Tuesday, November 12, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

2వ మంత్రము :

జాగరిత స్థానో వైశ్వానర: అకార: ప్రథమామాత్రా
ఆప్తేరాదిమత్వాత్‌ వా ఆప్నోతి హవై సర్వాన్‌ కామాన్‌,
ఆదిశ్చ భవతి య ఏవం వేద|

పరమాత్మ వ్యస్తప్రణవముచేత ప్రతిపాదించబడు విధానము ఈ మన్త్రమునుండి వివరించబడుచున్నది. ప్రణవములోని మొదటి మాత్ర అయిన అకారము జాగ్రత్‌ దశా నిర్వాహకుడైన జాగరిత స్థానుడగు వైశ్వానరునికి వాచకమగును. వైశ్వానరునికిని, అకారమునకును సామ్యం ఏమిటి అంటే, ఆప్తి(వ్యాప్తినిబట్టి)గాని, ఆదిమంత్రము(అన్నింటికంటె మొదట ఉండుట)కాని సమాన ధర్ములు అని శ్రుతి చెబుతుంది.

అకారము అన్ని వాక్కులలోను వ్యాపించి ఉండునట. ”అకారోవై సర్వావాక్‌” అని మరొకచోట శ్రుతియే చెప్పుచున్నది. ఇట్లు అకారము అన్ని వాక్కులలోనూ వ్యాపించిఉన్నట్లే, వైశ్వానరుడు కూడా జగత్తంతా వ్యాపించి ఉన్నాడు.

- Advertisement -

”తస్యహవై తస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవసుతేజా:చక్షుర్విశ్వరూప: ప్రాణ: పృథగ్‌వర్త్మా, సందేహా బహులు, వస్తిరేవరయి: పృథివ్యేవ పాదౌ” అనే శ్రుతి వైశ్వానరుడి స్వరూపాన్ని వర్ణిస్తూ పృథినీ ఆయన పాదస్థానీయమని ప్రారంభించి, ద్యులోకము ఆయన మూర్థస్థానమంటూ ఆయన జగద్వ్యాప్తిని ఉపదేశించుచున్నది. ఈ విధంగా అన్ని అక్షరాలలో వ్యాపించి ఉండటంలో అకారము, అన్ని లోకాలలో వ్యాపించి ఉండటంలో వైశ్వానరుడు సమానధర్మము కలిగివున్నారు. అట్లే ”అకారము” అన్ని అక్షరములకి మొదట ఉండునది. ఇక వైశ్వానర స్వరూపము వైశ్వానర తైజస ప్రాజ్ఞతురీయ స్వరూపములు నాల్గంటిలోను మొదటిదికదా!

కనుక ప్రణవములోని ప్రథమమాత్ర అయిన అకారాన్ని వైశ్వానరుడు అనవచ్చును. ఈ విధంగా అకారవాచ ్య, వైశ్వానరుని యొక్క వ్యాప్తిని, ఆదిమత్వాన్ని తెలిసికొని ఉపాసించినవాడు. అన్ని భోగములను పొందును. అందరిలోనూ ప్రధానుడుగా ఉండను అని ఫలితమును కూడా ఈ మంత్రము చెప్పుచున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement