Monday, November 18, 2024

వార్థక్యం ఎక్కడ ఉంటుంది

వార్ధక్యం వయసా నాస్తి
మనసా నైవ తద్భవేత్‌
సంతతోద్యమ శీలస్య
నాస్తి వార్ధక్య పీడనమ్‌
ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్ప డూ పని చేసుకునే వానికి ముసలి తనపు పీడ ఉండదని సుభాషితం. ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దు:ఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలి తనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యా రంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించు కుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది. పనిచేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికేకాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్య పానం, ధూమపానం, మత్తు మందుల వాడ కం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామ ర్థ్యాలను బలహీనపరుస్తాయి. అకాల వార్ధక్యా నికి దారితీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గి స్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాల కు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తి డులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది. మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చే సింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. ‘సంత తోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టు కుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సంప్రదాయంలో జ్ఞాన వార్దక్యాన్ని అంగీకరిం చారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు. నిత్య వ్యాయామం, యో గాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతత క్రియాశీలత, మితాహారం, హతాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్నచోట ముసలితనం ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement