అత్యంత వైభవోపేతంగా శ్రీ భగవద్రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇది. ఈ శుభ తరుణంలో మహోన్నత సమతామూర్తి దివ్య ప్రాంగణంలో కొలువై వున్నాయి 108 దివ్య దేశాలు. వాటిలో ప్రధానమైన 33 దివ్య దేశ ఆలయాల్లో దేవతామూర్తులను ప్రాణప్రతిష్ట చేశారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. ఈ ఆలయాల్లో శ్రీరంగం, తిరుపðట్ కుషిలాంటి ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలు, గ్రామాలు శ్రీ రామానుజులవారి జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా నిలిచాయి.
శ్రీ వైష్ణవానికి ప్రధాన కేంద్రం శ్రీరంగం
ప్రాచీన కాలం నుండి తమిళనాడు లో ఉన్న శ్రీరంగ క్షేత్రం శ్రీవైష్ణవానికి ముఖ్యస్థానంగా ఉంది. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాధుడి దేవాలయం ఉభ య కావేరీ నదుల మధ్య 156 ఎకరాల సువిశాల ప్రాంగణం. ఆరుమైళ్ళ పైన విస్తరించిన 7 ప్రాకారాల మధ్య విష్ణు మూర్తి స్వయంభువుగా శ్రీరంగనాథు డుగా కొలువై వున్నాడు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగ డుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యులవారి శరీరం వుండడం. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్య ఆలయాన్ని సందర్శించినా… అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. శ్రీ రామానుజాచార్యులు పరమపదిం చి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచారు. పద్మాసనంలో యోగభంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు.
శ్రీవైష్ణవ భక్తులైన 12మంది ఆళ్వార్లు ఈ క్షేత్ర వైభవాన్ని 243 పాశురాలతో గానం చేశారు. శ్రీ రామానుజులకు పరమాచార్యులైన శ్రీ యామునాచార్యుల వారు కూడా శ్రీరంగాన్నే కేంద్రంగా చేసుకొని పరమ వైదికమైన విశిష్టాద్వైత సిద్ధాంతానికి వన్నె తెచ్చారు. శ్రీరంగనాథుని సేవలు సన్నగిల్లిన సమయంలో శ్రీరామానుజులు శ్రీరంగం వచ్చారు. అస్తవ్యస్తంగా మారిన ఆలయ వ్యవస్థను, ఉత్సవాదులను, చుట్టూ ఉండే సమాజాన్ని దీక్షతో తీర్చిదిద్దడం ప్రారంభించా రు. శ్రీరంగం క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని ఆలయ వ్యవస్థతోపాటు శ్రీ భగవ ద్రామానుజులు తమ విద్యా వ్యాసంగాన్ని కూడా పెంచుకుంటూ సాగారు. శ్రీరంగంలో అధికారి వర్గాన్ని, పండితులను, పామరులను తారతమ్యం లేకుం డా అందరిని భగవంతుణ్ణి ప్రేమించేవారిగా తీర్చిదిద్దాలనుకున్నారు. శ్రీరంగనా థుని ఆలయంలోని వ్యవస్థను తీర్చిదిద్దడానికి శ్రీ రామానుజులు ఎన్నో సంవ త్సరాలు అవిరళ కృషి చేశారు. శ్రీరంగనాథుని ఆరాధనా వ్యవస్థను సరిదిద్ది చక్కటి వైదిక వాఙ్మయ వైభవాన్ని కూడా పెంచుతూ సమాజాన్ని భగవత్సేవా పరంగా మార్చారు శ్రీరామానుజులు.
రామానుజులు తరలిన తిరుప్పట్ కుషి
పదహారు సంవత్సరాల వయసులో పుట్టి పెరిగిన శ్రీపెరంబుదూరును వదిలి ‘తిరుప్పుట్ కుషి’ అనే గ్రామానికి కుటుంబంతో సహా తరలివెళ్ళారు రామానుజులు. తండ్రి కేశవ సోమయాజి కాలం చేయడంతో శ్రీ రామానుజా చార్యులు కుటుంబ నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. ఇద్దరు సోదరీమణులు భూమిదేవి, కమలాదేవి, తల్లి కాంతిమతి, భార్య తంజమాంబకు శ్రీ రామాను జులే పెద్ద దిక్కు అయ్యారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తండ్రివలె వైదిక కర్మలు నిర్వహిస్తూ కుటుంబ పోషణకు పరిమితం కాలేకపోయారు రామానుజులు. జీవితంలో సంభవించే సుఖదు:ఖాల వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవడా నికి వేదాంత విద్యను అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నారు. కంచికి 15 కి.మీ.దూరంలోఉన్న ‘తిరుప్పుట్ కుషి’ గ్రామానికి రామానుజులు తమ కుటుం బాన్ని తరలించారు. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన శ్రీ విజయ రాఘవ స్వామిదేవాలయం ఇక్కడ ఉంది. జటాయువుకు శ్రీరామచంద్రుడు చరమ సంస్కారం చేసిన చోటిది. యాద వ ప్రకాశులనే వేదాంతాచార్యుడు తన శిష్యులతో వేద పాఠశాలను ఈ గ్రామం లో నిర్వహించే వారు. ”వేదోఖిలో ధర్మమూలమ్’ ‘సమస్త ధర్మాల కు వేదమే మూలం’ ఇది భారతీయుల విశ్వాసం. వేదా లలోని పూర్వ భాగాన్ని ఆదరిం చి కర్మలకే ప్రాధాన్యాన్ని చ్చినవారు మీమాంసకులు. ఉత్తరభాగమే ఉత్తమమైనదని భావించి జ్ఞానానికి ప్రాధాన్యాన్నిచ్చినవారు వేదాంతులు. వేదప్రతిపాదితమైన పరమార్థాన్ని దర్శిం చాలనే లక్ష్యంతో రామానుజులు యాదవప్రకాశులను ఆశ్రయించారు. రామాను జుల వినయవిధేయతలు, ప్రతిభా పాటవాలు, భక్తిశ్రద్ధలు యాదవ ప్రకాశులు బాగా ఆకర్షించాయి. ఎనిమిది సంవత్సరాలు ‘తిరుప్పుట్ కుషి’లోనే ‘వేదాంతా న్ని’ ప్రేమించే విద్యార్థిగా జీవితం గడిపారు శ్రీరామానుజులు వారు.