” చంద్ర దర్శనానికి సాగరుడు పొంగుతాడు. అలాగే తన దర్శనాన్ని తీవ్రంగా అభిలషించే వారి ఉత్సాహాన్ని శ్రీమన్నారాయణుడు ఇనుమడింప చేస్తాడు. సాగరాన్ని చంద్రుడు పొంగించినట్లు, భక్తుల ఆశా సముద్రాన్ని శ్రీమన్నారాయణుడు రెండింతలు చేస్తాడు. ”
సర్వ వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా, శశిని కలంక కలేవ
నిమగ్నా కేశవ ధత సూకర రూప జయజగదీశ హరే!!
అని జయదేవ మహాకవి దశావతార స్తుతి. అంటే వరాహ అవతారం ఎత్తిన ఓ కేశవా! నీ కోర ల మీద నిలపబడియున్న ఈ భూగోళం మచ్చ లున్న చంద్రుని వలె ఉన్నది.
హందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల లో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱ కు, దుష్ట శిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాల లో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏక వింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవ తారము వరాహ అవతారము. మహాలక్ష్మిని సం బోధించే ”శ్రీ” పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావ తారం హరణ్యాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరిం చి, వేదముల ను కాపాడిన అవతారము. ఐతే ఈ వరాహావతా ర ఉద్భవానికి కారణం వైకుంఠంలో జరిగిన ఒక సంఘటన.
ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు దర్శనం కోసం సనకసనందనా ది మహా ఋషులు వైకుంఠానికి చేరుకుంటారు. వైకుంఠ ద్వారపాలకులై న జయ, విజయులు స్వామివారి దర్శనా నికి అది సరైన సమయం కాదని వారిని లోపలికి పంపించడానికి అనుమతించరు. దీంతో ఆగ్రహానికి గురై న ఋషులు ద్వారపాలకులైన జయ విజయులను ఏ స్వామి వారి సన్నిధి లో అయితే ఉన్నావని గర్వపడుతున్నారో, అతని సేవకు దూరమవుతార ని శపించారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు జయ విజయులతో ”మహా మునుల శాపం మీరరానిది నా పట్ల మిత్ర భావంతో ఉండి ఏడు జన్మల తరువాత తిరిగి వైకుంఠం చేరుకుంటారా? లేక నాతో శత్రుత్వం పెంచుకొని నా చేతిలో మరణించి మూడు జన్మలకు తిరిగి వస్తారా?” అని అడుగగా జయ విజయులు స్వామివారి కోసం మూడు జన్మలే కోరుకుంటారు. ఈ విధంగా జయవిజయులు స్వామి వారి పట్ల ఉన్న భక్తిని చూసి చలించిపోయిన మునులు ఎలాగైనా తమను మన్నించ మని స్వా మి వారిని వేడుకుంటారు.
ఆ విధంగా మునుల శాపం వల్ల జయ విజయులు భూమిపైన హర ణ్యాక్షుడు, హరణ్యకశిపుడిగా అవతరిస్తారు. హరణ్యాక్షుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకున్నాడు. హరణ్యకశిపుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి, ఏకంగా భూ మిని దొర్లించుకుపోయి సముద్రంలోకి తోశాడు. భూమి మునిగిపోవడం తో భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధ రించమని మొరపెట్టుకుంది. మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్ర హ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పన చేశాను. ”స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే” అని సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించాడు.
బ్రహ్మ, పృధ్విని గురించి చింతిస్తూ, దానిని ఉద్ధరించుటకు ఆలో చించసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు ఆకా రమంత ఒక వరాహ శిశువు ఉద్భవించాడు. చూస్తుండగానే అది పర్వతా కారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని స్తుతించసాగె ను. బ్రహ్మ స్తుతించుచుండ వరాహస్వామి ప్రసన్నుడయ్యెను. వరాహ స్వామి జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవే శించెను. జలమందు న్న పృధ్విని తన కోరలపై తీసికొని నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమ వంతుడైన హరణ్యాక్షుడు జలమందే గదతో వరాహస్వామితో తలపడె ను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహస్వామి క్రోధముతో హరణ్యాక్షుని వధించెను. జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మాది దేవతలుగాం చి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహస్వామి తన గిట్టలతో జలమును అడ్డగించి దానిపై పృధ్వి ని స్థాపించెను. పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమి మీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అయితే తిరుమలకొండపై ఉండేందుకు వేంకటేశ్వర స్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే. వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు. ఆది వరాహస్వామిగా, ప్రళయ వరాహస్వామి గా, యజ్ఞ వరాహస్వామిగా, ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆది వరా హ స్వరూపము. వరాహ స్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసు డు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తా డు. శ్రీనివాసుడే… శ్రీ మహా విష్ణువని గ్రహ స్తాడు ఆదివరాహస్వామి. వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీని వాసుడు తెలుసుకుంటాడు. మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటిం చుకుంటుంటే… ముక్కోటి దేవతలు మురిసిపోయారట.
”యజ్ఞ వరాహమూర్తీ! యజ్ఞ స్వరూపుడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞ రక్షకుడవు. సమస్తమూ నీవే. సత్త్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనసు పవిత్రమవుతుంది. ”ఓ దేవదేవా! నీకు మా నమస్కారము” అంటూ దేవతలు కీర్తించారు. అందుకే తిరుమలలోని వరాహస్వామిని ముందు గా దర్శించాకే వేంకటేశ్వరుని దర్శించడం ఆనవాయితీ.