Saturday, November 23, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

4మంత్రము:

ఏష సర్వేశ్వర: ఏష సర్వజ్ఞ: ఏషోంతర్యామీ ఏష యోని:
సర్వస్య ప్రభవాప్య¸° హి భూతానాం||

ఇంతవరకు చెప్పిన మూడు స్వరూపములు. ఇకపై చెప్పబోవు నాల్గవ స్వరూపము కలవాడు సర్వేశ్వరుడైన పరమాత్మయే. ఈయనే జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, ముక్తి దశలలో వస్తువులన్నింటినీ తెలుసుకొనినవాడు, అంతేకాక ఈయనే వస్తువులన్నింటిలోని లోపల ఉండి నియమిస్తూ ఉంటాడు. ఈ చేతనాచేతన మొత్తం ప్రపంచానికే స్థానమైనవాడు. అన్ని ప్రాణుల యొక్క జన్మ స్థితి లయములకు కారణమైనవాడు ఈ పరమాత్మయే కదా!

- Advertisement -

కనుక జాగ్రత్‌ దశలో చక్షురీంద్రియాన్ని స్థానముగా కలిగి యుండి బాహ్యార్థజ్ఞానాన్ని కల్గిస్తాడన్నా, స్వప్నదశలో కంఠస్థానముగా కలిగి యుండి స్వప్నపదార్థ జ్ఞానాన్ని కలిగిస్తాడన్నా, సుషుప్తిదశలో జీవునికి సుషుప్తిస్థానమై తానే ఉంటాడన్నా వేరువేరు పదములతో వ్యవహరింపబడుతున్న ఆయా స్వరూపాలు కల్గిన పరమాత్మ ఒక్కడే. వేరువేరుకాదని తెలియజేస్తూ పరమాత్మయొక్క నాలుగవ స్వరూపమును తర్వాత మంత్రములో తెలియజేస్తోందీ ఉపనిషత్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement