మహాగౌరీ దుర్గాదేవి నవదుర్గల అలంకారాల్లో ఎనిమి దవ అవతారం. హిందూ పురాణాల ప్రకారం మహాగౌరిని పూజించే భక్తుల కోరికలను అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవి నాలుగు చేతులతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడిచేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.
మహాగౌరి అంటే గొప్ప తెలుపు అని అర్ధం, దుర్గాదేవి తెలుపు రంగులో చాలా అందంగా ఉంటుంది. మహాగౌరీని నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు, చేతులు త్రిశూలం, కమలం, ఢమరుకం కలిగి ఉంటాయి, నాల్గవది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు కమలం కూడా ఉంటుంది. దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి, తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా వుం టుంది. పార్వతీదేవి పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి నార దుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. ఆమె రాజ భవనాన్ని, రాజ భోగాల్ని విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఎండ, చలి, వర్షం, కరువు, భయం కరమైన తుఫానులను కూడా లెక్కచేయకుండా చాలా సంవత్స రాలు కఠిన తపస్సు చేసింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. నల్లటి రూపాన్ని సంతరించుకుంది. చివరికి, శివుడు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి, తన తలపైవున్న గంగానది జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహమాన్వితమైన విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ తెల్లని రంగు లోకి మారింది. అప్పటినుంచి పార్వతీదేవి మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది. గౌరీదేవి, శక్తి, మాత, దుర్గ, పార్వతి, కాళీ ఇలా అనేక రూపాల్లో కనిపిస్తుంది. పవిత్రమైనది, తెలివైనది. చెడు పను లను చేసేవారిని శిక్షించి, మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తనను కొలిచే భక్తుల కోరికలను తీరుస్తూ, వారికి పునర్జన్మ భయాన్ని తొలగిస్తూ మోక్షప్రదాయినిగా పూజలందుకుంటున్నది
– దైతా నాగపద్మలత
వెూక్షప్రదాయిని మహాగౌరి!
Advertisement
తాజా వార్తలు
Advertisement