలయం చుట్టూ మూడుసార్లు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులు పాల్గొననున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి ఇప్పటికే యాదాద్రిలో అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. సీఎం కేసీఆర్ కూడా ఈ సందర్భంగా మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించారు. ఉదయం 9గంటలకు పూర్ణాహుతిని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాలాలయం నుంచి మూలవిరాట్టును శోభాయాత్రగా ప్రధానాలయం వరకు ఊరేగింపుగా తీసికెళ్తారు. ప్రధాన గర్భగుడిలో స్వామివారికి ఆరాధన, వైదిక కార్యక్రమాలు, మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.10గంటలకు ప్రధానాలయం ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ దర్శనం, ఆ తర్వాత 12.20నుంచి 12.30 వరకు స్వామివారి గర్భాలయ దర్శనం, 12.30నుంచి 12.50వరకు మహదాశీర్వచనం, మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు మధ్యాహ్నం భోజన విరామం, ఆ తర్వాత సాయంత్రం 4గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
సోమవారం ప్రధానాలయం దివ్యవిమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుడతారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైనా స్వర్ణకలశాలకు మహాకుంభ సంప్రోక్షణను ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు. సాప్తాహ్నక దీక్షతో వారం నుంచి బాలాలయంలో కొనసా గించిన పంచకుండాత్మక మహా యాగంలో పూజించిన నదీ జలాలను మహాకుంభంలోకి చేర్చి ఆ పుణ్యజలాలతో పాటు శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠా మూర్తులతో శోభాయాత్ర చేపడతారు. పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఇందులో సీఎంతో పాటు మంత్రులు పాల్గొంటారు. విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాన్ని కొనసాగిస్తారు. అనంతరం ప్రధానాలయంలోకి వేద, మంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాలలో ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణాన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపడతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు తెరతీస్తారు. కొండ మీద విష్ణు పుష్కరిణిని శనివారం నీటితో నింపారు.
గర్భాలయంలో ఇక నిత్య కైంకర్యాలు
బాలాలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులు గర్భాలయంలోకి తీసుకువచ్చిన తరువాత మధ్యాహ్న అర్చన, నివేదన కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రధాన అర్చకులు మోహనాచార్యలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత సామాన్య భక్తులకు స్వామివారి మూల విరాట్టును దర్శించుకునే అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. భక్తులు యాగశాలలో వాహనాలు పార్కింగ్ చేసి, దేవాలయం తరుపున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
నవెూ.. నారసింహ!
Advertisement
తాజా వార్తలు
Advertisement