Sunday, November 24, 2024

నాగదేవతారాధన

మన సంస్కృతిలో నాగదేవతారాధనకు విశిష్ట స్థానం ఉంది. సృష్టిలోని సకల జీవ రాసులలో పరమాత్మను దర్శిస్తూ, ఏ ప్రాణినీ బాధించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతూనే ఉంటుందని విశ్వసించే ధర్మం మన ది. ఇలాంటి సందేశంతోనే సర్ప పూజ ఆచరణలోకి వచ్చిందంటారు. నాగదేవతను ఆరా ధించే సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా పలుప్రాంతాలలో ఉంది. నాగదేవతారాధన చేయ డానికి కారణం ఏదైనా, ఆచరించే విధానాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని వేద మంత్రా ల్లో సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు లేనప్పటినుం డి కూడా సర్పారాధన ఉన్నట్లు తెలుస్తుంది. ప్రకృతితోబాటు నాగారాధన చేయడం అనా దిగా వస్తున్న ఆచారం. తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చవితి, పం చమి నాడు, మరికొన్ని ప్రాంతాలలో కార్తీక శుద్ధ చవితి, పంచమి నాడు నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకొంటారు.
నాగుల చవితినాడు సర్పాలను, పంచమి నాడు గరుత్మంతుని పూజించి వ్రతాలు చేస్తారు. పురాణాలలో వీటి గురించి అనేక కథలున్నాయి. గ్రీష్మ ఋతువులో పాములు బయట సంచరించవు. వర్ష, శరదృతువులలో పాములు స్పందించి బయట సంచరిస్తా యి. శ్రావణమాసంలో బయట ఎక్కువ సంచరిస్తాయి. కనుక అప్పుడు నాగపూజ ప్రా ధాన్యత సంతరించుకొంటుంది.
నాగారాధనతో కళ్ళు, చెవులు, చర్మ సంబంధిత వ్యాధులు పోతాయనీ, సంతానం కలుగుతుందని ఒక నమ్మకముంది. కొన్ని వ్యాధుల నిర్మూలనలో పాము విషం తగు మోతాదులో మందులలో కలిపి వాడతారు. అందుకే దేశం, ప్రాంతం అనికాకుండా, అన్నిచోట్లా చాలామంది సర్పారాధన చేస్తారు.
ఆది శేషుడు (అనంతుడు), వాసుకి తక్షకుడు, శంఖపాలుడు, గుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు, ఐరావతుడు, ధనుంజయుడు, ధార్తరాష్ట్రుడు సర్పజాతి కి మూల పురుషులని, మహానాగరాజులని పురాణాలలో చెప్పబడింది.
#హందూ ధర్మంలో నాగులు, సర్పాలు అని రెండు రకాలున్నాయి. భగవద్గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడిలా అన్నాడు-
”ఆయుధానామ#హం వజ్రం ధేనూనామస్మి కామధుక్‌
ప్రజనశ్చా స్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి:”
నేను ఆయుధాలలో వజ్రాన్ని, గోవుల్లో కామధేనువును, సృష్టించే వాళ్ళలో మన్మ థుడిని, సర్పాలలో వాసుకిని అని అర్థం. వాసుకి శివుని ఆశ్రయించి, ఆయనకు అలంకా రంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడుగా చేసుకొని క్షీరసాగర మథనం జరిగింది.
”అనన్తశ్చాస్మి నాగానాం, వరుణోయాద సామహమ్‌
పిత్రణామర్యమాచాస్మి యమ: సంయ మతామహమ్‌”
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడుని, పితృలలో ఆర్యముడి ని, సంయమవంతులలో నిగ్రహాన్ని అని కూడా అన్నాడు శ్రీకృష్ణుడు. నాగులలో అనం తుడిని అని ఆయన అభిప్రాయం. అనంతుడే ఆదిశేషుడు. ఈయన కద్రువకు పెద్ద కొడు కు. రెండవ వాడైన వాసుకికి అన్న. కద్రువ తమ పినతల్లి వినతకు చేసిన అన్యాయానికి చింతించి, అనంతుడు శ్రీ మహావిష్ణువును గురించి తపస్సు చేసి, ఆయన తన దేహంపై విశ్రాంతి తీసుకొనేలా వరం పొందుతాడు. అనంతుని అపార బలాన్ని గుర్తించిన బ్ర#హ్మ అతనిని భూభారాన్ని మోయమని చెబుతాడు. ఈ అనంతుడే ఆదిశేషునిగా అదృశ్య రూపంలో భూమిని మోస్తుంటాడని నమ్ముతారు. అనంతుడు వివిధ అవతారాల సమ యంలో శ్రీ విష్ణువును అనుసరించాడు. రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారం లో బలరామునిగా, వేంకటేశ్వరావతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గం బోధించ డానికి శ్రీ రామానుజాచార్యులుగా అవతరించాడని పురాణోక్తి. మన పురాణాలలో ప్రధా నంగా 12మంది నాగరాజులు కనిపిస్తారు. అనంత, వాసుకి, పద్మనాభ, శేష, కంబల, కర్కోటక, ధృతరాష్ట్ర, అశ్వతర, కాళీయ, శంఖపాల, పింగళ, తక్షకులనేవి వారి పేర్లు.
పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదరులే అయినా వారి మధ్య కొంత తేడా ఉందంటారు పెద్దలు. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకొన్నప్పుడు మాన వ రూపంలోనూ, ఇతర రూపాలలోనూ కనపడగలవు. సర్పాలు భూమిపైనే ప్రాకుతుం టాయి. వీటికి కామరూపధారణ శక్తికానీ, ప్రత్యేక లోకము కానీ లేవు. ఇవి జీవరాశులను భుజిస్తుంటాయి. నాగులకు విశిష్ట లోకం ఉంది. ఇవి వాయువును ఆహారంగా తీసుకొం టాయి. అంటే గాలిని పీల్చి బ్రతుకుతాయన్నమాట. సర్పాలలో దేవతా సర్పాలుంటా యట. అవి సాధారణంగా మనకు కనపడవు. అయితే దేవతా సర్పాలు తిరుగాడేచోట మొగలి, లేక మల్లెపూల వాసన, కాలంకాని కాలంలో కూడా వెదజల్లబడుతూంటుంది. భక్తుల భక్తికి మెచ్చి నాగులు, దేవతా సర్పాలు మనిషికి ఆరోగ్యాన్ని, సంతానాన్ని ప్రసాది స్తాయని నమ్ముతారు.
మానవులు శౌచంతో, ధర్మ సత్య నిష్ఠలతో, దైవభక్తిని కలిగి ఉండే రోజులలో, నాగదే వతారాధన సమయంలో నాగులు మానవ జాతితో కలిసి సంచరించేవట. కానీ సత్య ధర్మ నిష్ఠలు, శౌచం తగ్గిపోతున్న రోజులు కనుకనే పూర్వంలాగా ఇప్పుడు నాగులు మాన వ రూపంలో సంచరించడం లేదని కొందరి వాదన. అయితే నిష్ఠాగరిష్టులైన నాగ భక్తుల కు దేవతా సర్పాలు దర్శనం, వరాలు అనుగ్రహస్తున్నాయని ఆ అనుభవం పొందిన కుటుంబాల వారు అంటారు. మనకు సాధారణంగా కనిపించేవి మామూలు పాములే. నాగుల చవితికి, నాగ పంచమికి నాగ దేవతలకు పూజలు చేయాలి. నాగుపాములు పా లు త్రాగవు. అవి అపరిశుభ్ర ప్రదేశాలలో ఉండవు. అందుకే నాగబంధ శిల్పాలపై పాల తో అభిషేకం చేసి, వివిధ పూజాద్రవ్యాలతో, పూలతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు.
కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. అందువల్ల చాలా ప్రాంతాలలో నాగులను స్కందునిగా, కార్తికేయ, మురుగన్‌ వంటి పేర్లతో ఆరాధిస్తారు. నాగారాధన చేసే రోజున భూమిని దున్నడం, తవ్వడం, చెట్లు పుట్టలు కొట్టడం, కూరగాయలు తరగ డం, పిండి దంచడం, వంటచేయడం నిషేధం అని ఇతిహాస పురాణాలంటున్నాయి.
”సుబ్రహ్మణ్య స్వామిని నాగులకు ప్రతిరూపముగా ఆరాధించడం ప్రాచీన కాలం నుండి ఉంది. స్కాంద పురాణం, శైవ సిద్ధాంత గ్రంథాలు, కథాసరిత్సాగరం, భేతాళ పం చ వింశతి కథల్లో, సంస్కృత సాహత్యంలో కుమార సంభవం, మృచ్ఛకటికం వంటి రచ నలలో కుమారస్వామి ప్రశంస విరివిగా ఉంది” అని డాక్టర్‌ పి.రమేష్‌ నారాయణ గారు తమ ”సర్పారాధన వైశిష్ట్యము” అనే గ్రంథములో చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ”నేను సేనానులలో కార్తికేయుడను” అని ప్రకటించడం వల్ల షణ్ముఖుని గొప్పదనం ద్యోతకమవుతున్నది.
ప్రకృతిని దైవ సమానంగా భావించి చెట్టు పుట్ట రాయి రప్ప కొండ కోన నది పర్వతా లను, సమస్త ప్రాణకోటిని దైవముగానే భావించి పూజించడం భారతీయ సంస్కృతిలో ని విశిష్టత. ప్రకృతి ఆరాధనలో భాగంగానే పాములను నాగరాజు, సుబ్రహ్మణ్యస్వామి రూపాలుగా తలచి పూజిస్తారు.
సర్పభయం తొలగడానికి…
”రురుం, సహస్రపాదంచ, ఆస్తికంమునిపుంగవం
శయనే యస్మరేన్నిత్యం సర్పేభ్యో భయనాశనం” అనే శ్లోకాన్ని నిద్రించడానికి ముందు చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు. ఆస్తీక మహర్షిని స్మరించినంతనే సర్పపీడ నివారించబడుతుందని ఒక విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement