Tuesday, November 26, 2024

మంత్రద్రిక – ఘోష

పురాతన వేద కాలంకు చెందిన భారతీయ మహళా తత్వవేత్త. పజ్ర వంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. ఈమె ఋగ్వేదం దశమ మం డలంలోని కొన్ని సూక్తలను దర్శించి ఋషీక అయింది. ఋగ్వేదంలో రెండు శ్లోకాలను కూడా రాసింది. మంత్రాలలో ప్రావీణ్యం ఉన్నందున ఈమెను మంత్రద్రిక అని పిలుస్తారు. ఈమె బ్ర#హ్మవాదిని లేదా వక్త లేదా బ్రాహ్మణ ప్రకటనకర్త అని కూడా పిలువబడింది. ఆమెయే ఘోష.
జగద్విదితమైన పాండిత్యం ఉన్న కక్షీవంతుని ఆశ్రమం ధర్మబద్ధత, నిరంతర వేదనాదం, హోమ ధూమం, నియమనిష్టలతో కూడిన జీవనంతో అలరారుతోంది. కక్షీవంతుని దంపతుల కుమార్తె ఘోష. అందాల అప రంజి బొమ్మ ఆబాల. ఘోష పెరిగి పెద్దదై మూర్తీభవించిన సౌందర్యంగా, రూపెత్తిన వినయమూర్తిగా అందర్నీ అలరిస్తున్నది. తన తండ్రి కక్షీవంతుని వద్దనే విద్యని అభ్యసిస్తున్నది. ఆమె ఏకాగ్రతకు కుశాగ్ర బుద్ధికి, గ్రహణ పటుతకు, విమర్శనా శక్తిని చూసిన పండిత మహర్షులు కక్షీవంతునితో ”మహర్షీ! నీవు ధన్యుడవు. ఘోష సాక్షాత్తు సరస్వతీ మూర్తి. ఆమెవల్ల నీవు, నీ వంశం ప్రఖ్యాతి పొందుతారు”. అని హృదయ పూర్వకంగా అభినందించేవారు. ఘోషని మనసారా ఆశీర్వదించేవారు. ”ఘోష ఎవరింటికి వెళ్తుం దోగాని ఆ ఇల్లు దైవీసంపదతో, అలౌకిక అనురాగబంధా లతో, పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటుంది” అని అందరూ అనుకునేవారు. కక్షీవంతుని దంపతులు యో గ్యుడైన వరునికిచ్చి వివా#హం చేయాలని సంకల్పించారు.
ఒకరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన కక్షీవంతుడు, తనకన్నా ముందే మేల్కొని స్నానాదికాలు ముగించుకుని దైవప్రార్థనలో మగ్నమయ్యే ఘోష ఇంకా నిద్రిస్తూనే ఉండ టం చూసి ఆశ్చర్యపోయి, ”అమ్మా! ఘోషా! ఇంకా లేవ లేదేం తల్లి!” అంటూ ప్రేమగా, నుదుటిపై చెయ్యి వేసాడు. నిప్పు సెగ సోకినట్లు ఆమె శరీరం జ్వర తాపంతో కాలిపోతున్నది. వెంటనే, శుచియై పెరట్లో వున్న ఓషధీ వనంలోకి వెళ్లి, ఓషధీ సూక్తాలను పఠిస్తూ, ఓషధీ లతలకు, మొక్కలకు నమస్కరించి అవసరమైన పత్రాదులని సేకరిం చి, ఔషధం తయారుచేసి ఘోష చేత దానిని తాగించాడు.
క్రితం రాత్రి వరకూ ఉల్లాసంగా ఎన్నో విషయాలను గురించి చర్చించి, ఆనందంగా శయనించిన తమ కుమార్తె తెల్లవారేసరికి ఈవిధంగా అనా రోగ్యం పాలవడం ఆమె తల్లి దండ్రులకు బాధ కలిగించింది. సమీపంలో వున్న వైద్యుడి కుటీరానికి వెళ్ళి, ఆ భిషగ్వరునికి తన కూతురు అనారోగ్యం గురించి, తానిచ్చిన ఔషధం గురించి విన్నవించాడు. ఘోషని క్షుణ్ణంగా పరి శీలించిన వైద్యుడు, ఇన్ని సంవత్సరాల అనుభవంలో అంతుబట్టని వ్యాధి ని ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యపోయాడు. రానురాను ఆమె ఆరోగ్యం దిగ జారిపోతోంది. శరీరం ముడుతలు పడి పోతున్నది. శరీరంపై వ్రణ చిహ్నా లు కూడా కనపడుతున్నాయి. భిషగ్వరునికి ఎంత ఆలోచించినా సమాధా నం లభించలేదు. ”కక్షీవంతా! అమ్మాయికి వచ్చిన వ్యాధి అసాధారణమై నది. అయితే మృత్యు భయం లేదని ఘంటా పథంగా చెప్పగలను. ఇతర వైద్య మిత్రులతో కూడా సమాలోచించి చికిత్స ప్రారంభిద్దాం. నియమ నిష్టాగరిష్టులు అయిన వైద్యులు ఘోషకు చికిత్స చేశారు. సుదీర్ఘకాల చికిత్సతో ఘోష ప్రాణాలు దక్కాయి. ఎన్ని ప్రార్ధనలు చేసినా భగవంతుడి అనుగ్రహం కలుగలేదేమో ఘోష ఇప్పుడు మునుపటివలె సౌందర్యవతి కాదు. పాదాది ఫాల పర్యంతం శరీరం ముడుతలు పడి, శరీరం మీద దుర్గంధ భూయిష్టమైన వ్రణాలు. వ్యాధిగ్రస్తయైన ఆమె బాధలను చూడ లేక ఋషులు ఆశ్రమం వదిలి వెళ్ళిపోవడంతో, ఆ ఆశ్రమం పాడు పడిపో యిన దానిలా అయిపోయింది.
ఘోష జీవితాన్ని భారంగా ఈడుస్తున్నది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మీద చింతతోనే కాలగర్భంలో కలిసిపోయారు. ఘోష చెలికత్తెలు అందరూ వివాహాలు చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయారు. ఎవరూ లేని ఆమె, ఆశ్రమంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నది. ఆమెకు ఇప్పుడు 60 సంవత్సరాలు. తనకు ఇప్పట్లో మరణంరాదు. ఆత్మహత్య మహాపాతకం. అంతేకాక ఆత్మ#హత్యకు పాల్పడేటంత పిరికిదికాదు ఘోష. మనస్సులో ఎంత వేదన వున్నా జన్మత: వచ్చిన సంస్కారం, తల్లిదండ్రుల శిక్షణ, నేర్చిన విద్య, పెరిగిన ఆశ్రమ వాతావరణం ఆమెను తపశ్చర్య వైపు మళ్లించాయి. నిత్యం తపస్సులో లీనమై చిత్త శాంతిని పొందటానికి కృషి చేస్తున్నది. అలా తీరని శోకంతో, సహంచలేని వేదనతో ఉన్న ఘోష మనస్సులో ఎదో మెరుపు మెరిసిన్లటనది- అది ”అవును. తన తండ్రి కక్షీవంతుడు కూడా ఒకసారి తీవ్ర వ్యాధిగ్రస్తుడయ్యాడు. అప్పుడు అశ్వినీ దేవతలను ప్రసన్నం చేసుకుని వ్యాధి నుండి విముక్తిని పొందాడు. ఇప్పుడు తానూ అదే పని చెయ్యాలి” అని. ”తాను ఈ దురవస్థను ఇంతకాలం అనుభవించాలని బ్రహ్మ తన లలాటాన లిఖించాడు కాబోలు.”
తండ్రి మార్గాన్ని అనుసరించాలని నిశ్చయించుకుంది. ఏకాగ్ర చిత్తంతో కూర్చొని వున్నది. క్రమంగా ఆమెలో బాహ్యస్మృతి తొలగిపో యింది. అంతర్ముఖి అయ్యింది. ఆమె ప్రమేయం లేకుండానే, ఆమె హృద య కుహరంలో నుండి అశ్వనీ దేవతాకమైన సూక్తులు వెలువడుతు న్నాయి. మనో నేత్రంతో దర్శించగలుగుతున్నది.
”ఎంత మనోహరంగా వున్నాయి ఆ సూక్తులు! వీటిని తన మనోనేత్రం ముందు ఉంచుతున్న ఆ అగోచర శక్తి ఎవరు? తను ఆ సూక్తుల్ని అంత స్పష్టంగా ఎలా దర్శించగలుగుతున్నది. ఈ ఇద్దరు అలౌకిక సౌందర్య మూర్తులు ఎవరు? వీరేనా అశ్వినీ దేవతలు?”
”ఘోషా! మేము అశ్వినీ దేవతలం. నీ ప్రార్థనకు సంతుష్టులమై నీ కోరి కలు నెరవేర్చడానికి వచ్చాము. కళ్ళు తెరు” అన్నారు. ఘోషకు బాహ్య స్మృతి వచ్చింది. కళ్ళు తెరిచింది. ”నా జన్మ ధన్యం అయ్యింది. ” అంది.
”ఘోషా! వేద సూక్తులు అపౌరుషేయాలు. వాటిని దర్శించగలగటమే మహాభాగ్యం. ఆత్మజ్ఞానం కలవారికే అది సాధ్యం. ఇన్ని సంవత్సరాలుగా నియమనిష్టలతో నీవు చేసిన తపస్సు ఫలించింది. తప: ఫలితంగా ఆత్మజ్ఞాన సౌందర్యాన్ని పొందగలిగావు. కనుకనే మంత్రద్రష్టవు కాగలిగావు. ఇప్పుడు మేము నీకు ¸°వనాన్నీ, బాహ్య సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నా ము. అంతేకాదు, ఘోషా! నీకు పతిని, సంతానాన్ని కూడా అనుగ్ర#హస్తున్నా ము. నీవు ధన్యజన్మవు” అని ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు.
కాలం గడిచింది. ఆమె జీవితంలో ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకున్నాయి. యజ్ఞవేదిక వలె పవిత్రంగా, మనోహరంగా ఉన్నది ఘోష. ఆమె పక్కన కూర్చొని వున్నాడు ఆమె పతి. శ్రద్ధగా నిర్వ#హంచబడిన యజ్ఞఫలం వంటి వారి కుమారుడు కురంగ శాబకంతో ఆడుతున్నాడు.
– మారేపల్లి భువనేశ్వరి, 9550241921

Advertisement

తాజా వార్తలు

Advertisement