Sunday, November 24, 2024

33 కోట్ల దేవతలు…

ముక్కోటి దేవతలు అంటారు కదా! మరి ఈ 33 కోట్ల దేవతలు ఎవరు? అనే సందేహం చాలామందికి వస్తుంది. హిందువుల లోనే చాలామందికి 33 కోటి దేవతలు ఉంటారన్న విషయమే తెలియదు. 33 కోట్ల దేవతలు ఎక్కడ వున్నారు? వారి పేర్లు ఏమిటి? మన పురాణాల్లో వారందరూ వున్నారా? ఇలా అనేక సందేహాలు రావచ్చు. అంతేకాదు… ఎవరైనా ఎప్పుడైనా మీ దేవతల పేర్లు చెప్పండి అని ప్రశ్నిస్తే తడబడతారు.
వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలలో ఈ 33 కోటి దేవతల ప్రస్తా వన వుంది. ఈ వేదపురాణములు తెలుపు నట్టి త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలంటే ఎవరు? వారి పేర్లు, హందూ ధార్మిక సాహత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం.
హిందూ ధర్మం, సంస్కృతి 33 కోట్ల దేవతల గురించి చాలా విపులంగా ఇలా ప్రస్తావించాయి. సాధారణంగా ‘కోటి’ అంటే సంఖ్య అను కుంటారు చాలామంది. అందుకే 33 కోట్ల దేవతల పేర్లు చెప్పమని కూడా అడుగుతారు. వాస్తవానికి దేవతలకు వాడే ఈ ‘కోటి’ సంఖ్యను సూచించే కోటి కాదు అంటున్నది హిందూ ధర్మశాస్త్రం.
సంస్కృతంలో ‘కోటి’ అంటే ‘విధము’, ‘వర్గము’ అని అర్థాలు ఉన్నాయి.
ఉదాహరణకు ‘ఉచ్ఛకోటి’ అనే పదాన్ని తీసుకుంటే దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చెందినవారు అని అర్థం.
అలాగే ‘సప్త కోటి బుద్ధులు’ పదానికి అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.
యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రా#హ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయ త్రింశతి కోటి (33 కోటి) దేవతలు.
#హందూ శాస్త్రాలు, గ్రంథములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైన గ్రంథాలు కూడా 33 దేవ వర్గముల గురించి తెెలియజేస్తున్నాయి. బౌద్ధుల దివ్యవాదము, సువర్ణ ప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉంది. దేవతల 33 వర్గములను, ఏ వర్గములో ఏయే దేవతలు వస్తా రు? వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం.
12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు)

1. త్వష్ట, 2. పూష. 3. వివస్వాన్‌ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవిత 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.

11 రుద్రులు (ఏకాదశ రుద్రులు)

1.మన్యు 2. మను 3. మహనస 4. మహాన్‌ 5. శివ
6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల
10. వామదేవ 11. ధృతవృత.

8 వసువులు (అష్టవసువులు)

- Advertisement -

1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యూష
6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ.
మరి ఇద్దరు ఇంద్ర ప్రజాపతిలు.
పైన పేర్కొన్న దేవతల సంఖ్యలన్నిటినీ కలిపితే 33మంది వస్తారు.
వీరినే త్రయత్రింశతి (33)కోటి దేవతలు అని పిలుస్తారు.
ఇప్పుడు 33కోటి దేవతలు అంటే ఎవరో, వారి పేర్లు ఏమిటో తెలిసాయి కదా! వీరి పేర్లను గుర్తుపెట్టుకుంటే చాలు. 33కోటి దేవతల పేర్లను చెప్పమని ఎవరైనా అడిగితే వెనుక ముందు చూడవలసిన అవసరమే వుండదు కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement