Wednesday, November 20, 2024

మాసానాం మార్గశీర్షోహం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామ#హమ్‌
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర:

”వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛంద స్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును” అంటూ సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవ ద్గీతలోని విభూతి యోగంలో చెప్పిన శ్లోకమిది. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవాను ముఖత: ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించి న మాసం.
విభూతి యోగంలోనే ”నక్షత్రాణ మహం శశీ” అన్నారు. చంద్రుడు తారానాథుడు. ”మాసాలలో మార్గశీర్షం- నక్షత్రా లలో చంద్రుడు”- మృగశిరా నక్షత్ర యుక్త పౌర్ణమాసి మార్గ శీర్షం- ఈ మాసమునకు అధినాథుడు చంద్రుడు. మృగశిరా నక్షత్రమునకు కూడ చంద్రుడే అధినాథుడు. ఇంకే నక్షత్రానికి చంద్రుడు అధినాథుడు కాడు. నక్షత్రములు మృగశిరాదిగ నెలలు, మార్గశీర్ష మాదిగా లెక్కించెడివారు. అందువలన మా ర్గశిర మాసమునకు భగవానుడు ప్రాధాన్యత కలిగించారు.
విషవత్తు అంటే రాత్రి దివసముల సమాన కాలము. మృగ శిరా నక్షత్రముతో మన పూర్వ రుషులు విష్ణువత్తు నిర్ణయం గావించారు. మృగశిరా విష్థువత్తుతో మొదలయ్యే కాలం మార్గశీర్షం.
మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన పాశురములను అనుగ్ర#హంచినది. ”మార్గళంగల్‌ మదినిజైన్ద నన్నాళాల్‌ మార్గశిరము వచ్చినది. పూర్ణచంద్రునితో కూడిన శుక్లపక్షము ్ఖవైష్ణవ మాసము- మార్గశీర్షము అనగా భగవం తుని పొందుదారి- ”నారాయణనే నమక్కే” అని శరణాగతి.
భాగవతం దశమ స్కంధంలోనే భగవంతుని వెదకెడి ద్రోవలో హమంతంలో ప్రథమ మాసంలో నందప్రజ కుమారి కలు భగవత్‌ ప్రసాదం ”హవిష్యం భుంజాన:” కాత్యాయనీ వ్రతం చేయుటకు పూనుకొన్నారని ప్రమాణం ఉన్నది.
మార్గశిరం తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశి రం. మార్గశీర్షం పరమ పవిత్రం. నక్షత్ర మండ లంలో మూడు నక్షత్రాలు శీర్షాకృతిని పోలి ఉన్నం దున ”మృగశీర్ష” అని పేరు వచ్చింది. రాశి అధిప తి గురుడు, సూర్యచంద్రుల సమాగమమును సంతరించుకున్న ఈ మాసం విష్ణు ఆరాధనతో మోక్షదాయిని అయింది. ఒకప్పుడు మార్గశిరం లోనే సంవత్సరారంభం ఉండినట్లు వాడకంలో ఉంది. భాగవత దశమ స్కంధంలో బమ్మెర పోతనామాత్యుడు, గోపభామలు ”మార్గశీర్షవ్ర తం” జరిపారని పేర్కొన్నాడు. కోటిసూర్య గ్రహ ణ స్నాన తుల్య ఫలాన్ని ఇచ్చే మార్గశిర శుక్ల ప్రతి పద, ఉమామహశ్వర, అనంత తృతీయ, యోగ తృతీయ, నామ తృతీయ, అనబడే శుక్ల తృతీయ నాడు రంభావ్రతం, చవితి నాడు వినాయక చతు ర్థి వ్రతం, పంచమి నాడు దక్షిణాత్యుల నాగపూజ, శివుని రెండవ కుమారుడు, కుమారస్వామి, కార్తికేయుడు స్కందుడు, గు#హుడు, షణ్ముఖుడై న సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే సుబ్బారాయుడి షష్టినాడు స్కంద వ్రతం, బ్ర#హ్మచారి పూజ, సర్ప పూజ, సప్తమి సూర్య ఆరాధన, నందా సప్తమీ వ్ర తం, అష్టమినాడు కాలభైరవ పూజ, నవమి నాడు నందిని దేవి పూజ, దశమి నాడు ఆరోగ్య వ్రతం, మోక్షదైకాదశి, సౌఖ్య దైకాదళి అని పిలువబడే ఏకాదశి విష్ణు ఆరాధన, త్రయోదశి హనుమత్‌ వ్రతం, ద్వాదశి నాడు తెలుగు వారి ఇల వేలుపు అయిన వేంకటేశ్వరుని పుష్కరిణికి తీర్ధ దనంగా, త్రయోదశిన గోదావరి ప్రాంత హనుమజ్జయంతిగా, చతుర్దశి దత్తాత్రేయ ఆరాధన పౌర్ణమి నాడు దత్తజయంతి, చంద్రపూజ, యమారాధన, కృష్ణపక్ష ద్వాదశి మల్లన్న ద్వాదశిగా, చతుర్దశి మాస శివరాత్రి, వ్రత నిష్ణాపరులకు ఆచరణలో ఉన్నాయి.
కార్తిక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమ దంష్ట్రు లుగా చెబుతారు. ఈ కాలంలో జనం వివిధ ఆనారోగ్య సమస్య లతో బాధపడు తుంటారు. మార్గశిర పౌర్ణమితో ఈ అనేక రకమై న వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి కాబట్టి యముని పట్ల కృతజ్ఞత పూర్వకంగా మార్గశిర పౌర్ణమినాడు యమ ధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
మహర్షి అత్రి, మహా పతి వ్రత అనసూయలకు మార్గశీర్ష పౌర్ణమి నాడు గురు స్వరూపంగా త్రిగుణాత్ముడు, త్రిముఖ దేహుడు దత్త రూపంలో జన్మించిన ”దత్తాత్రేయుని జయం తి”ని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లో వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవికాకుండా ధనుర్మాసం, లక్ష్మీవారం గురు వారం, షష్టీవారాలు ప్రసిద్ధాలు. జ్ఞానమును పెంపొందించే ధనుర్మాసంలో ఓంకారాన్ని ధనువుగా, ఆత్మను బాణంగా, బ్రహ్మమును లక్ష్యంగా చేసుకుని, సాధకులు నిర్మల, నిశ్చల మనస్కులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేస్తే, త్వరగా లక్ష్యసిద్ధి కలుగుతుందనేది విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement