అత్యంత రమణీయమైన గంధమాదన పర్వత వనాలలో పాండవుల వనవాసం పది సంవత్స రాలు గడచిపోయాయి. తమకు నివాసాన్ని కలి గించి సహకరించినందుకు కుబేరునికి కృతజ్ఞతలు తెలియ చేసి, మిగిలిన మునులు, యక్ష, కిన్నెర, కింపురుషులకు ధన్యవాదాలు చెప్పి తన తమ్ములతో పరివార సహితంగా వృషపర్వుని ఆశ్రమానికి చేరుకున్నారు. పరమ పవిత్రమై న ఆ ఆశ్రమంలో ఒక రాత్రి గడిపారు. ఆ దుర్గమ ప్రయా ణంలో ఘటోత్కచుడు వారిని అవలీలగా నదులు, పర్వ తాలు దాటిస్తూ వచ్చాడు. అక్కడి నుండి బదరికాశ్రమ తీర్థం నుండి విశాల నగరానికి వచ్చి ఒక నెల రోజులు నర నారాయణ క్షేత్రంలో ఉన్నారు. అటునుండి చీనతుషార, వరద, కులింద దేశాలను దాటి హిమాలయాల సానువుల పైగా ప్రయాణించి సుబాహుని నగరాన్ని చేరారు. వీరికి సుబాహుడు స్వాగత సత్కారాలు చేసాడు. అతని సహా యంతో యమునా నది జన్మస్థాన కొండ మీదికి చేరుకొ న్నారు. ఆ పర్వతం మీద విశాల యూపమనే సుందరవ నంలో ఒక సంవత్సరం నివసించారు.
ఆ సమయంలో భీముడు సమీప ప్రదేశాలను పరిశీలి స్తూ ఒక పెద్ద కొండచిలువ నివసిస్తున్న గుహలో ప్రవేశించాడు. ఆ మహా సర్పము భీముని చుట్టి బంధించివేసింది. పదివేల ఏనుగుల బలమున్న అతని భుజాలు ఆ పట్టు నుండి విడిపించుకోలేకపోయాయి. అదే సమయంలో ధర్మరాజుకు అనేక అపశకునాలు గోచరించాయి. ఎంత సేపటికి భీముని జాడ తెలియక కంగారుపడిన ధర్మరాజు ధౌమ్యు నితో కలసి ఆ దుర్గమ అరణ్య ప్రాంతంలో వెతకసాగారు. చివరకు భీముడు బందీగా ఉన్న గుహను చేరుకొన్నారు. మహాబలవంతుడు భీముణ్ణి పట్టుకున్న ఈ కొండచిలువ సామాన్యమైనది కాదని గ్రహించిన ధర్మరాజు ”ఓ మహా భుజంగమా ఏమి చేస్తే నీవు నా తమ్ముని విడిచిపెడతావు?” అని సూటిగా ప్రశ్నించాడు.
”రాజా నేను నీ పూర్వీకులైన చంద్రవంశరాజు నహుషుడను. చంద్రుని నుండి ఐదవతరం వాడైన ఆయువు కుమారుడను. యయాతికి తండ్రిని. అనేక యజ్ఞాలు చేసి సమస్త వేదాలను అధ్యయనం చేసాను. ఇంద్రియాలను జయించాను. నా పరాక్రమం, సత్కర్మల వలన ముల్లోక సహితమైన అపార సంపద లభించింది. తరువాత నాకు గర్వం పెరిగింది. ఆ సమయంలో త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞం నుండి ఆవిర్భవించిన వృతాసురుణ్ణి సంహరించిన ఇంద్రుడు బ్రహ్మహత్యా దోష ఫలితంగా పదవికి దూర మయ్యాడు. అప్పుడు నాకు ఇంద్ర పదవి లభించింది. గర్వంతో నాకు అరిషడ్వర్గ ప్రభావం కూడా పెరిగింది. ఇంద్రాణి శచీదేవినే నా దర్శనానికి రమ్మని ఆజ్ఞాపించాను. గర్వాంధుడైన నన్ను మహాఋషులు మోస్తున్న పల్లకి మీద రమ్మని కోరింది ఇంద్రాణి. నాకు భయపడి మోసారో, నా మదం అణచడానికి మోసారో పల్లకీ మోసారు బుషులు. త్వరగా నడవమని అగస్త్య మహామునికి నా బొటనవేలితో ముందుకు గెంటాను. అంతే! ఈ మహా అజగర రూపంతో ఇక్కడ పడ్డాను. ఆయన శాపాన్ని అనుసరించి పగలు ఆరవ భాగంలో నాకు లభించిన ఆహారాన్ని తినాలి. నాకు భీముడు లభించాడు. విడిచి పెట్టను అయితే నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి నా అజ్ఞానాన్ని తొలగిస్తే విడిచిపెడతాను” అని ప్రశ్నలు వేయసాగాడు కొండచిలువ రూపంలోనున్న నహుషుడు.
బ్రహ్మణ: కోభవేద్ రాజ వేద్యం కించ యుధిష్ఠిర|
బ్రవీహ్యతిమతిం త్వాంహి వాక్యైరనువినోమితే||
బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు? అతడు తెలుసుకొనదగిన తత్త్వమేది? బుద్ధిమంతు డిగా గోచరిస్తున్న నీవు సమాధానం చెప్పమని ప్రశ్నించాడు.
అంత ధర్మరాజు ”ఓ మహానుభావా! ఎవరిలో సత్యం, దానం, క్షమ, సౌశీల్యం, అక్రూరత్వం, తపస్సు, దయ ఈ సద్గుణాలు ఉంటాయో వారే బ్రహ్మజ్ఞానులు.
సుఖదు:ఖాలకు అతీతమై దేనిని సాధిస్తే లేదా తెలుసుకుంటే శోకానికి దూరమ వుతాడో ఆ పరబ్రహ్మమే తెలుసుకోదగిన మహాతత్త్వం” అని చెపుతూ ఇంకా అడిగిన ప్రశ్న లకు సమాధానాలు ఇలా ఇవ్వసాగాడు ధర్మరాజు.
ఇంకా కొండచిలువ ఇలా అడిగింది. ”ధర్మరాజా శోకరహితము, నిత్యానందము, మోక్షప్రదమైనది అయిన బ్రహ్మ, సత్యము ఇవి చాతుర్వర్ణముల వారికి శ్రేయోదాయ కమైనవి కదా! పైన చెప్పిన బ్రహ్మజ్ఞాన లక్షణాలు వారిలో కొందరికి పూర్వ సంస్కారము వలన, సాధన వలన లభించి ఉండును. కావున వారు కూడా బ్రహ్మజ్ఞానులని పిలవబడ తారా? అలాగే బ్రహ్మజ్ఞానుల సంతానమును అందరినీ వారితో సమానులుగా భావించ వచ్చా?” అని ప్రశ్నించింది.
దానికి ధర్మరాజు దానం, అక్రోధం, అక్రూరత్వం, అహింస, దయ మొదలైన సద్గు ణాలు, జ్ఞానం చాతుర్వర్ణములలో ఎవరియందు ఉంటాయో వారందరూ బ్రహ్మజ్ఞా నులే! మోక్షానికి అర్హులే! అలాగే బ్రహ్మజ్ఞానుల సంతానంగా జన్మించినా వేదాధ్యయా న్ని విడిచిపెట్టి, అరిషడ్వర్గాలకు లొంగి అనాచారుడైతే వారిని బ్రహ్మ జ్ఞానిగా పరిగణిం చరు. తత్త్వదర్శులు ఎవరైతే సత్యం, శీలం, సదాచారానికి బాధ్యత వహించి జ్ఞానాన్ని పొంది అందరికీ పంచి పెడతారో వారిని బ్రహ్మజ్ఞానులన్నారు. ధర్మరాజు ఇచ్చిన సమా ధానాలకు సంతృప్తిపడిన కొండచిలువ రూపంలోనున్న నహుషుడు భీమసేనుణ్ణి విడిచి పెట్టాడు. సంతోషంతో కృతజ్ఞతలు తెల్పిన యుధిష్ఠిరుడు అజగర రూపంలోనున్న సహుషుని జ్ఞానవంతమైన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలను పొందాడు ధర్మరాజు. మనుజునకు కర్మల ఫలము లభిస్తుందా? స్వర్గప్రాప్తి ఉందా? లభిస్తుందా? దేహాభి మానములేని వారి గతి ఏమిటి? అని ప్రశ్నించాడు.
తిస్రోవై గతయో రాజ పరిదృష్టా: స్వకర్మభి:|
మానుషం స్వర్గవాసశ్చ తిర్యగ్యోనొశ్చతత్‌త్రిధా||
కర్మలు చేయక తప్పదు. వారివారి కర్మలననుసరించి జీవులకు మూడు విధ ములైన గతులు లేక జన్మలు కలుగుచున్నవి. స్వర్గలోకప్రాప్తి, మనుష్య యోనియందు జన్మ, అధోయోనులైన పశుపక్ష్యాదులుగా జన్మ, ఇది ఒక రకముగా నరకమే!
మానవజన్మ దుర్లభం. సుకృతం వల్ల అది లభిస్తుంది. కావున మానవుడు సద్గు ణాలతో శుభకర్మలు ఆచరించుచూ జ్ఞానాన్ని కలిగి ఉంటాడో వారికి స్వర్గస్థితి కలుగుతుం ది. అట్లుకాక, కామక్రోధ సమాయుక్తో హింసాలోభ సమన్విత:|
మనుష్యత్వాత్ పరిభ్రష్టస్తిర్యగ్యోనౌ ప్రసూయతే||
కామ, లోభ, హింసలయందు నిమగ్నుడై మానవత్వము నుండి భ్రష్టుడగువాడు మనుష్య జన్మనుండి తిరిగి నరక ప్రాయమైన అధోయోనులలో జన్మించి దుర్గతిని అను భవిస్తాడని తెలిపి నీ వలన నాకు శాపవిమోచనమయిందని కొండచిలువ రూపము నుండి దివ్యదేహాన్ని పొంది స్వర్గానికి పయనమయ్యాడు నహుషుడు.
నహుషుని శాప వివెూచనం!
Advertisement
తాజా వార్తలు
Advertisement