Wednesday, November 6, 2024

ముక్తిదాయం ‘రుద్ర, శివ’ నామాలు

రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు. జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశం కరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తి ని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు. అంతేకాదు,
‘మాని యే మహశస్య ధ్రువమ
ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తి:”
ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొన బడింది.
వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలు గవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మ ధ్యలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పం చాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి.
‘శివ’ నామోచ్ఛారణ మహాత్మ్యమునకు సంబం ధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండం లో వుంది. అటువంటి మహాశివుడిని కార్తిక మాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారత మ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు.
కార్తికంలో ఏరోజు శివపూజ చేయకపోయనా కార్తిక పు న్నమి నాడు మూడువందల అరవై వత్తుల గుత్తిని స్వా మి ఎదురుగా కానీ తులసి సన్నిథిలో కానీ, మారేడు, రా వి చెట్ల దగ్గర కానీ వెలిగిస్తే ఆ సంవత్సరం దీపం వెలి గించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది.
”ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానందభాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే”

”వందే శంభుముమాపతిం సురగురుం పందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిమ్‌!
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌!!
అని కార్తికంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు స్తుతిస్తూ కొలుస్తుంటారు.
ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్ర#హ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్ర యించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజ వలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానము వల్ల ముక్తి కలుగుతుంది. ఉసిరిక దీపదానం కూడా ఈ మాసంలో విశే షంగా చేస్తారు.
‘ఓం నమ: శివాయ నమ:’ అంటూ ఉసిరిక కా యమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యరాశి లభిస్తుందం టారు. శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనా మంతో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినా సరే అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్ర#హ స్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement