శ్లో|| అంతశ్శబ్దార్ధ సంజల్స స్వాభిరూప విలక్షణ|
నిరవద్వే! నిరాలంబే! భద్రకాళీ! నమోస్తుతే||
శ్లో|| శరత్కాలే మహా పూజా క్రియతే యాచ వార్షికి|
తస్యాంమవై తన్మాహాత్త్యం శ్రుత్వాభక్తి సమన్విత:||
సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సమన్విత:
రునుష్యో మత్స్రసాదేన భవిష్యతి నసంశయ: ||దేవీ మహాత్మ్యే||
తెలంగాణ రాష్ట్రము నందలి కాకతీయుల రాజధాని కశిలా నగరముగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన వరంగల్ మహా నగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలను కొంగు బంగారమగుచు పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్ర కాళీ దేవస్థానమునందు ఆషాఢ శుద్ధ పాడ్యమి (జూన్ 19)నాడు మొదలైన శ్రీ భద్రాకాళీ దేవీ శాకంబరీ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సోమవారం (జులై 3వ తేదీ) వరకు జరుగుతున్న ఈ శుభ తరుణమిది.
తాంభద్రకాళీం తపసా జ్యలన్తీం
మహశ్వరీమ్ శుద్ధ మహా ప్రతిష్టామ్
శుద్దాత్మ కాళాయణ గుణాత్మ భావాం
వన్దే సదా చేతసి భద్రకాళీమ్
ఓరుగల్లులో కొలువై ఉన్న భద్రకాళీ అమ్మవారు ఈ ప్రాంత ప్రజల కోరిన కోర్కెలు తీరు స్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా కొలువబడుతూ విశిష్ట పూజలనందుకొంటుంది. అటు హనుమకొండ, టు వరంగల్ నగరాల మధ్యంతరంగా అందమైన కొండల నడుమ తటాకం పక్కన ప్రకృతి అందాలతో విశేషంగా అలరింపచేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం గురిం చి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇది ప్రాచీన క్షేత్ర కొందరు దీన్ని ఆదివాసీయుల ఆలయంగా కొలుస్తారు. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి క్రీ.శ. 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పేర్కొంటుండగా మరికొందరు ఇది కాకతీయుల కాలంలో బేత రాజు నిర్మాణం చేయించినట్లుగా ఆధారాలున్నాయి. రుద్రదేవుడు తన రాజధానిని వరంగల్ కోటకు మార్చిన అనంతరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయగా గణపతి దేవుడు ముఖ మండ పం కట్టించి చెరువును త్రవ్వించినట్లుగా తెలుస్తోంది. ముస్లిం దండయాత్రల వల్ల శిథిలమైన ఈ దేవాలయాన్ని షితాబాన్ (1540-1600) మధ్య కాలంలో పునరుద్ధరించినట్లు శిలా శాస నం వల్ల స్పష్టమవుతోంది. 1950 ప్రాంతంలో జీర్ణదశలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ జరిగింది. అప్పటినుంచి ఈనాటి వరకు దశల వారిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈనాడు ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలోనే ముఖ్యమైన ఆలయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతీ యేటా దసరా ఉత్సవాల సంద ర్భంగా వైభవోపేతంగా నిర్వ#హంచే శ్రీ దేవిశరన్నవరాత్ర ఉత్సవాలతో పాటు వివిధ రకాల పం డ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించి నిర్వ#హంచే శాకంబరీ వేడుక సమయాల్లో శ్రీ భద్రకాళీ దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలలో భాగంగా 14వ రోజు ఉదయం అమ్మవారి ని దశ మహావిద్యలతో అద్యవిద్యయైన కాళీ ఆరాధన పద్ధతిలో ముద్రాక్రమంలో అలంకరిం చి అనుష్టానం నిర్వ#హస్తారు. సాయంత్రం షోఢశాక్రమంలో జ్వాలామాలినీ క్రమంలో అమ్మ వారిని అలంకరించి పూజలు నిర్వహస్తారు. అమ్మవారిని బెండకాయ, నల్ల వంకాయ, దోస కాయ, పూల దండలతో అలంకరిస్తారు. 15వ రోజున అమ్మవారిని కాళీక్రమంలోని మితా క్రమంలో అలంకరిస్తారు. అమ్మవారు మహా శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. సాయంత్రం చిత్రానిత్యా క్రమంలో అలంకరించి పూజలు నిర్వ#హస్తారు.
33 కోట్ల దేవతలకు జగత్‌కు అంతా తనే అయిన బ్ర#హ్మ స్వరూపిణిగా బ్రహ్మాండాన్ని తనల పరిమితం చేసుకొని మితాదేవి దర్శనం ఇస్తుంది. మితా క్రమంతో పాటు మహా శాకంబ రి దర్శనంతో భక్తులకు పుణ్యప్రాప్తి. అమ్మవారి పరిపూర్ణ అనుగ్ర#హ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శాకంబరీ వేడుకల సమయాల్లో లక్షలాది భక్తులు భద్రకాళీ అమ్మవారిని సేవి స్తూ తరిస్తుంటారు. ఈ పర్వదిన వేడుకల్లో భద్రకాళీ అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాల తో పూర్ణాభిషేకం, పూజలు, మహూత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహంచడం ఆనవా యితీగా వస్తోంది.
భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాసు రూపం మంగళ కలయతీ జనయతీయ శ్రీ భద్రకాళీ
దేవీ భగవతంలో మత్స్య పురాణంలో చెప్పబడిన 108 దేవీ పీఠాలలో ఈ క్షేత్రం భద్రేశ్వ ర క్షేత్రంగా ప్రతీతి. ఈమె ఆత్మ జ్ఞానమును, శుభములను ప్రసాదించే మహాశక్తి దేవతగా ఆరా ధించబడినందున భక్తులు విశేషంగా కొలుస్తుంటారని పేర్కొనబడింది. పుక్కిటి పురాణ గాథ లెలా ఉన్నా ఆపద సమయాల్లో తనను కొలిచే భక్తులను భద్రంగా కాపాడే తల్లిగా పేరొందిన ఈ ప్రాంతం వారు… అమ్మవారిని కొలువని వారు లేరంటే.. అతిశయోక్తి లేదు.