ఝరాసంఘం, ప్రభ న్యూస్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం నాడు పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం అ ంగరంగవైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన సందోహం సమక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవోపేతంగా కొనసాగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాలకు చెందిన స్త్రీ పురుష భక్తులు తిలకించేందుకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవంలో చూడముచ్చటగా ఆలంకరించిన ఆలయ ప్రాంగాణంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో గణపతి పూజతో పాటు దేవతామూర్తులకు ఆలయ గర్భగుడిలో అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. కళ్యాణోత్సవానికి దంపతులు, మహిళలు, మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement