Thursday, November 14, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

చతుర్థ ఖండము

1వ మంత్రము :
అమాత్రశ్చతుర్థో వ్యవహార్య: ప్రపంచోపశమ: శివోద్వైత:
ఏవం ఓంకార ఆత్మైవ సంవిశత్యాత్మనాత్మానం
య ఏవం వేద య ఏవం వేద|

ప్రణవంలోని 4వ అంశము నాదము. ఈ నాదస్వరూపుడే వ్యూహ వాసుదేవుడు. ఇతడు దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనివాడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. సమస్త ప్రణవ ప్రతిపాద్యుడైన పరమాత్మకు, ఇతనికి లేదా లేనందున ఇచట నాదరూపి ప్రత్యేకముగా చెప్పబడలేదు. ఈ పరమాత్మ ఇలా ఉండునని వాగీంద్రియముచేత చెప్పరానివాడు. తనను ఆశ్రయించినవారి ప్రకృతిబంధములను నశింపచేయువాడు, పరమ మంగళస్వరూపుడు. తనవంటి మరియొక్క వ్యక్తియే లేనివాడు. ఈ ఓంకారము పరమాత్మయే.

- Advertisement -

ఇట్లు ఓంకారము యొక్క జ్ఞానం కలవాడు పరమాత్మ అనెడు ఉపాయము చేతనే పరమాత్మను పొందును, అని ఈ మన్త్రముతో ఉపనిషత్‌ ముగించబడుచున్నది. ముగింపులో చివరిపాదమును రెండుసార్లు ఉచ్చరించడం ఉపనిషత్‌ సాంప్రదాయము. ఈ 12మంత్రములతో కూడినదే ‘మాండూక్యోపనిషత్‌’. ఇంకా ఇతర మంత్రములున్నట్లు భావించువారంతా, అవి గౌడపాదకారికలని గుర్తించవలసి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement