దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించి.. లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు ఈరోజు హుషారుగా ట్రేడింగ్ చేశారు. దీంతో మార్కెట్లు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 52,880కి చేరుకుంది. నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 15,834కి ఎగబాకింది. బీఎస్‌ఈ 30 సూచీలో ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా.. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ఇది కూడా చదవండి: అమెజాన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ జాస్సీ..