తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
కాలో మలాదివ మజనయత్ కాల ఇమా పృథ్వీముత
కాలేహ భూతం భవ్యంచేహి తమేహ వితిష్టతే
కాలే తప: కాలేజ్యేష్టమ్ కాలే బ్రహ్మ సమాహితమ్
కాలో హి సర్వేశ్వర: య: పితా సీ త్ ప్రజాపతే:
కాల ప్రజా అసృజత కాలే అగ్రే ప్రజాపతిం
స్వయంభూ: కశ్యప: కాలాత్ తప: కాలాదజాయత
కాలేయమ: అంగిరో దేవ: అధర్వా చాధ తిష్టత:
ఇమంచ లోకం పరమంచ లోకం పుణ్యాంశ్చ లోకాన్
విధృతీశ్చ పుణ్యా: సర్వాన్ లోకాన్ అభజత ్య
బ్రహ్మణాకాల: స ఈయతే పరమోను దేవ:
కాల పురుషుడే స్వర్గమును సృష్టించెను. కాల పురుషుడే పృథ్విని సృష్టించెను. జరిగినది జరుగుచున్నది జరగనున్నది అంతా కాలములోనే ఉంది. పెద్దా చిన్నా ముందు వెనుకా పైనా కిందా అంతా కాలమే నిర్ణయిస్తుంది. తపస్సు కాలములోనే బ్రహ్మ ఉండును. కాలమే సర్వేశ్వరుడు. ప్రజాపతికి తండ్రి కూడా కాలమే. కాలము నుండే స్వయంభూ, కశ్యపుడు, అంగిరుడు, అధర్వుడు మహర్షులు కాలము నుండే పుట్టిరి. ఈ లోకము, పరలోకము, పుణ్యలోకములు అన్నింటిని కాలమే ధరిం చును. అన్ని లోకములను కూడా కాలమే విభజించుచును. కాల విభాగ అనుకూలము గానే దానిలోని భాగముగానే బ్రహ్మరుద్రులు, ఇంద్రుడు ఏర్పడెదరు. ఇది సంగ్రహముగా కాల వైభవము.