సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న మంత్రి సత్యవతి
ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజ యవంతంగా నిర్వహించడం కొరకు భక్తుల సౌకర్యార్దం వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తిచేసుకుని జాతర నిర్వహిం చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవ తి రాథోడ్ అన్నారు. దక్షిణాది అతిపెద్ద కుంభమేళా గిరిజన ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల నడుమ అధిక సంఖ్యలో భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవారిని దర్శించుకునే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి మేడారం పర్యటనలో భాగంగా సమ్మక్క, సారలమ్మలను దర్శనం చేసుకుని మీడియా వ్యూ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్ ఆవరణలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టి పూర్తిచేసిన సులబ్ కాంప్లెక్స్ టాయిలెట్స్‌ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియా స్కూల్‌ను సందర్శించి రూ. 38 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి పూర్తిచేసిన కమ్యూనిటి డైనింగ్ హాల్ నిర్మాణం ప్రారంభించారు. గిరిజన సం క్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా అత్యంత నాణ్యత ప్రమాణాలతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన పనులు భక్తులు మెచ్చేలా ఉన్నవని మంత్రి కొని యాడారు. అంతకు ముందు మంత్రి సత్యవతి రాథోడ్ తల్లులను దర్శించుకున్నారు. జాతర సజావుగా జరిగే విధంగా దీవించాలని తల్లులను వేడుకునన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మేడారం ఉత్సవ కమిటీ చైర్మన్ కోర్నెబెల్లి శివయ్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, అదనపు ఎస్పీలు, ఆలయ ఈఓ రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ చీప్ ఇంజనీర్ శంకర్‌రావు, ఈఈ హేమలత, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీ ర్ మురళీధర్‌రావు, ఐటీడీఏ ఏపీఓ వసంత్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎర్రయ్య, తహశీ ల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం జనజాతర
Advertisement
తాజా వార్తలు
Advertisement