Monday, November 25, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

2). సర్వం హి ఏతత్‌ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ,
సోయమాత్మా చతుష్పాత్‌

ప్రణవ ప్రతిపాద్యుడు చేతనాచేతనములన్నింటిలోను ఆత్మగా ఉన్నాడుకదా! అయితే ఒక్కొక్క చోట ఈ పరమాత్మకు సంబంధించిన కొంత కొంత భాగముండునెమో? అనెడు ఈ శంకను ఈ మంత్రము తొలగించుచున్నది. అట్లే జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, ముక్తి రూపములగు నాలుగుదశలలోనూ జీవునిలో పరమాత్మ నాలుగు స్వరూపములతో ఉండునని ఈ మంత్రము సంగ్రహముగా తెలియచేయుచున్నది. ఈ పరమాత్మయే సర్వం అనగా ఈ పరమాత్మ తానున్న ప్రతిచోట పరి పూర్ణముగానే ఉన్నాడని తాత్పర్యము.

ఈ చరాచరసృష్టిని చేయు చతుర్ముఖబ్రహ్మ, స్వర్గాధిపత్యం వహించే ఇంద్రుడు మొదలైన జీవులు ఎవరూకూడా తాము స్వతంత్రించి చేయువారలుకారు. బ్రహ్మసూత్రములలో వేదవ్యాస భగవానులు పరాయత్తాధికరణములలో ఈ విషయమునే నిష్కర్షించి చెప్పారు. ఏ జీవి అయిన లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మకు లోబడే ప్రవర్తించును. పరమాత్మ కూడా జీవుని లోపల నియామకునిగా తానుండి అతని ప్రతి ప్రయత్నమును కనిపెట్టుచూ అనుమతిచ్చి ప్రవర్తింపజేయును. కనుకనే జీవుడు తాను సంకల్పించినవన్నీ, సంకలి ్పంచినట్లు నెవరేర్చుకొనలేకున్నాడు. సంకల్పం చేయడం వరకే జీవునికి స్వాతంత్య్రమున్నా, నెరవేర్చడం, నెరవేర్చకపోవడం పరమాత్మ అధీనమేనని నిర్ణయించి చెప్పారు, కనుక, బ్రహ్మాది జీవులకును నియామకుడుగా, ఆత్మగా ఉండి వారి ద్వారా ఆయా పనులు నిర్వర్తింపచేసేది ఈ ప్రణవ ప్రతిపాద్యుడైన పరమాత్మయే అని వివరించబడినది. ఇక జీవులకి జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, ముక్తి రూపములయిన నాలుగు దశలు ఉండును.

- Advertisement -

ఈ నాలుగు దశలలోని జీవులలో ఈ పరమాత్మయే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ నామములతో ఉండునని ఈ మంత్రమే పరమాత్ముని ‘చతుష్పాత్‌’ అని చెప్పుచున్నది. పదములు అనగా స్వాఅంశాములు. స్వాంశములు అంటే స్వస్వరూపములే అని తాత్పర్యము. ఈ నాలుగూ పరమాత్మ అంశములేనని ఈ మస్త్ర తాత్పర్యము. జీవి మేల్కొని ఉన్నప్పటికి, కలను అనుభవిస్తున్నా, గాఢని ద్రను పొందినా, చివరికి ముక్తి పొందినా, ఏ దశలో ఉన్నా వీడక ఆయా అంశతో ఆయా దశలోని జీవికి అన్తర్యామిగా తానుండి నియమించి నడింపిచేవాడు ఓంకార ప్రతిపాద్యుడైన పరమాత్మయే అని ఈ మంత్ర తాత్పర్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement