Friday, November 22, 2024

ముక్తికారకం దానగుణం

యజ్ఞ- దాన- తపస్సు- కర్మలు మానవులు ఎప్పుడూ విడచి పెట్టరాదని భగవద్గీత చెబుతుంది. కలియుగంలో మానవు నికి దానగుణమే ముక్తికారకము అవుతుందంటారు పెద్దలు. ఒక వస్తువు లేక పదార్థంపై వ్యక్తి తన హక్కును వదులుకొని అవసరం ఉన్న వ్యక్తికి దానిని మనస్ఫూర్తిగా ఇవ్వడమే దానమవు తుందని యాజ్ఞవల్కుడు అన్నాడు. సకల జీవుల పట్ల దయాగుణం కలిగి, అవసరం ఉన్నవారికి ఇతోధిక సహాయం చేయడం మంచిది. దానాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రద్ధ³తో చేయాలి.
”శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం
శ్రియా దేయం, హయాదేయం, భియాదేయం, సంవిదాదే యం” అంటుంది తైత్తరీయోపనిషత్తు. దానం శ్రద్ధగా చేయాలి కానీ అశ్రద్ధ తో అనాసక్తముగా చేయరాదు. సంతోషంగా, వినయంగా, భక్తితో, సంకల్ప పూర్వకంగా చేయాలట. మనకున్న దానిలో కొంత నిష్కా మంగా దానం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
దానం చేయకపోతే మనకు కొంత నష్టం కూడా కలుగుతుందనే ది శాస్త్ర వాక్యం. ”అదానదోషేణ భవేద్దరిద్ర:, దరిద్రదోషేణ కరోతి పాపం/ పాపాద వశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర: పునరేవ పాపి”. పూర్వజన్మలో దానధర్మాలు చేయకపోవడంవల్ల ఈ జన్మలో దరిద్రం కలిగింది. దరిద్ర బాధ వలన పాపకార్యాలు చేయడం జరుగుతుంది అందువలన నరకబాధ అనుభవించాలి. పాపాలు చేయడంవలన రాబోయే జన్మలో కూడా దరిద్రు లుగా పుడతాము. కనుక ప్రస్తుత జన్మలో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి.
దానం మూడురకాలుగా ఉంటుంది ”దాతవ్యమితి యద్దానం దీయతేనుప కారణీ/ దేశేకాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్‌” (భగవద్గీ త- 17వ అ. 20వ శ్లో). ఈయవలసినదే అనే నిశ్చయముతో ఏ దానము పుణ్య ప్రదేశాలలో, పుణ్య సమయాలలో యోగ్యుడైన వానికి, ప్రత్యుపకా రం చేయడానికి శక్తిలేని వానికి ఇవ్వబడుతుందో అది సాత్త్విక దానం అని చెప్పబడుతుంది. పుణ్యఫలాన్ని ఆశించి కానీ, ఇతరుల మెప్పుకోరి కానీ దానం చేయరాదు. దానం చేయడం మన కర్తవ్యంగా భావించి చేయాలి. పవిత్ర తీర్థాల వద్ద, క్షేత్రాల వద్ద, పండుగలు పబ్బాల సమయాలలో, ప్రతి పున్నమి, అమావాస్య దినాలలో, ఇంక కొంచెం అధికంగా దానం చేయాలి. తాను దాత, స్వీకరించేవాడు గ్రహత అనే భావన మనసులోకి రానీయ రాదు. ఇచ్చేది, పుచ్చుకొనేదీ ఈశ్వరుడే, మనం ఆయన చేతిలోని పనిము ట్లం మాత్రమే అని అనుకోవాలి.
”యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్ది శ్య వాపున:
దీయతేచ పరిక్లిష్టం తద్దా నం రాజసం స్మృతమ్‌”. (17 అ.21శ్లో)
ప్రత్యుపకారము కొరకు గానీ, లేక ప్రతి ఫలము ఆశించిగానీ, లేక క్లేశ ముతో గానీ ఇవ్వబడేది రాజస దానమని చెప్పబడుతోంది. ఒక చేత్తో చేసే దానం మరొక చేతికి తెలియకూడదు. నలుగురూ తనను మెచ్చుకోవాలనో, దానకర్ణుడు అనిపించుకోవాలనో, దానమీయకుంటే పాపం వస్తుందనే భయంతోనో చేసే దానం ఈ కోవలోనిదే. ఇక మూడవది తామస గుణంతో చేసే దానం.”ఆ దేశ కాలే యద్దానం అపా త్రేభ్యశ్చదీయతే/ అసత్కృతం అవజ్ఞాతం తత్తామస ముదాహ తృమ్‌”. (గీత-17 అ-22 వ శ్లో). దానమీయ తగని ప్రదేశాలలో, తగని కాలములలో, అపాత్రులకు, సత్కార రహతం గా, అమర్యాదతో ఇవ్వబడే దానము తామసదానమని చెప్పబడుతోంది. పవిత్రం కానిది, దానంగా పుచ్చుకోడానికి ఉపయోగపడనిది దానమివ్వ రాదు. సరైన ప్రదేశం కాని చోట, నిద్రపోయే సమయంలో, శరీర అవసరా లు తీర్చుకొనేటప్పుడు, వేరే పనిలో నిమగ్నమైనప్పుడు దానమివ్వరాదు.
మనం చేసే దానం గుప్తంగా చేయాలి. దానం చేసిన విషయం దాత మరచి పోవడం మంచిది. ప్రచారం కోసం చేసే దానం వృథా అవుతుంది. అపాత్ర దానం చేయకుండా, పాత్రతనెరిగి, యోగ్యునికి, అవసరం ఉన్న వ్యక్తికే దానం చేయాలి. అయితే, పరమేశ్వరార్పణం అనే భావంతో దానం చేసేవారు పాత్రత, అపాత్రతల గురించి ఆలోచిం చక దీనుడు, దరిద్రుడు, పాపకర్ముడై నా ఆత్మరూపుడే అనే ఎరుక కలిగి దానం చేస్తారు. అప్పుడు అ లాంటి దానాలకు గుణదోష విచారముండదు కదా! అన్నదానం, విద్యా దా నం, వస్త్ర, ధనధాన్యాదులు, కన్యాదానం, దాసీదానం, శయ్యా దానం, గృ హ, హరణ్య, అగ్రహార, గో, భూదానాలు అనేక రకాల దానాలున్నాయి .
”అన్నా చ్ఛాదన దానేషు పాత్రంనైవ విచారయేత్‌
అన్నస్యక్షధిత: పాత్రం, వివస్త్రో వస్త్రనస్యచ”
అన్నవస్త్రాలు దానం చేసేటప్పుడు గ్రహత దానం పుచ్చుకోడానికి పా త్రుడా, అపాత్రుడా అని చూడకుండా, వెంటనే దానమివ్వడం మంచిది. దక్షస్మృతి దానం సహజంగా ఎవరికి ఇవ్వవచ్చో, ఎవరికి ఇవ్వరాదో వివరిం చింది అని ”ఆధ్యాత్మిక జీవితం అనే తమ గ్రంథంలో వై.గోవిందరావుగారు తెలిపారు.
”మాతాపితురరౌమిత్రే వినీతేచోప కారిణి
దీనానాథ విశిష్టేషు దత్తంచ సఫలం భవేత్‌
ధూర్తే బందిని మల్లేచ కువైద్యేకి తవేశరే
చోట ధారణ చౌరేషు దత్తం భవతి నిష్ఫలం”
తల్లిదండ్రులకు, గురువులకు, మిత్రులకు, నీతిమంతులకు, పరోపకా రులకు, దీనులకు, అనాథలకు, చేసే దానం సత్ఫలం ఇస్తుంది. ధూర్తులకు, నిందితులకు, మూర్ఖులకు, అవినీతిపరులకు, దొంగలకు చేసే దానం నిష్ప్ర యోజనం అవుతుందని భావం.
ఆర్తితో ఉన్నవాని దగ్గరకు మనమే వెళ్ళి దానమివ్వడం ఉత్తమం. తీవ్రమైన అవసరం ఉండి బాధపడుతున్న వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానించి దానం ఇవ్వడం మధ్యమం. తనంతట తానే వచ్చి చేయిచాచి అడిగిన వాని కి దానం ఇవ్వడం అధమం అని భావించి రంతిదేవుడు, శిబి, దధీచి, కర్ణుడు లాంటి వారు చేసిన ఉదార దానాల గురించి అందరూ చెప్పుకొంటారు. సక్తుప్రస్థుడు అనే బ్రా#హ్మణుడు, అతని కుటుంబ సభ్యులు ఆహారం లేక అనే క రోజులు పస్తులుండి, ఒకరోజు అదృష్టవశాత్తు లభించిన పేలపిండిని అం దరూ తినబోయే సమయంలో, వారింటి ముందువచ్చి నిలచి యాచిం చిన వ్యక్తికి తాము తినబోయే ఆహారాన్ని పెట్టి, అతను తృప్తిగా తిని వెళ్ళాక, ఆ కుటుంబ సభ్యులందరూ ఆకలితో నేల పై పడి ప్రాణాలు వది లారు. అది నిజమైన దానం అని మహాభారతంలో ఒక నీతి కథ చెప్పబడింది. ఆ బ్రాహ్మ ణ కుటుంబం తమ ప్రాణాలను సైతం లెక్కచేయక చేసిన ఆహార దానం నిస్వార్థము, నిష్కామము, హృదయ పూర్వకమైన దానం కనుక దానం చేసే వారు, అది తమ విధి అనుకొని, శ్రద్ధతో, సంతోషం గా చేయడం మంచిది కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement