మృ త్తికా (మట్టి) ప్రసాద రూపంలో ఇచ్చే దేవాలయాలు ఉన్నాయి. మట్టిని పూ జారులు చేతిలో పెట్టిన వెంటనే ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది మొదటిసారి ఆ దే వాలయానికి వెళ్ళినవారికి. సాధారణంగా దేవా లయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుం కుమ, చందనం తదితరాలను ఇస్తారు. కానీ కర్నాటకలోని సుందరమయిన పశ్చిమ కనుమ లలో వున్న అత్యంత ప్రసిద్ధమైన కుక్కే సుబ్రమ ణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా (పుట్ట మన్ను’ ప్రసాద రూపంలో అందిస్తారు.
ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో కూడా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు పుట్టమన్నును ప్రసాద రూపంలో ఇస్తారు. భక్తులు ఈ మృత్తికా ప్రసా దం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
మృత్తికా ప్రసాద మహిమ
మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగ దేవతల అను గ్రహం ఉంటుంది.
ఎవరైతే పాములను చూసి చాలా భయ ప డతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటాయో అటువంటివారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.
ఆడపిల్లలు ఎవరైతే ఎంతమంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తిక, ఒక చిటిక పసుపును వేడి నీరు కాచేపాత్రలో వేసి తరువాత స్నానం చేయా లి. తరువాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవు నికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.
ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికను వేసి తలదువ్వు కొంటే ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలా గే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొం టారు.
బాలగ్రహ దోషాలు వున్న పిల్లలు ఎక్కువగా పళ్ళు కొరకడం, కిందపడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం లాంటి సమస్యలతో బాధపడుతుంటే మృత్తికను తీసుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదుటికి పెడితే ఆరోగ్యంగా పెరుగుతారు.
పదేపదే అనారోగ్యానికి గురయ్యే పిల్లలకు స్నానం చేయించే వేడినీటితో స్నానం చేయించాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ప్రా ర్థించాలి.వారి ఆరోగ్యం చక్క బడుతుంది.
ఎవరికైతే ఋతు సమయం లో కడుపు నొప్పి ఎక్కువుగా అటువంటి వారు ఋతుకా లానికి ముందు ఒక చిటిక మృత్తికను బాగా పొ డి చేసుకొని, కొబ్బరి నూనె లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్ట నొప్పి ఉండదు.
ఎవరైతే పరీక్షాకాలంలో చదివిందంతా మర చిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృతి ్తకను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూ వుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీ క్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.
వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్యస్వామికి పూజ చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాల కు ఒక చిటిక మృత్తికను వేసి దేవుని పూజించి తాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సం తాన భాగ్యం కలుగుతుంది.
ఎవరింట్లో అయినా తులసి మొక్క తమ లపాకు ఆకుల తీగలు ఎంత వేసినా వడలి పోతుంటాయో అటువంటివారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.
చర్మం పొడి బారినవారు నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బందిపడుతుంటారో అటువంటివారు ఒక చిటిక మృత్తికను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరో గ్యవంతులుగా, భాగ్యవంతులుగా కలకాలం విలసిల్లుతారని శాస్త్ర వచనం.