Sunday, July 7, 2024

దేవుని పూజకు శ్రేష్టం మనోపుష్పం!


సాధారణంగా అందరూ పూజ ద్వారా భగ వంతునికి పుష్పాలు, ఫలాలు సమర్పిస్తా రు. వృక్ష సంపదలో పూలు ప్రకృతి పరంగా లభించేవి. అవి నిర్మలమైనవి- అందమైనవి- కోమలమైనవి- సుకుమారమైనవి. ఆరాధిం చే భగవానుని రూపం ప్రకృతి ప్రతి రూపం. నిర్మలమైన మనసుతో ప్రకృతి ప్రసాదించు పూలు ఆ భగవానునికి అర్పించడం మన మనసును అందంగా కోమలముగా ఉంచు కునేందుకు ఉపయోగపడాలి అనే ఆలో చనకు దర్పణం. పూలు భగవంతునికి పూజ ద్వారానే కాదు, ఏవిధంగానైనా సమర్పించవచ్చు. కారణం భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా వు న్నాడు. అన్నింటిలోను వున్నాడు. ఒక్క విగ్రహం లోనే కాదు. లోకమంతా ఆయనే. అన్ని రూపాలు ఆయనవే. లోకంలో ఎవరికి ఏమి సమర్పించి నా ఆయనకు సమర్పించినట్టే.
ఒక రకంగా విగ్రహానికి సమర్పించే వాటి కంటే లోకానికి సమర్పించినవే ఆయనకు చెం దుతాయి. లోకానికి ఇచ్చేదే భగవంతునికి ఇచ్చిన ట్టు. విగ్రహానికి సమర్పించిన పుష్పాలు వాడిపోతా యి. వాడిపోయే పుష్పాలు భగవంతుడేమి చేసుకుం టాడు? ఈ భూమండలం మీద వున్న సమస్తమూ ఆయనవే. ఆయన సృష్టి. ఆయనవి, ఆయనకివ్వడంలో గొప్పతనం ఏముంది? అవి ఆయనకు ఆనందాన్ని కలిగిం చవు. మనవి ఇవ్వాలి. అవి విగ్రహానికి కాదు. ఆయనకు చెం దేట్లుగా ఇవ్వాలి. ఆనందాన్ని కలిగించేవిగా వుండాలి. అలాం టి పుష్పాలు సమర్పించాలి. అప్పుడే భగవంతుడు ఆనందిస్తా డు. మనల్ని అనుగ్రహస్తాడు.
భగవంతునికి ఆనందం కలిగించే పుష్పాలు వాడిపోయే పనికి రానివి కాదు. వాడిపోని లోక కళ్యాణకరమైన ”సుగుణాలనే పుష్పా లు” సమర్పించాలి. మంచి గుణాలు కలిగి వుండి, వాటి ద్వారా లోకా నికి ఉపకారం చెయ్యాలి. లోకమే భగవంతుడు కాబట్టి; లోకానికి కలి గించే ఆనందం భగవంతునికి కలిగించినట్టే. అవి భగవంతునికి సమ ర్పించి నట్టే. అందుచేత గుణాలనే పుష్పాలే భగవంతునికి ఇష్టమైనవి.
దేవునికి ఇష్టమైన పుష్పాలు. అహంస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూ త దయ, ధర్మం, ప్రేమ, శాంతి, ధ్యానం, సత్యం.
అహంసా పుష్పం : దేవుని ఆరాధించాలంటే ప్రప్రథమంగా అహంసా పుష్పాన్ని సమర్పించాలి. దేవునికి ఇష్టమైన మొదటి పుష్పం ఇదే. అంటే ఎవ రిని #హంసించ కూడదు. ఏ జీవిని, ప్రాణిని చంపకూడదు ఇంకామాంస భక్షణ చేయకూడదు.
ఇంద్రియ నిగ్ర#హ పుష్పం : అలాగే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రి యాల మీద అదుపు కలిగి ఉండాలి. అలావుంటే చేయకూడని పను లు చెయ్యం. లోకానికి చెడు జరగదు.
సర్వభూత దయా పుష్పం : అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ కలిగి ఉం డాలి. అప్పుడు దేవుడ్ని మనమీద దయ చూపించమని కోరనక్కర లేదు. మన క్రింది వారి మీద మనం దయ చూపిస్తే, ఆ పైవాడు మన మీద దయ చూపిస్తాడు.
ధర్మ పుష్పం : అంతరాత్మ రూపంలో భగవంతుడు చెప్పే ధర్మాలు ఆచరించాలి. అంటే అంత రాత్మ ప్రబోధం వినాలి. అంటే భగవంతుడు చెప్పినట్టు వినాలి.
ప్రేమ పుష్పం : తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో అందరినీ అంటే మానవులనే కాదు అన్ని జంతువులను అలాగే ప్రేమించాలి.
శాంతి పుష్పం : శాంతిని పంచాలి, అంటే లోకంలో వున్న వాటిని శాంతిగా జీవించనివ్వాలి. సుఖంగా ఉండనివ్వాలి. మన వల్ల ఎవరికి, ఏ ప్రాణికి నష్టం జరగకూడదు. ఏ కష్టం కలగకూడ దు. అప్పుడే అన్నీ సుఖంగా, శాంతిగా వుంటాయి. అంతేకాని ”లోకా సమస్తా సుఖినో భవన్తు” ”ఓం శాంతి: శాంతి: శాంతి:” అంటే సరిపోదు.
ధ్యాన పుష్పం : పై గుణాలన్నీ కలిగి వుండాలన్నా, ఆచరించ గలగాలన్నా ధ్యానం చెయ్యాలి. ధ్యాన వుష్టంతో అన్ని రకాల పుష్పాలు సంపాదించుకోగలం. దేవునికి సమర్పించగలం.
సత్య పుష్పం: పై పుష్పాలన్ని కలిగి వున్నవాడు సత్యంలో జీవిస్తాడు. సత్యాన్ని తెలుసుకుంటా డు. సత్యాన్ని ఆశ్రయిస్తాడు. జ్ఞానాన్ని పొందుతాడు. అందుచేత అతి ముఖ్యమైన ఈ అష్ట పుష్పాలను భగవంతునికి సమర్పించాలి. ఈ పుష్పాలను భగవంతుడు అత్యంత ప్రీతితో స్వీక రిస్తాడు. స్వీకరించడమే కాదు. అనుగ్రహస్తాడు కూడా.
బాహ్య ప్రపంచంలో కనపడే రంగు రంగుల పూల కన్నా అంతరింద్రియవనంలో విరిసే అహంస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే 8 పూలు భగ వంతునికి ఇష్టమని చెపుతారు. ఒకేసారి ఇంత భావనా శక్తి అబ్బదు. కాబట్టి ముందుగా ర కరకాల మనుషుల మనసు ఎలా స్పందిస్తుందో ఆయా స్పందనలను భగవంతునికి ఆపాదిం చి, అలంకారాలు దగ్గర నుంచి ప్రసాదాలదాకా వైవిధ్యాలు చూపించి పూజ చేయటానికి ఉత్సా హంగా పాల్గొనటానికి ఎన్నో ఏర్పాట్లు. ముందస్తుగా పూజ అంటూ చేయటం అలవాటు అయ్యాక నెమ్మదిగా అందులో లీనమవటం సాధ్యపడుతుంది. ధియోయోన: ప్రచోదయాత్‌ (బుద్ధిశక్తిని పెంపొందించు)అని కదా అడుగుతాం.
దృష్టి భగవంతుని వైపుకు మరల్చి మనలో ఆరాధన భావం పెంచడానికి పెద్దలు, సోమ వారం శివునికి బిల్వ, మారేడు పత్రాలు ఇష్టం. సాయిబాబాకి గురువారం కోవా ప్రసాదం ఇష్టం శుక్రవారం లలితా దేవికి పాయసం ఇష్టం, ఇలా ఏదో ఒక పూజా విధానములోనో, స్తోత్రంలోనో తీసుకుని వచ్చేరు. ఇష్టాయిష్టాలు మనుషులకే గానీ భగవంతుని ఉండవు. అలాగే సుగంధ భరిత పుష్పాలు ఏవైనా పూజకు మంచివే. అన్నింటికన్నా ”మనోపుష్పం” శ్రేష్టమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement